AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DMart: నెలలో ఏ రోజు డీమార్ట్‌కి వెళ్తే మంచిది..? చాలా మందికి తెలియని ట్రిక్

మధ్యతరగతి కుటుంబాలకు ఇష్టమైన డీమార్ట్‌లో తక్కువ ధరల్లో నిత్యావసరాలు లభిస్తాయి. అయితే, నెల మొదటి వారం, వారాంతాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. రద్దీని నివారించి, ప్రశాంతంగా షాపింగ్ చేయడానికి నెల మధ్యలో (10-25వ తేదీ), ముఖ్యంగా సోమవారం నుండి గురువారం వరకు, ఉదయం లేదా మధ్యాహ్నం ప్రారంభ సమయాల్లో వెళ్లడం ఉత్తమం.

DMart: నెలలో ఏ రోజు డీమార్ట్‌కి వెళ్తే మంచిది..? చాలా మందికి తెలియని ట్రిక్
Dmart
SN Pasha
|

Updated on: Jul 08, 2026 | 3:33 PM

Share

మధ్యతరగతి కుటుంబాలకు తక్కువ ధరల్లో నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసేది ఎక్కడంటే.. చాలా మంది చెప్పే సమాధానం డీమార్ట్. ఒకే చోట కిరాణా నుంచి గృహోపకరణాల వరకు అన్నీ లభిస్తుండటంతో దేశంలోని దాదాపు ప్రతి నగరంలో డీమార్ట్ స్టోర్ల వద్ద ఎప్పుడూ రద్దీ కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ రద్దీని తప్పించుకుని ప్రశాంతంగా షాపింగ్ చేయాలంటే ఏ రోజుల్లో వెళ్లాలి అనే సందేహం చాలామందికి ఉంటుంది.

ప్రముఖ వ్యాపారవేత్త రాధాకిషన్ దమానీ 2002లో ప్రారంభించిన డీమార్ట్ ప్రస్తుతం దేశంలో అతిపెద్ద రిటైల్ చైన్‌లలో ఒకటిగా ఎదిగింది. వినియోగదారుల కొనుగోలు అలవాట్లను పరిశీలిస్తే నెల ప్రారంభంలోని మొదటి వారం, ముఖ్యంగా 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు స్టోర్లలో అత్యధిక రద్దీ నమోదవుతోంది. ఈ సమయంలో పార్కింగ్ స్థలాలు నిండిపోవడమే కాకుండా, బిల్లింగ్ కౌంటర్ల వద్ద కూడా పొడవైన క్యూలు కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో బిల్లు చెల్లించడానికి చాలా సమయం వేచి ఉండాల్సి వస్తోంది.

నెల మొదటి వారంలో రద్దీ పెరగడానికి ప్రధాన కారణం ఉద్యోగులకు జీతాలు అందే సమయమే కావడం. జీతం అందుకున్న వెంటనే కుటుంబాలు నెలకు అవసరమైన కిరాణా సామగ్రి, గృహోపకరణాలు, ఇతర నిత్యావసర వస్తువులను ఒకేసారి కొనుగోలు చేయడానికి డీమార్ట్‌ను ఆశ్రయిస్తాయి. ఇదే సమయంలో శనివారం లేదా ఆదివారం వస్తే కుటుంబ సభ్యులంతా కలిసి షాపింగ్‌కు రావడంతో రద్దీ మరింత పెరుగుతుంది. అధిక రద్దీ కారణంగా వినియోగదారులు ఎక్కువ సమయం వేచి ఉండాల్సి రావడమే కాకుండా, ఆఫర్లలో ఉన్న కొన్ని ప్రముఖ ఉత్పత్తుల స్టాక్ కూడా త్వరగా అయిపోతుంది. దీంతో అనుకున్న వస్తువులు దొరకకపోవడం కూడా సాధారణంగా జరుగుతోంది.

అయితే ప్రశాంతంగా వేగంగా షాపింగ్ పూర్తి చేయాలనుకునే వారికి నెలలో 10వ తేదీ నుంచి 25వ తేదీ మధ్య కాలం అనుకూలంగా ఉంటుందని రిటైల్ రంగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా సోమవారం నుంచి గురువారం వరకు వెళ్లితే రద్దీ తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే స్టోర్ తెరిచిన వెంటనే ఉదయం లేదా మధ్యాహ్నం ప్రారంభ సమయంలో వెళ్లడం ద్వారా బిల్లింగ్ క్యూలు కూడా తగ్గి, తక్కువ సమయంలోనే షాపింగ్ పూర్తి చేసుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us