EPFO Nominee: మీ పీఎఫ్ అకౌంట్‌కు నామినీని యాడ్ చేశారా.. లేకుంటే వెంటనే చేయండి..
ఉద్యోగుల భవిష్య నిధి (EPF) సభ్యులు తమ కుటుంబం సంక్షేమం కోసం ఈ- నామినేషన్ యాడ్ చేయడం మంచిది. ప్రావిడెంట్ ఫండ్ (PF), పెన్షన్ (EPS), బీమా (EDLI) వంటి పలు ప్రయోజనాలను ఈపీఎఫ్ఓ తమ సభ్యులకు అందిస్తోంది...
ఉద్యోగుల భవిష్య నిధి (EPF) సభ్యులు తమ కుటుంబం సంక్షేమం కోసం ఈ- నామినేషన్ యాడ్ చేయడం మంచిది. ప్రావిడెంట్ ఫండ్ (PF), పెన్షన్ (EPS), బీమా (EDLI) వంటి పలు ప్రయోజనాలను ఈపీఎఫ్ఓ తమ సభ్యులకు అందిస్తోంది. ఉద్యోగి మరణానంతరం సంస్థ ఇచ్చే సామాజిక భద్రతా ప్రయోజనాలను సులభంగా కుటుంబ సభ్యలకు రావాలంటే నామినీని యాడ్ చేయడం ముఖ్యం. ఈ నామినీని యాడ్ చేయడం ఇప్పుడు సులభంగా మారింది. ఇంతకు ముందులా నామినేషన్ దాఖలు కోసం ఈపీఎఫ్ఓ కార్యాలయాన్ని వెళ్లాల్సిన అవసరం లేదు ఇంటి నుంచే ఆన్‌లైన్ ద్వారా మీ ఈ నామినేషన్ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. ఈ- నామినేషన్‌ను దాఖలు చేసేందుకు ఉద్యోగులు తమ యూఏఎన్ నంబరును.. ఈపీఎఫ్ పోర్టల్‌లో యాక్టివేట్ చేసుకుంటేనే ఇది సాధ్యం అవుతుంది. UAN నెంబర్ ఎంటర్ చేసి పాస్‌వర్డ్ నమోదు చేయగానే లాగిన్ అవుతారు. అందులో ప్రోఫైల్‌పై క్లిక్ చేస్తే ఈ నామినేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి. నామినీ పేరు, వారితో మీకు ఉన్న బంధం, వారి పుట్టిన తేదీ, ఆధార్ నెంబర్, అడ్రస్ ఎంటర్ చేయాలి. ఒకరి కంటే ఎక్కువ మందిని నామినీలుగా నియమించుకోవచ్చు. అయితే ప్రతి నామినీకి సంబంధించిన కేవైసీ వివరాలను అందించాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులు లేని వారు వారికి కావాల్సిన వారిని ఎవరినైనా నామినీలుగా ఎంచుకోవచ్చు.
ముందుగా ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్‌సెట్‌కు వెళ్లి, అక్కడ ‘సర్వీసెస్’ ఆప్షన్‌లో ‘ఫర్ ఎంప్లాయిస్’ సెక్షన్‌పై క్లిక్ చేయాలి. ఇప్పుడు స్క్రీన్ కింది భాగంలో ఎడమ వైపున ఉన్న సర్వీసెస్ ఆప్షన్ కింద కనిపిస్తున్న ‘మెంబర్ యూఏఎన్/ ఆన్‌లైన్ సర్వీస్’ పై క్లిక్ చేయాలి. ఇక్కడ్ మీ యూఎఎన్ నంబర్, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వాలి. డ్రాప్ డౌన్ మెనూలో ఉన్న మ్యానేజ్ ట్యాబ్‌పై క్లిక్ చేసి ‘ఇ-నామినేషన్’ను ఎంపికపై క్లిక్ చేయాలి. కుటుంబ సభ్యుల వివరాలను ఎంటర్ చేయాలి. ఒకరి కంటే ఎక్కువ సభ్యుల వివరాలను కూడా ఎంటర్ చేయవచ్చు. ఎవరికి ఎంత వాటా ఇవ్వాలో కూడా ఇక్కడే తెలపాలి. ఒకసారి వివరాలన్నింటినీ సరి చూసుకుని ‘సేవ్ ఈపీఎఫ్ నామినేషన్’పై క్లిక్ చేయాలి. తర్వాత పేజ్‌కు వెళ్లి ఇ-సైన్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే, వన్ టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ) జనరేట్ అవుతుంది. మీ ఆధార్ కార్డ్‌కు అనుసంధానించిన ఫోన్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి ఇ-నామినేషన్ ప్రక్రియ పూర్తి చేయొచ్చు.