AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Car Loan: కారు లోన్‌ కోసం చూస్తున్నారా? తక్కువ వడ్డీకి అందించే బ్యాంకులు.. రూ. 5 లక్షల రుణంపై నెలకు ఈఎంఐ ఎంతంటే..

Car Loan: మీరు కారు లోన్‌ కోసం చూస్తున్నట్లయితే తక్కువ వడ్డీకి అందించే బ్యాంకులు కూడా ఉన్నాయి. అది కూడా మీరు రూ.5 లక్షల వరకు కారు లోన్‌ తీసుకుంటే నెలకు ఎంత ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది? పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Car Loan: కారు లోన్‌ కోసం చూస్తున్నారా? తక్కువ వడ్డీకి అందించే బ్యాంకులు.. రూ. 5 లక్షల రుణంపై నెలకు ఈఎంఐ ఎంతంటే..
Car Loan
Subhash Goud
|

Updated on: Apr 20, 2026 | 7:31 AM

Share

Car Loan: కారు అనేది కేవలం ఒక విలాస వస్తువుగా కాకుండా, ఒక ప్రాథమిక అవసరంగా మారింది. కుటుంబంతో ప్రయాణించడానికి, అలాగే అత్యవసర పరిస్థితుల్లో బస్సు కోసం వేచి ఉండకుండా త్వరగా ఒక చోటు నుండి మరో చోటుకు చేరుకోవడానికి కార్లు చాలా అవసరమైనవిగా ఉన్నాయి. భారతదేశంలో కారు కొనడం చాలా మందికి ఒక కల అయినప్పటికీ, అధిక ధర కారణంగా చాలామంది వెనుకాడతారు. అలాంటి వారికి, కార్ లోన్ ఉత్తమ పరిష్కారంగా కనిపిస్తుంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ కార్లకు నిరంతరం సబ్సిడీలు అందిస్తుండటంతో, కార్ లోన్లకు డిమాండ్ మునుపెన్నడూ లేనంతగా పెరుగుతోంది.

కార్లు ఖరీదైనవి కాబట్టి, మధ్యతరగతి కుటుంబానికి ఒకటి కొనడం అంత సులభం కాదు. దీనికి కారణం కారు ధర లక్షల్లో ఉండటం వల్ల ప్రతిఒక్కరూ కారు కొనలేరు. వారికి సహాయం చేయడానికి, భారతదేశంలోని వివిధ బ్యాంకులు కార్ లోన్‌లను అందిస్తున్నాయి. ఈ లోన్‌ను నెలవారీ వాయిదాలలో తిరిగి చెల్లించవచ్చు. అందుకే ఈ పథకం చాలా మందికి ఉపయోగపడుతుంది.

ఇది కూడా చదవండి: Gold Price Today: మహిళలను నిరుత్సాహపర్చిన బంగారం ధరలు.. తులంపై ఎంత తగ్గిందో తెలుసా..?

ఇవి కూడా చదవండి

భారతదేశంలో తక్కువ వడ్డీ రేట్లకు కార్ లోన్‌లను అందించే బ్యాంకుల గురించి వివరంగా పరిశీలిద్దాం. వినియోగదారులు వాటిని పోల్చి, తమకు కావలసిన బ్యాంకులను ఎంచుకోవచ్చు. భారతదేశంలోని వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కార్ లోన్‌లను అందించడానికి పోటీ పడతాయి.

కారు లోన్‌లకు ఉత్తమ వడ్డీ రేట్లను అందించే బ్యాంకులు:

  • యూనియన్ బ్యాంక్ 7.40 శాతం నుండి 9.45 శాతం వరకు వడ్డీ రేట్లతో రుణాలను అందిస్తుంది.
  • పంజాబ్ నేషనల్ బ్యాంక్ 7.60 శాతం నుండి 10.70 శాతం వరకు వడ్డీ రేట్లతో రుణాలను అందిస్తుంది.
  • బ్యాంక్ ఆఫ్ బరోడా 7.60 శాతం నుండి 11.35 శాతం వరకు వడ్డీ రేట్లతో రుణాలను అందిస్తుంది.
  • స్టేట్ బ్యాంక్ విషయంలో రుణాలు 8.70 శాతం నుండి 9.85 శాతం వరకు వడ్డీ రేటుతో అందిస్తుంది.
  • HDFC బ్యాంక్ 8.50 శాతం నుండి ప్రారంభమయ్యే వడ్డీ రేటుతో రుణాలను అందిస్తుంది.

కొన్ని బ్యాంకులు ప్రాసెసింగ్ ఫీజును కూడా వసూలు చేస్తాయి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక నిర్దిష్ట కాలం పాటు ప్రాసెసింగ్ ఫీజు లేకుండా రుణాలను అందిస్తుంది. కారు లోన్ తీసుకునేటప్పుడు వారు ప్రాసెసింగ్ ఫీజు, ఇతర ఫీజులను వసూలు చేస్తారా లేదా అనే విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవడం ముఖ్యం.

ఇది కూడా చదవండి: Bank Accounts: మీకు ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయా? RBI ఏం చెబుతుందో తెలుసా? తప్పక తెలుసుకోవాల్సినవి ఇవే!

నెలవారీ వాయిదా ఎంత ఉంటుంది?

ఉదాహరణకు.. మీరు 5 సంవత్సరాల కాలానికి రూ. 5 లక్షల రుణం తీసుకుంటే మీరు నెలకు రూ. 9,900 నుండి రూ. 11,200 వరకు వాయిదా చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకులు అందించే వడ్డీ రేటును బట్టి నెలవారీ వాయిదా మారుతూ ఉంటుందని గుర్తించుకోండి. కారు రుణం తీసుకునే ముందు వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజులు, రుణ కాలపరిమితి, క్రెడిట్ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకోవడం మంచిది.

ఇది కూడా చదవండి: Personal Loan: మీరు ఏడాది కాలానికి 1 లక్ష రూపాయల పర్సనల్‌ లోన్ తీసుకుంటే నెలకు EMI ఎంత? వడ్డీ?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us