Petrol-Diesel Price Today: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో ఎలాంటి మార్పులున్నాయి..? తాజా రేట్ల వివరాలు

|

Jan 22, 2023 | 9:38 AM

ప్రపంచ మార్కెట్‌లో ముడి చమురు ధరలో ఎలాంటి మార్పు లేదు. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు $87.63 వద్ద ట్రేడవుతుండగా, WTI బ్యారెల్‌కు $81.31 వద్ద ఉంది. మరోవైపు ఆయిల్ కంపెనీలు కొత్త పెట్రోల్, డీజిల్..

Petrol-Diesel Price Today: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో ఎలాంటి మార్పులున్నాయి..? తాజా రేట్ల వివరాలు
Pakistan's Petrol Diesel Prices
Follow us on

ప్రపంచ మార్కెట్‌లో ముడి చమురు ధరలో ఎలాంటి మార్పు లేదు. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు $87.63 వద్ద ట్రేడవుతుండగా, WTI బ్యారెల్‌కు $81.31 వద్ద ఉంది. మరోవైపు ఆయిల్ కంపెనీలు కొత్త పెట్రోల్, డీజిల్ రేట్లను విడుదల చేశాయి. ఇంధన ధరల్లో ఎలాంటి మార్పు లేదు. మే 22, 2022 నుండి భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. శనివారం అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర భారీగా పెరిగింది. బ్రెంట్ క్రూడ్ ధర 1.71 శాతం పెరగగా, డబ్ల్యూటీఐ క్రూడ్‌లో 1.22 శాతం జంప్ నమోదైంది. అయితే దీని కారణంగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.96.72, డీజిల్ రూ.89.62గా ఉంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్ డీజిల్ ధరలు:

  • ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉంది.
  • ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.31 కాగా, డీజిల్ ధర రూ.94.27.
  • కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.03, డీజిల్ ధర రూ.92.76.
  • చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.63, డీజిల్ ధర రూ.94.24.
  • బెంగళూరు – లీటర్ పెట్రోల్ రూ.101.94, డీజిల్ రూ.87.89
  • హైదరాబాద్ – లీటరు పెట్రోలు రూ.109.66, డీజిల్ రూ.97.82
  • జైపూర్ – లీటర్ పెట్రోల్ రూ. 108.45 మరియు డీజిల్ రూ. 93.69
  • లక్నో- లీటర్ పెట్రోల్ రూ. 96.44 మరియు డీజిల్ రూ. 89.64
  • పాట్నా – లీటరు పెట్రోల్ రూ 107.24 మరియు డీజిల్ రూ 94.04

ఇక ఢిల్లీ చుట్టూ ఉన్న ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో పెట్రోల్, డీజిల్ ధరలలో ఎటువంటి మార్పు లేదు. స్థిరంగా కొనసాగుతున్నాయి. పెట్రోలు ధర లీటరుకు రూ.96.58 ఉండగా, డీజిల్‌ను లీటర్‌ రూ.89.75 ఉంది.

ధరలను తనిఖీ చేయండిలా..

మీరు ప్రతిరోజూ మీ నగరంలో పెట్రోల్, డీజిల్ ధరలను SMS ద్వారా కూడా తనిఖీ చేయవచ్చు. ఇండియన్ ఆయిల్ (IOC) కస్టమర్‌లు RSP<డీలర్ కోడ్>ని 9224992249కి పంపవచ్చు, HPCL కస్టమర్‌లు HPPRICE <డీలర్ కోడ్>ని 9222201122 నంబర్‌కు పంపవచ్చు. BPCL వినియోగదారులు RSP<డీలర్ కోడ్>ని 9223112222 నంబర్‌కు పంపవచ్చు. మీ ఏరియా కోడ్‌ను తెలుసుకోవాలంటే ఈ కింది లింక్‌పై క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి