Poco M4 Pro: గుడ్‌న్యూస్‌.. రూ.15 వేల ఫోకో స్మార్ట్‌ఫోన్‌ రూ.11,499కే.. అద్భుతమైన ఫీచర్స్‌

Poco M4 Pro: ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ సేవింగ్ డేస్ సేల్ జరుగుతోంది. ఈ సేల్‌లో భాగంగా ఆ సమయంలో Poco M4 Pro స్మార్ట్‌ఫోన్ ధర రూ.14999 ఉండగా..

Poco M4 Pro: గుడ్‌న్యూస్‌.. రూ.15 వేల ఫోకో స్మార్ట్‌ఫోన్‌ రూ.11,499కే.. అద్భుతమైన ఫీచర్స్‌
Poco M4
Follow us
Subhash Goud

|

Updated on: Jul 24, 2022 | 4:10 PM

Poco M4 Pro: ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ సేవింగ్ డేస్ సేల్ జరుగుతోంది. ఈ సేల్‌లో భాగంగా ఆ సమయంలో Poco M4 Pro స్మార్ట్‌ఫోన్ ధర రూ.14999 ఉండగా, ఈ ఆఫర్‌లో రూ.11499కే పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ఈ సంవత్సరం మార్చి నెలలో మార్కెట్లో విడుదలైంది. 6 GB RAM, 64 GB ఇంటర్నల్ స్టోరేజ్ ధర రూ. 14999గా నిర్ణయించింది కంపెనీ. ఇప్పుడు ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 11499కే కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు, కెమెరా సెటప్ గురించి తెలుసుకుందాం.

Poco M4 ప్రో స్పెసిఫికేషన్‌లు

ఈ Poco స్మార్ట్‌ఫోన్ ఇది 6.43-అంగుళాల AMOLED డిస్‌ప్లే,90 Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఇది వినియోగదారులకు మెరుగైన గేమింగ్ అనుభవాన్ని అందించడానికి పనిచేస్తుంది. దీని రిజల్యూషన్ 2400 x 1080 పిక్సెల్స్. ఈ స్మార్ట్‌ఫోన్ MediaTek Helio G96 చిప్‌సెట్‌, 4జీబీ ర్యామ్‌తో వచ్చింది. దీనిలో కంపెనీ లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీని ఉపయోగించింది. ఈ ఫోన్ గరిష్టంగా 8 GB RAM, 128 GB వరకు ఇంటర్నల్‌ స్టోరేజీని పెంచుకునే వెసులుబాటు ఉంది.

ఇవి కూడా చదవండి

Poco M4 Pro కెమెరా సెటప్:

Poco M4 Pro ఫోన్‌ వెనుక ప్యానెల్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్‌ ఉంది. 64 మెగాపిక్సెల్‌ల ప్రైమరీ కెమెరా, సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్‌లు, మూడవ కెమెరా 2 మెగాపిక్సెల్‌. ఇక ఫ్రంట్‌ కెమెరా16 మెగాపిక్సెల్ ఉంది.

Poco M4 ప్రో బ్యాటరీ:

ఈ ఫోన్‌లో 3.5mm హెడ్‌ఫోన్ జాక్, హై-రెస్ ఆడియో సర్టిఫికేషన్‌తో వస్తుంది. దీనికి IP53 స్ప్లాష్ రక్షణ ఇవ్వబడింది. అలాగే దీని బ్యాటరీ సామర్థ్యం 5000 mAh ఉండగా,33 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది. ఇందులో సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి