SIP Calculator: పిల్లల ఉన్నత చదువుల కోసం రోజుకు రూ. 150 పక్కన పెట్టండి.. రూ. 22.7లక్షలు అవుతాయి.. అదెలా? చూద్దాం రండి..
ఎస్ఐపీల్లో మాత్రం నష్టం వచ్చే అవకాశాలు తక్కువ. దీర్ఘకాలంలో మంచి రాబడినే అందిస్తాయి. పైగా వీటిల్లో మీరు ప్రతి నెలా పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం అవసరం లేదు. చిన్న మొత్తాలను పొదుపు చేయడం ద్వారా, మీరు భారీ సంపదను కూడబెట్టుకోవచ్చు. ఉదాహరణకు 2024 సంవత్సరంలో మీ పిల్లల వయస్సు 3 సంవత్సరాలు అయితే, వారు 18 ఏళ్లు వచ్చేనాటికి అంటే 2042 నాటికి మీరు రూ. 22 లక్షల మెచ్యూరిటీ ఫండ్‌ని పొందవచ్చు.
ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు ఇవ్వాలని ఆలోచన చేస్తారు. అందుకోసం జీవితాంతం కష్టపడతారు. అయినప్పటికీ కొంతమంది అనుకున్న విధంగా పిల్లలకు అవసరాలన్నీ సమకూర్చలేరు. ఎందుకంటే పిల్లలు ఇటీవల ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలని భావిస్తున్నారు. పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో చదవాలని ఆశపడుతున్నారు. అలా చదవాలంటే భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇది అందరికీ సాధ్యం కావడం లేదు. ముఖ్యంగా చిన్న చిన్న ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకునే మధ్య తరగతి వారు ఈ సమస్యను ఎదుర్కొంటారు. అయితే ఓ సింపుల్ ఉపాయం ద్వారా పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు అవసరమైన ఆర్థిక నిధిని సమకూర్చవచ్చు. అదే సిస్టమాటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్(ఎస్ఐపీ). దీనిలో పెట్టుబడి పెట్టడం ద్వారా దీర్ఘకాలంలో ఆశించిన మేర రాబడి పొందవచ్చు.
చిన్న మొత్తంలో పెట్టుబడి..
మ్యూచువల్ ఫండ్స్ అంటే అందరిలోనూ వ్యతిరేక భావాలు ఉంటాయి. అది సహజం కూడా. ఎందుకంటే వీటిల్లో స్థిరమైన రాబడి ఉండదు. ఇవి మార్కెట్ ఒడిదొడుకులను ఎదుర్కొంటుంది. అయితే ఎస్ఐపీల్లో మాత్రం నష్టం వచ్చే అవకాశాలు తక్కువ. దీర్ఘకాలంలో మంచి రాబడినే అందిస్తాయి. పైగా వీటిల్లో మీరు ప్రతి నెలా పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం అవసరం లేదు. చిన్న మొత్తాలను పొదుపు చేయడం ద్వారా, మీరు భారీ సంపదను కూడబెట్టుకోవచ్చు. ఉదాహరణకు 2024 సంవత్సరంలో మీ పిల్లల వయస్సు 3 సంవత్సరాలు అయితే, వారు 18 ఏళ్లు వచ్చేనాటికి అంటే 2042 నాటికి మీరు రూ. 22 లక్షల మెచ్యూరిటీ ఫండ్‌ని పొందవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..
నష్టం రాదు..
ఈ మ్యూచువల్ ఫండ్‌లను క్వాలిఫైడ్ ఫండ్ మేనేజర్లు నిర్వహిస్తారు కాబట్టి, వీటిలో డబ్బును కోల్పోయే అవకాశాలు తక్కువగా ఉంటాయి. పైగా ఎస్ఐపీల్లో మీరు ప్రతి నెలా స్పల్ప మొత్తంలో పెట్టుబడి పెడతారు కాబట్టి మార్కెట్ బాగా పని చేయకపోయినా, అది బాగా పని చేయడం ప్రారంభించిన తర్వాత అది బ్యాలెన్స్ అయిపోతుంది. అందుకే దీర్ఘకాలంలో మీకు లాభమే వస్తుంది తప్ప నష్టం రాదు. అందుకే ఎస్ఐపీల్లో ఎక్కువ కాలం కొనసాగడం ద్వారా మంచి రాబడిని పొందొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
ఎస్ఐపీ క్యాలిక్యులేటర్..
మీరు ఎస్ఐపీ ప్లాన్లో ప్రతి రోజూ రూ. 150 పెట్టుబడి పెట్టాలి. అంటే నెలకు రూ.4,500. ఏడాదికి రూ.54,000 ఇన్వెస్ట్ చేస్తారు. దీనిని 15 సంవత్సరాల పాటు కొనసాగించాల్సి ఉంటుంది. ఇలా 15ఏళ్లు పెట్టుబడి కొనసాగితే మీరు పెట్టిన మొత్తం పెట్టుబడి విలువ రూ. 8,10,000 చేరుతుంది.
సాధారణంగా, ఎస్ఐపీల్లో దీర్ఘకాలిక పెట్టుబడి 12 శాతం వార్షిక రాబడిని ఇస్తుంది. కనీసం మీకు 12 శాతం రాబడి కూడా వస్తుందని అనుకుందాం. ఈ లెక్కన మీకు 15 ఏళ్లలో రూ.14,60,592 వడ్డీ లభిస్తుంది. ఎస్ఐపీ మెచ్యూర్ అయినప్పుడు, మీ పెట్టుబడి మొత్తం రూ. 8,10,000, అలాగే దానిపై వచ్చిన వడ్డీ మొత్తం రూ. 14,60,592 కలిపి మొత్తం రూ.22,70,592 తీసుకుంటారు. అయితే మీరు ఈ ఎస్ఐపీల్లో పెట్టుబడి పెట్టే ముందు కచ్చితంగా ఆర్థిక సలహాదారుని సంప్రదించాలని గుర్తుంచుకోండి. వారి సాయంతో ఎస్ఐపీ రిటర్న్ లు మెరుగవుతాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..