Petrol and Diesel: గణనీయంగా తగ్గిన పెట్రోల్ డీజిల్ అమ్మకాలు.. మార్చితో పోలిస్తే ఏప్రిల్ నెలలో తొమ్మిది శాతం మేర డ్రాప్

Petrol and Diesel sales: కరోనా సెకండ్‌ వేవ్‌ దేశాన్ని అతలాకుతలం చేసేస్తోంది. ఒక వైపు లాక్ డౌన్. మరో వైపు ఎటు తిరిగితే మహమ్మారి ఎక్కడ అంటుకుంటుందో అనే భయం ప్రజల్ని ఇళ్ళకు కట్టి పాడేసింది.

Petrol and Diesel: గణనీయంగా తగ్గిన పెట్రోల్ డీజిల్ అమ్మకాలు.. మార్చితో పోలిస్తే ఏప్రిల్ నెలలో తొమ్మిది శాతం మేర డ్రాప్
Petrol And Diesel Sales
Follow us

|

Updated on: May 13, 2021 | 12:06 AM

Petrol and Diesel Sales: కరోనా సెకండ్‌ వేవ్‌ దేశాన్ని అతలాకుతలం చేసేస్తోంది. ఒక వైపు లాక్ డౌన్. మరో వైపు ఎటు తిరిగితే మహమ్మారి ఎక్కడ అంటుకుంటుందో అనే భయం ప్రజల్ని ఇళ్ళకు కట్టి పాడేసింది. అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయట తిరగడానికి ఉత్సాహం చూపించడం లేదు. ఈ నేపధ్యంలో అన్ని రంగాలూ ఏప్రిల్ నెలలో గట్టి తిరోగమన ప్రభావాన్ని ఎదుర్కొన్నాయి. ఇక ఎక్కడా ప్రజల ప్రయాణాలు తగ్గిపోవడంతో దేశంలో పెట్రోల్ డీజిల్ అమ్మకాలు కూడా తగ్గిపోయాయి. మార్చి నెలతో పోలిస్తే ఏప్రిల్‌ నెలలో 9.4 శాతం మేర అమ్మకాలు తగ్గినట్లు కేంద్ర పెట్రోలియం శాఖకు చెందిన పెట్రోలియం ప్లానింగ్‌ అండ్‌ అనాలసిస్‌ సెల్‌ (పీపీఏసీ) సంబంధిత గణాంకాలను బుధవారం వెలువరించింది.

మార్చిలో దేశంలో 18.77 మిలియన్‌ టన్నులుగా ఉన్న ఇంధన వినియోగం 17.01 మిలియన్‌ టన్నులకు తగ్గినట్లు తెలిపింది. గతేడాది ఏప్రిల్‌లో దేశమంతా లాక్‌డౌన్‌ అమల్లో ఉన్న సమయంలో ఇంధన విక్రయాలు భారీగా పడిపోయాయి. అప్పటితో పోలిస్తే ఈ ఏడాది అమ్మకాలు 81.5 శాతం మేర పెరిగాయి. ఎందుకంటే, ఈ ఏప్రిల్ నెలలో ఎక్కడా సంపూర్ణ లాక్ డౌన్ విధించలేదు. కొన్ని ప్రాంతాల్లో తప్పితే అన్ని చోట్లా యధావిధిగా పనులు సాగాయి.

ఏప్రిల్‌ నెలలో పెట్రోల్‌ అమ్మకాలు 2.38 మిలియన్‌ టన్నులు నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఆగస్టు తర్వాత ఇదే అత్యంత తక్కువ కావడం గమనార్హం. మార్చితో పోలిస్తే 13 శాతం మేర అమ్మకాలు క్షీణించాయి. గతేడాది ఏప్రిల్‌లో పెట్రోల్‌ అమ్మకాలు కేవలం 9.72 లక్షల టన్నులు మాత్రమే కావడం గమనార్హం. ఎక్కువగా వినియోగించే డీజిల్‌ విక్రయాలు సైతం 6.67 మిలియన్‌ టన్నులు జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. మార్చితో పోలిస్తే 9 శాతం మేర అమ్మకాలు తగ్గాయి. ఇక ఇదే వరుస మే నెలలోనూ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక పక్క పెట్రోల్ డీజిల్ రెట్లు పెరిగిపోతూ ఉండటమూ అమ్మకాల తగ్గుదలకు ఒక కారణంగా చెప్పొచ్చు.

ఎయిర్‌లైన్స్‌లో వినియోగించే జెట్‌ ఇంధన (ఏటీఎఫ్‌) వినియోగం గత నెలతో పోలిస్తే 14 శాతం క్షీణించి 4,09,000 టన్నులకు పరిమితమైంది. ఎల్పీజీ వినియోగం సైతం 11.6 శాతం తగ్గింది. తారు వినియోగం సైతం పడిపోయింది. అయితే ఏప్రిల్‌ నెలలో పెద్దగా ఆంక్షలు లేకపోవడం, పైగా కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరగడంతో వినియోగం పెద్దగా తగ్గలేదని తెలుస్తోంది. మే నెలలో మాత్రం దాదాపు అన్ని రాష్ట్రాలు కరోనా కేసుల కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటుడడంతో అమ్మకాలు భారీగా క్షీణించే సూచనలు కనిపిస్తున్నాయి.

ఇక ఈ నెలలో కరోనా రెండో వేవ్ ప్రభావంతో దేశమంతా లాక్ డౌన్ లోకి వెళ్ళిపోయింది. మెల్లగా ఒక్కోరాష్ట్రమూ లాక్ డౌన్ బాట పట్టాయి. దీంతో ప్రజలు అటూ ఇటూ తిరిగే అవకాశం తగ్గిపోయింది. ఈ ప్రభావం ఇంధన రంగం మీద మీద కూడా గట్టిగానే పడే అవకాశం ఉంది.

Also Read: Passenger vehicles: గత నెలలో పది శాతం అమ్మకాలు కోల్పోయిన పాసింజర్ వెహికల్స్..ఈ నెల కూడా అదే పరిస్థితి అంటున్న నిపుణులు!

Xiaomi: బిల్ గేట్స్ విడాకుల విషయాన్ని ఎగతాళి చేస్తూ షియోమి కంపెనీ చెత్త ట్వీట్..ఏకి పారేస్తున్న జనాలు!