PM Kisan: రైతులకు ముఖ్య అలర్ట్‌.. పీఎం కిసాన్‌ డబ్బులు పొందుతున్నారా? ఈనెల 28లోగా ఈ పని పూర్తి చేయండి.. లేకుంటే 13వ విడత రావు

|

Jan 27, 2023 | 10:52 AM

కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. రైతులకు అమలు చేస్తున్న పథఖాల్లో పీఎం కిసాన్‌ యోజన స్కీమ్‌ ఒకటి. ఈ స్కీమ్‌ ద్వారా రైతులు ఆర్థికంగా ప్రయోజనం పొందవచ్చు..

PM Kisan: రైతులకు ముఖ్య అలర్ట్‌.. పీఎం కిసాన్‌ డబ్బులు పొందుతున్నారా? ఈనెల 28లోగా ఈ పని పూర్తి చేయండి.. లేకుంటే 13వ విడత రావు
Pm Kisan
Follow us on

కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. రైతులకు అమలు చేస్తున్న పథఖాల్లో పీఎం కిసాన్‌ యోజన స్కీమ్‌ ఒకటి. ఈ స్కీమ్‌ ద్వారా రైతులు ఆర్థికంగా ప్రయోజనం పొందవచ్చు. మోడీ సర్కార్‌ రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్‌ పథకం కింద ప్రతి ఏడాది రూ.6000లను అందిస్తోంది. ఈ డబ్బులను మూడు విడతల్లో రూ.2000 చొప్పున అందిస్తోంది. అయితే ఇప్పటి వరకు 12వ విడత డబ్బులు అందుకున్న రైలులు.. ఇప్పుడు 13వ విడత అందుకోనున్నారు. అయితే ఈ డబ్బులు పొందాలంటే ప్రతి ఒక రైతు ఇ-కేవైసీ చేసుకోవడం తప్పనిసరి. కేవైసీ కోసం మీ సేవ కేంద్రాలు గానీ, ఇంట్లోనే ఉండి మొబైల్‌ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఇందు కోసం ఆధార్‌, ఇతర పత్రాలు అందించడం ద్వారా ఇ-కేవైసీ పూర్తవుతుంది. కేవైసీ పూర్తి చేసుకోలేని రైతులు పీఎం కిసాన్‌ ప్రయోజనం పొందలేరని గుర్తించుకోవాలి. ఈ ప్రక్రియను జనవరి 28లోపు చేసుకోవాల్సి ఉంటుంది. ఈలోగా చేసుకోకుంటే ఇబ్బందులు పడతారు. మీకు వచ్చే డబ్బులు నిలిచిపోనున్నాయి. పీఎం కిసాన్‌ కింద నిధులను పొందుతున్న రైతులకు కేవైసీ కోసం ఇప్పటి వరకు గడువు పొడిగిస్తూ వచ్చింది.

కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 12 విడతల డబ్బులను రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయగా, ఇప్పుడు 13వ విడత డబ్బులు రావాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం సంక్రాంతి పండుగకే పీఎం కిసాన్ డబ్బులను విడుదల చేస్తుందని నివేదికలు వెలువడ్డాయి. కానీ డబ్బులు ఇంకా రాలేదు. ఈ నెలాఖరులోగా రైతుల ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పీఎం కిసాన్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఓటీపీ ఆధారంగా ఇ-కేవైసీ పూర్తి చేసుకోవచ్చు. లేదా ఆధార్‌ కార్డు నెంబర్‌, ఆధార్‌తో లింక్‌ అయిన మొబైల్‌ నంబర్‌ ఉంటే కూడా సరిపోతుంది. లేదంటే మీ దగ్గరలోని మీసేవ కేంద్రం, ఆన్‌లైన్‌ సెంటర్ల ద్వారా కూడా ఈ పని పూర్తి చేసుకోవచ్చు.

హెల్ప్‌లైన్ నంబర్‌

మీరు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ఏదైనా సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే దానిని త్వరగా పరిష్కారం పొందవచ్చు. దీని కోసం మీరు హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయడం ద్వారా లేదా మెయిల్ ఐడిలో మెయిల్ చేయడం ద్వారా పరిష్కారాన్ని పొందవచ్చు. పీఎం కిసాన్ హెల్ప్‌లైన్ నంబర్- 155261 లేదా 1800115526 (టోల్ ఫ్రీ) లేదా 011-23381092ను సంప్రదించవచ్చు. మీరు మీ ఫిర్యాదును ఇ-మెయిల్ ID ( pmkisan-ict@gov.in )లో కూడా మెయిల్ చేయవచ్చు. అలాగే మీరు ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోకుంటే pmkisan.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి నమోదు చేసుకోండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి