AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhaar Card Update: ఆధార్ కార్డులో ఫొటో అప్ డేట్ చేయడం ఎలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి..

ఆధార్ కార్డు తీసుకునే సమయంలో ఫొటో ఇస్తారు. ఏళ్లు గడుస్తున్నా.. అదే ఫొటో ఉంచేస్తారు. దీంతో కొన్ని సందర్భాల్లో ఆధార్ ను ప్రూఫ్ గా సమర్పించినప్పుడు ఈ ఫొటో ఉన్నదే మీరేనా అని అవతలి వారు అడిగిన సందర్భాలు కూడా ఉంటాయి. అందుకే ఇటీవల కాలంలో ఫొటోలను అప్ డేట్ చేసుకోవాలని ఆధార్ కార్డులను జారీ చేసే యునిక్ ఐడెంటిఫికేసన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) సూచిస్తోంది. ఆ ఫొటోను ఎలా అప్ డేట్ చేసుకోవాలి? తెలుసుకుందాం రండి..

Aadhaar Card Update: ఆధార్ కార్డులో ఫొటో అప్ డేట్ చేయడం ఎలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి..
Aadhaar Card
Madhu
| Edited By: |

Updated on: Jan 16, 2024 | 12:00 PM

Share

ఆధార్ కార్డు.. మన దేశంలో అన్నింటికీ ఆధారం ఇదే. భారత పౌరుడిగా గుర్తింపునివ్వడంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సేవలు దీని ద్వారానే లభిస్తాయి. ఇటీవల కాలంలో ప్రతీది ఆధార్ కార్డుకు లింక్ అయ్యి ఉంటున్నాయి. ప్రభుత్వాల సంక్షేమ పథకాలు, బ్యాంకుల్లో ఖాతాలు, స్థలాల రిజిస్ట్రేషన్లు అన్నీ కూడా ఆధార్ ఆధారంగానే సాగుతున్నాయి. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఆధార్ కార్డులో వివరాలు అన్ని సక్రమంగా ఉండాలి. అప్ డేటెడ్ గా ఉండాలి. సాధారణంగా ఆధార్ కార్డులో వ్యక్తుల పేరు, అడ్రస్, పుట్టిన తేదీ, ఫొటో ఉంటాయి. అయితే చాలా మంది ఎప్పుడో ఆధార్ కార్డు తీసుకునే సమయంలో ఫొటో ఇస్తారు. ఏళ్లు గడుస్తున్నా.. అదే ఫొటో ఉంచేస్తారు. దీంతో కొన్ని సందర్భాల్లో ఆధార్ ను ప్రూఫ్ గా సమర్పించినప్పుడు ఈ ఫొటో ఉన్నదే మీరేనా అని అవతలి వారు అడిగిన సందర్భాలు కూడా ఉంటాయి. అందుకే ఇటీవల కాలంలో ఫొటోలను అప్ డేట్ చేసుకోవాలని ఆధార్ కార్డులను జారీ చేసే యునిక్ ఐడెంటిఫికేసన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) సూచిస్తోంది. ఆ ఫొటోను ఎలా అప్ డేట్ చేసుకోవాలి? తెలుసుకుందాం రండి..

రూ.100 సర్వీస్ చార్జ్..

మీ ఆధార్ కార్డు ఫొటోను సులభంగా మార్చుకోవచ్చు. అందుకోసం మీరు ఆధార్ నమోదు కేంద్రాన్ని సందర్శించాల్సి ఉంటుంది. ఎందుకంటే మీ ఆధార్ కార్డులో బయోమెట్రిక్, ఫొటోలను అప్ డేట్ చేయడం ఆన్ లైన్లో కుదరదు. ఆధార్ సేవా కేంద్రాల్లోనే దీనిని చేసేందుకు వీలుంటుంది. అందుకోసం రూ. 100 సర్వీస్ చార్జ్ కూడా ఆధార్ సెంటర్ వారు వసూలు చేస్తారు.

ఇవి కూడా చదవండి

ఆధార్ కార్డ్ ఫోటో మార్చడం ఇలా..

  • మీ సమీపంలోని ఆధార్ శాశ్వత నమోదు కేంద్రాన్ని సందర్శించండి.
  • ఆన్‌లైన్ లేదా సెంటర్‌లో అందుబాటులో ఉండే ఎన్‌రోల్‌మెంట్ ఫారమ్‌ను పూరించండి.
  • ఆ ఫారమ్‌ను సమర్పిస్తే.. అక్కడి ఎగ్జిక్యూటివ్ మీ ఫొటో తీస్తారు.
  • బయోమెట్రిక్ వివరాలను అప్‌డేట్ చేయడానికి రూ. 100 చెల్లించండి.

కొత్త ఫొటో అప్‌డేట్ చేసిన ఆధార్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేయడం ఇలా..

  • యూఐడీఏఐ అధికారిక పోర్టల్‌లోకి వెళ్లండి.
  • హోమ్‌పేజీలోని మై ఆధార్ విభాగంలో ‘డౌన్‌లోడ్ ఆధార్’ ఎంపికపై క్లిక్ చేయండి.
  • ఈ-ఆధార్ డౌన్‌లోడ్ కోసం ‘ఆధార్ నంబర్’, ‘ఎన్‌రోల్‌మెంట్ ఐడీ’ వర్చువల్ ఐడీ మధ్య ఎంచుకోండి.
  • ఇప్పుడు మీ ఎంపిక వివరాలను నమోదు చేయండి.
  • -మీ రిజిస్టర్డ్ ఫోన్ నంబర్‌కు ఓటీపీని పంపే ముందు క్యాప్చా కోడ్‌ను ధ్రువీకరించండి.
  • ప్రక్రియను ధ్రువీకరించడానికి ఓటీపీని నమోదు చేయండి.
  • మీ ఆధార్ కార్డు పాస్‌వర్డ్ ప్రొటెక్షన్ తో మీ పరికరంలో డౌన్‌లోడ్ అవుతుంది.
  • యూఐడీఏఐ ప్రకారం, మీ పేరులోని మొదటి నాలుగు అక్షరాలు (క్యాప్స్‌లో), మీ పుట్టిన సంవత్సరం అనేది ఈ ఇ-ఆధార్ పాస్‌వర్డ్ గా ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..