Fuel Prices Hiked: బాదుడే బాదుడు.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ప్రధాన నగరాల్లో రికార్డు స్థాయికి…

|

May 11, 2021 | 8:54 AM

Petrol, Diesel Rates Today: దేశంలో పెట్రో ధరలు మండిపోతున్నాయి. ఇప్పుడిప్పుడే దేశంలో చమురు ధరలకు బ్రేక్ పడుతోంది అనుకున్న క్రమంలో మళ్లీ పెరుగుతుండటంతో

Fuel Prices Hiked: బాదుడే బాదుడు.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ప్రధాన నగరాల్లో రికార్డు స్థాయికి...
Petrol Diesel price Today
Follow us on

Petrol, Diesel Rates Today: దేశంలో పెట్రో ధరలు మండిపోతున్నాయి. ఇప్పుడిప్పుడే దేశంలో చమురు ధరలకు బ్రేక్ పడుతోంది అనుకున్న క్రమంలో మళ్లీ పెరుగుతుండటంతో వాహనదారులు లబోదిబోమంటున్నారు. క‌రోనా మ‌హ‌మ్మారితో ప్ర‌జలు అల్లాడుతున్న వేళ దేశీయ చ‌మురు కంపెనీలు వ‌రుస‌గా పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌ను పెంచుకుంటూ పోతున్నాయి. గ‌త వారం నాలుగు రోజుల‌పాటు ధ‌ర‌ల‌ను పెంచిన కంపెనీలు శ‌ని, ఆదివారం విరామం ఇచ్చి సోమవారం నుంచి సామాన్యుడిపై భారం మోపుతున్నాయి. సోమ‌వారం పెట్రోల్, డీజిల్‌పై 26 పైసలు, 33 పైసల చొప్పున పెంచాయి. తాజాగా మ‌ళ్లీ 27 పైస‌లు, 20 పైస‌ల చొప్పున పెంచుతూ నిర్ణ‌యం తీసుకున్నాయి.

దీంతో దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో లీట‌ర్ డీజిల్ ధ‌ర రూ.91.80కు చేరగా.. డీజిల్ ధ‌ర రూ.82.36కు పెరిగింది. అదేవిధంగా ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ ధ‌ర రూ.98.12 ఉండగా.. డీజిల్ రూ.89.48 గా ఉంది. తమిళనాడు రాజధాని చెన్నైలో పెట్రోల్‌ రూ.93.62, డీజిల్ రూ.87.25 గా ఉంది. బెంగాల్ రాజధాని కోల్‌క‌తాలో పెట్రోల్ రూ.91.92, డీజిల్ రూ.85.20కు పెరిగింది. బెంగళూరులో పెట్రోల్ ధర 94.85, డీజిల్ ధర 87.31గా ఉంది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర 95.41గా ఉండగా.. డీజిల్ ధర 89.79గా ఉంది. విజయవాడలో పెట్రోల్ ధర 97.86 గా ఉండగా.. డీజిల్ ధర 91.67 గా ఉంది.

కాగా.. రోజువారీ స‌మీక్ష‌లో భాగంగా ఉదయం 6 గంట‌ల‌కు దేశీయ చ‌మురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధ‌ర‌ల‌ను స‌వ‌రిస్తూ ఉంటాయి. అయితే చ‌మురు ఉత్ప‌త్తుల‌పై ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ప‌న్నులు వ‌సూలు చేస్తుండ‌టం, అదేవిధంగా రవాణా, తదితర సుంకాలకు అనుగుణంగా పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల్లో మార్పులు చోటుచేసుకుంటుంటాయి.

Also Read:

Covid-19 Vaccination: వ్యాక్సిన్‌ ధరలపై న్యాయవ్యవస్థ జోక్యం అనవసరం.. నిపుణులను సంప్రదించాకే నిర్ణయించామన్న కేంద్రం

Tata Motors: కార్లపై భారీ ఆఫర్‌ ప్రకటించిన టాటా మోటార్స్‌.. 65 వేల రూపాయల వరకు ఆదా..!