ప్రధాని నరేంద్ర మోడీ దేశ రైతుల కోసం ఎన్నో రకాల పథకాలను అమలు చేస్తున్నారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు రకరకాల పథకాలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. రైతుల కోసం ప్రవేశపెడుతున్న పథకాల్లో పీఎం కిసాన్ పథకం ఒకటి. ఈ పథకం ద్వారా రైతులు ఏడాదికి రూ.6000 చొప్పున లబ్ది పొందుతున్నారు. ఈ డబ్బులు కూడా ఒకేసారి కాకుండా మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది కేంద్రం. ఇప్పటి వరకు రైతులు 16వ విడత వరకు డబ్బులు అందుకున్నారు. ఇక మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దేశంలోని 9 కోట్ల మందికి పైగా రైతులకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద కానుకను అందించారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 17వ విడతగా రూ.20 వేల కోట్లు విడుదలయ్యాయి. తొలి సంతకం పీఎం కిసాన్ నిధుల విడుదలపై చేశారు.
పీఎం కిసాన్ యోజన ప్రయోజనం అందుకునే రైతులు కేవైసీ చేసుకోవడం తప్పనిసరి. కేవైసీ చేయని రైతులకు 17వ విడత డబ్బులు అందవని కేంద్రం చెబుతోంది. అలాగే బ్యాంకు ఖాతాను ఆధార్ కార్డుతో అనుసంధానం చేయకుంటే వాయిదా ఆగిపోతుంది. రైతులు కేవైసీ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చాలా సార్లు చెబుతూ వస్తోంది. కొందరు రైతులు కేవైసీ చేయలేదని, వారికి వచ్చే విడత డబ్బులు అందవని స్పష్టం చేస్తోంది. అందుకే ఈ విడత డబ్బులు రావాలంటే తప్పకుండా కేవైసీ పూర్తి చేసుకోవాల్సి ఉంటుందని గుర్తించుకోండి.
ఈ పథకం కుటుంబంలోని భర్త, భార్య, వారి మైనర్ పిల్లలకు వర్తిస్తుంది. అయితే ఈ పథకానికి ఉన్నత ఆర్థిక స్థితికి చెందినవారు అనర్హులు అని కేంద్రం తెలిపింది. అలాగే మరికొందరు కూడా ఈ పథకానికి అనర్హులు. వారెవరంటే..
అయితే ఇప్పటివరకు పీఎం కిసాడ్ డబ్బులు పొందిన అర్హత లేనివారు ఇక ఆ నగదును తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేయాల్సి ఉంటుంది. అందుకోసం ముందుగా వీరు పీఎం కిసాన్ అధికారిక వెబ్ సైట్‌కు లాగిన్ అయ్యి.. అక్కడ “రిఫండ్ ఆప్షన్ ” పై క్లిక్ చేయాలి. దీంతో వారు ఇప్పటివరకు పొందిన నగదును కేంద్రానికి తిరిగి ఇవ్వచ్చు.
పీఎం కిసాన్‌లో లబ్ధిదారుల జాబితాలో మీ పేరును ఎలా తనిఖీ చేయాలి?
ఫిర్యాదు ఎలా దాఖలు చేయాలి?
పిఎం కిసాన్ కింద 16వ విడత రూ. 2,000 అందుకోని అర్హులైన రైతు ఎవరైనా పిఎం కిసాన్ హెల్ప్‌డెస్క్‌లో ఫిర్యాదు చేయవచ్చు. మీరు సోమవారం నుండి శుక్రవారం వరకు ఫిర్యాదు చేయవచ్చు. మీరు ఇమెయిల్ పంపడం ద్వారా కూడా మీ ఫిర్యాదును నమోదు చేయవచ్చు.
ఇమెయిల్ ID: pmkisan-ict@gov.in. మరియు pmkisan-funds@gov.in లేదా ఎం-కిసాన్ హెల్ప్‌లైన్ నంబర్ 155261/011-24300606, పీఎం కిసాన్ టోల్-ఫ్రీ నంబర్ 1800-115-526.