Petrol And Diesel Price: గత కొన్ని రోజులుగా వాహనదారులకు షాకిస్తున్న పెట్రోల్ డీజిల్ ధరలు ఇటీవల నుంచి స్థిరంగా ఉంటున్నాయి. ఇక తాజాగా బుధవారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా 18వ రోజు కూడా స్థిరంగానే కొనసాగాయని చెప్పుకోవచ్చు. గ్లోబల్ మార్కెట్‌లో క్రూడ్ ధరలు మాత్రం తగ్గాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ జాబితా ప్రకారం..
* దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.101.84 ఉండగా, డీజిల్ రూ.89,87గా ఉంది.
* ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.83 ఉండగా, డీజిల్ ధర రూ.97.45గా ఉంది.
* కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 102.08 ఉండగా, డీజిల్ ధర రూ.93.02 ఉంది.
* చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.49 ఉండగా, డీజిల్ ధర రూ.94.39 గా ఉంది.
* హైదరాబాద్‌లో పెట్రోల్ ధర లీటరుకు రూ.105.83 ఉండగా, డీజిల్ ధర రూ.97.96 ఉంది.
* విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.05 గా ఉండగా, డీజిల్ ధర రూ.99.62గా ఉంది.
* విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ. 107.35 కాగా, డీజిల్ రూ. 98.65 గా ఉంది.
ఇకపోతే సాధారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతి రోజు మారుతూ వస్తుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల ప్రాతిపదికన ఇంధన రిటైల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తూ వస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే ధరలు ఒక రోజు పెరగొచ్చు. మరో రోజు తగ్గొచ్చు. లేదంటే స్థిరంగా కూడా కొనసాగవచ్చు.