Gold Price: బంగారం అంటే భారతీయులకు అతిమిమైన ప్రేమ. ఎంత ధర ఉన్నా.. కొనుగోలు చేయకుండా ఉండలేరు. ఈ రానున్న రోజుల్లో బంగారం ధరలు భారీగా తగ్గే అవకాశాలున్నట్లు బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ వారంలో బంగారం నేల చూపులు చూసింది. పసిడి వెలవెలబోతోంది. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది ఊరట కలిగించే అంశమని చెప్పొచ్చు. దేశీయ డీలర్లు ఈ వారం ఔన్స్‌కు 2డాలర్ల వరకు తగ్గింపు అందిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. భారత దేశంలో బంగారం ధరలలో 10.75శాతం దిగుమతి సుంకం, 3శాతం జీఎస్టీ ఉన్నాయి. అయితే కరోనా ఆంక్షల కాణంగా అభరణాల దుకాణాలు సైతం మూతపడ్డాయి. అయితే ఈ జూన్ త్రైమాసికంలో లాక్‌డౌన్ల కారణంగా భారతదేశంలో బంగారు వినియోగం ఉంటుందని ప్రపంచ బులియన్ మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.
అయితే నిన్నటి వరకు తగ్గతూ వచ్చిన పసిడి ధరలు తాజాగా ఆదివారం రోజున ఎలాంటి మార్పులు చోటు చేసుకోకుండా.. స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో బంగారం కొనాలనుకునే వారికి ఇది ఊరట కలిగించే అంశం అని చెప్పుకోవచ్చు. మరోవైపు కరోనా సెకండ్ వేవ్ దేశ వ్యాప్తంగా విజృంభిస్తున్నా.. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే పసిడి కొనాలనుకునేవారికి ఇది సరైన అవకాశంగా కనిపిస్తోంది. ఇక ఈరోజు ఉదయం దేశీయ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.44,170 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.45,170 వద్ద కొనసాగుతుంది. కరోనా విపత్కర సమయంలో బంగారం ధరలు భారీగా తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కోవిడ్ కారణంగా బంగారం కొనేవారి సంఖ్య కూడా చాలా తగ్గిపోవడంతో రానున్న రోజుల్లో బంగారం ధరలు భారీగా తగ్గే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. కరోనా కారణంగా జూన్ త్రైమాసికంలో పసిడి వినియోగం మరిత క్షీణించే అవకాశాలున్నాయంటున్నారు.