AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Central Government Scheme: కేంద్రం అదిరిపోయే పథకం.. ప్రతీ మూడు నెలలకు ఒకసారి అకౌంట్లోకి రూ.50 వేలు.. ఆధార్ ఉంటే చాలు..

కేంద్ర ప్రభుత్వం అనేక పొదుపు పధకాలను అందుబాటులోకి తెచ్చింది. వాటిల్లో సీనియర్ సిటిజన్ల కోసం ఒక అద్బుతమైన స్కీమ్ ఉంది. అందే సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్. ఈ స్కీమ్‌లో ఎలా పెట్టుబడి పెట్టాలి. వడ్డీ ఎంత వస్తుంది.. అనే విషయాలు చూద్దాం.

Central Government Scheme: కేంద్రం అదిరిపోయే పథకం.. ప్రతీ మూడు నెలలకు ఒకసారి అకౌంట్లోకి రూ.50 వేలు.. ఆధార్ ఉంటే చాలు..
Money
Venkatrao Lella
|

Updated on: Jul 08, 2026 | 4:25 PM

Share

చిన్న మొత్తంలో డబ్బులు పొదుపు చేసుకుని దీర్ఘకాలంలో ఎక్కువ నగదు పొందాలనుకునేవారి కోసం అనేక సేవింగ్స్ స్కీమ్స్‌ను కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. అందులో పోస్టాఫీస్ స్కీమ్స్ బాగా పాపులర్ అయ్యాయి. ఇతర పెట్టుబడి పథకాలతో పోలిస్తే పోస్టాఫీస్ పథకాల్లో ఎక్కువ వడ్డీ ఉంటుంది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ హామీ కూడా ఉండటంతో నగదుకు పూర్తి భద్రత, రక్షణ ఉంటుంది. దీంతో పోస్టాఫీస్ పథకాల్లో ఎక్కువమంది పెట్టుబడి పెడుతూ ఉంటారు. వాటిల్లో అత్యంత ప్రజాదరణను సొంతం చేసుకున్న పథకం ఒకటి ఉంది. అదే పోస్టాఫీస్ సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్. అసలు ఈ పథకంలో పెట్టుబడి పెడితే ఎంత లాభం వస్తుంది..? వడ్డీ ఎంత? ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? అనే విషయాలు ఒకసారి తెలుసుకుందాం.

ప్రతీ మూడు నెలలకు ఒకసారి ఆదాయం

ఎలాంటి రిస్క్ లేకుండా మంచి ఆదాయం పొందాలనుకునేవారికి సీనియర్ సిటిజన్స్ స్కీమ్ అనేది మంచి ఆప్షన్. ప్రస్తుతం ఈ స్కీమ్‌కు వడ్డీ 8.20 శాతంగా ఉంది. ప్రతీ మూడు నెలలకు ఒకసారి మీ బ్యాలెన్స్‌పై వడ్డీని జమ చేస్తారు. అంటే త్రైమాసికానికి ఒకసారి నిధులు జమ చేస్తారు. ఒకేసారి ఈ అకౌంట్లో రూ.24.40 లక్షలు జమ చేస్తే.. ప్రతీ మూడు నెలలకు రూ.50 వేలు అకౌంట్లో పడతాయి. ఏడాదికి రూ.2 లక్షల వడ్డీ వస్తుంది. ఐదు సంవత్సరాల్లో మొత్తం రూ.10 లక్షలు వడ్డీ రూపంలో అందుతాయి. ఈ స్కీమ్ మెచ్యూరిటీ పీరియడ్ ఐదేళ్లు మాత్రమే. దీంతో ఐదేళ్ల తర్వాత ఇన్వెస్ట్ చేసిన అమౌంట్‌తో పాటు వడ్డీ కూడా విత్ డ్రా చేసుకోవచ్చు. ప్రతీ త్రైమాసికానికి కేంద్రం వడ్డీ రేట్లలో మార్పులు చేస్తూ ఉంటుంది. పెంచడం లేదా తగ్గించడం లాంటివి చేస్తూ ఉంటుంది. యాథాతధంగా ఉంచడమే ఎక్కువగా జరుగుతూ ఉంటుంది.

బెనిఫిట్స్ ఇవే..

ఈ స్కీమ్‌లో కనీస పెట్టుబడి రూ.వెయ్యి నుంచి స్టార్ట్ చేయవచ్చు. గరిష్టంగా రూ.30 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. అంతకంటే ఎక్కువ అమౌంట్ పెట్టుబడి పెట్టడం కుదరదు. అంతకంటే ఎక్కువ డిపాజిట్ చేసినా అదనపు డిపాజిట్ అకౌంట్‌కు రియింబర్స్‌మెంట్ చేస్తుంది. అదనపు అమౌంట్‌పై పోస్టాఫీస్ సేవింగ్స్ వడ్డీ రేట్లు వర్తిస్తాయి. పోస్టాఫీస్ మెచ్యూరిటీ కాలపరిమితి 5 ఏళ్లు ఉంటుంది. ఆ తర్వాత మూడేళ్ల పాటు పొడిగించుకోవచ్చు. ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టంలోని సెక్షన్ 80సీ కింద రూ.1.50 లక్షల వరకు పన్ను మినహాయింపులు పొందవచ్చు. ఇక ఈ అకౌంట్ తెరవడం చాలా సింపుల్. కేవలం ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది.

Follow Us