
PM Kisan Samman: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద అర్హులైన రైతులు ఈ-కేవైసీని సమర్పించాల్సి ఉంటుంది. ఇప్పటికే బ్యాంకులు కూడా ఈ-కేవైసీ చేసుకోవాలని చెబుతుండగా, కిసాన్ నిధి రైతులు కూడా కేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇది వరకు ఈ-కేవైసీ గడువు మార్చి 31, 2022 వరకు ఉండగా, దానిని మే 31,2022 వరకు పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. అలాగే మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది. ఓటీపీ (OTP) ధృవీకరణ ద్వారా చేపట్టే ఆధార్ అధారిత ఈ-కేవైసీ ప్రక్రియను తాత్కాలికంగా రద్దు చేసింది. అర్హులైన రైతులు సీఎస్‌సీ కేంద్రాలకు వెళ్లి బయోమెట్రిక్ అథెంటికేషన్ చేపట్టాలని కేంద్రం సూచించింది.
ప్రధాన మంత్రి కిసాన్ నమోదిత రైతులు ఈ-కేవైసీని తప్పనిసరిగ్గా చేసుకోవాలని పీఎం కిసాన్ సమ్మాన్ నిధి వెబ్‌సైట్‌లో కేంద్రం తెలిపింది. ఈ మేరకు పూర్తి వివరాలకు వెబ్‌సైట్ కు వెళ్లి తెలుసుకోవచ్చని వెల్లడించింది.అయితే ఆధార్ ఓటీపీతో ఈ పని చేయలేరు. ఈ-కేవైసీని పూర్తి చేసుకోవాలంటే రైతులు తమ ఆధార్ కార్డును తీసుకుని సీఎస్‌సీ (కామన్ సర్వీసు సెంటర్)లకు వెళ్లాలని సూచించింది. కాగా, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింది 11వ విడత పొందాలంటే రైతులు ఈ-కేవైసీ చేసుకోవడం తప్పనిసరి. అయితే ఈ స్కీమ్ ద్వారా అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో ఏడాదికి రూ.6వేల చొప్పున జమ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. మూడు వాయిదాలలో రూ.2వేల చొప్పున అందిస్తోంది. పీఎం-కిసాన్ స్కీమ్ అనేది కేంద్ర ప్రభుత్వానికి చెందిన డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్(డీబీటీ) స్కీమ్. అంటే నేరుగా అర్హులైన రైతుల అకౌంట్లోకే ఏడాదికి రూ.6 వేల చొప్పున నిధులను ప్రభుత్వం అందిస్తోంది.
ఇవి కూడా చదవండి: