PM Kisan Yojana: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM Kisan) తదుపరి విడత నగదు త్వరలో విడుదల కానున్నాయి. ఈ విడత కింద అర్హులైన రైతులకు 2 వేల రూపాయలను కేంద్రం వారి ఖాతాల్లో జమచేయనుంది. అయితే ఈ రెండు వేల రూపాయలను పొందాలంటే రైతులు ఒక ముఖ్యమైన పనిని నిర్ణీత గడువు కంటే ముందే పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ పని ఆలస్యమైతే వచ్చే రూ.2000 జమకావని అధికారులు పేర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కింద రైతులకు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రూ.రెండు వేల చొప్పున మూడు విడతల్లో జమచేస్తుంది. మొత్తం సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రైతులకు రూ.6000 పొందుతారు.
అయితే.. PM కిసాన్ ఇన్‌స్టాల్‌మెంట్ పొందడానికి e-KYCని పూర్తి చేయడం చాలా ముఖ్యం. ఇప్పుడు e-KYC పూర్తి చేయడానికి ఒక వారం మాత్రమే మిగిలి ఉంది. e-KYC పూర్తి చేయడానికి చివరి తేదీ 31 జూలై 2022. PM కిసాన్ కింద నగదు పొందే రైతులు.. e-KYC ప్రక్రియను పూర్తి చేయకపోతే నగదు జమకావు. అందుకే లబ్ధిదారులు eKYCని చివరి తేదీ కంటే ముందే పూర్తి చేయడం చాలా ముఖ్యం.. లేకుంటే రూ. 2000 ప్రయోజనం పొందలేరని సూచిస్తున్నారు.
e-KYC తప్పనిసరి..
పిఎం కిసాన్ నమోదు చేసుకున్న రైతులందరూ తమ ఇకెవైసిని పూర్తి చేయడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వం eKYC చివరి తేదీని పొడిగిస్తూ వస్తోంది. మరోవైపు, PM కిసాన్ పోర్టల్‌లో OTP ఆధారిత eKYC అందుబాటులో ఉంది లేదా బయోమెట్రిక్ ఆధారిత eKYC కోసం సమీపంలోని CSC కేంద్రాలను సంప్రదించవచ్చు. కేంద్ర ప్రభుత్వ ప్రధాన మంత్రి కిసాన్ యోజన 12వ విడత నగదు త్వరలో విడుదల కానుంది. ఇలాంటి పరిస్థితిలో 12వ వాయిదాను పొందాలనుకుంటే eKYCని పూర్తి చేయాలి.. దీనికోసం కింద ఇచ్చిన దశలను అనుసరించండి.
e-KYCని ఇలా పూర్తిచేయండి..
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..