Petrol Diesel Price: మరోసారి వాహనదారులకు షాక్.. వరుసగా 8వ రోజూ పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..

|

Mar 30, 2022 | 8:37 AM

Petrol Price Today: పెట్రో ధరలు భగ్గుమంటున్నాయ్‌. వరుసగా 8వ రోజూ వాహనదారులకు షాకిచ్చాయి ఆయిల్ కంపెనీలు. పెట్రోల్‌పై 90 పైసలు, డీజిల్‌పై 87 పైసలు పెంచేశాయ్. లేటెస్ట్‌ హైక్‌తో, హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్ ధర 114 రూపాయల 51 పైసలకు చేరింది. 

Petrol Diesel Price: మరోసారి వాహనదారులకు షాక్.. వరుసగా 8వ రోజూ పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..
Petrol Diesel Prices
Follow us on

Petrol Diesel Price Today:పెట్రో ధరలు భగ్గుమంటున్నాయి. వరుసగా 8వ రోజూ వాహనదారులకు షాకిచ్చాయి ఆయిల్ కంపెనీలు. పెట్రోల్‌పై 90 పైసలు, డీజిల్‌పై 87 పైసలు పెంచేశాయి. లేటెస్ట్‌ హైక్‌తో, హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్ ధర 114 రూపాయల 51 పైసలకు చేరింది. పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుల టెన్షన్‌ను పెంచుతున్నాయి. ఈరోజు మరోసారి పెట్రో ధరలు మరింత పెరిగాయి.  దేశంలోని ప్రధాన చమురు కంపెనీలు మార్చి 30 బుధవారం కొత్త పెట్రోల్, డీజిల్ ధరలను విడుదల చేశాయి. ఈరోజు మరోసారి దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం ఇది వరుసగా రెండో వారం. ఈ వివరాలను వెబ్ సైట్  అందించిన సమాచారం ప్రకారం పెట్రోర్, డీజిల్ ధరలు మీ కోసం..

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.114.52గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.100.71గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.114.69గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.100.82గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 114.60గా ఉండగా.. డీజిల్ ధర రూ.100.77గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.114.63గా ఉండగా.. డీజిల్ ధర రూ.100.81గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 114.52 ఉండగా.. డీజిల్ ధర రూ.100.71గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 114.02 పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.100.23గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.116.39కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.102.09లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.115.42 ఉండగా.. డీజిల్ ధర రూ. 101.27గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.115.58 లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.101.42గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 116.25గా ఉండగా.. డీజిల్ ధర రూ.102.09గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ.116.39లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.102.42లకు లభిస్తోంది.

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ.101.01 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 92.27 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.115.88కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.100.10 ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.110.52 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 95.42 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 106.88 ఉండగా.. డీజిల్ ధర రూ.96.76గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.106.46 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.90.49గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 100.86 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.76గా ఉంది.

ఇవి కూడా చదవండి: Mamata Banerjee: ఈడీ, సీబీఐ, ఐటీ దాడులపై ఐక్యపోరాటం.. విపక్ష నేతలకు బెంగాల్‌ సీఎం మమత పిలుపు..

RGV: పునీత్‌ రాజ్‌కుమార్‌ సమాధిని సందర్శించిన వర్మ.. ఆయన లేరన్న విషయాన్ని నమ్మలేకపోతున్నానంటూ..