
అమెరికా-ఇరాన్ యుద్ధ సమయంలో ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ధరలు భారీగా పెరిగాయి. దీంతో అన్ని దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. అయితే అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం జరగడంతో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కాస్త సద్దమణిగాయి. దీంతో గురువారం ముడి చమురు ధరలు పడిపోయాయి. బ్యారెల్‌కు 72.48 డాలర్లకు దిగొచ్చి యుద్దం ముందున్న ధరలకు మళ్లీ చేరుకున్నాయి. ఈ క్రమంలో చాలా దేశాల్లో ఇంధన ధరలు పడిపోతున్నాయి. దేశంలో కూడా త్వరలో ధరలు తగ్గనున్నాయనే వార్తలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జూన్ 25వ తేదీన దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయనేది ఒకసారి తెలుసుకుందాం.
జూన్ 25న పెట్రోల్, డీజిల్ ధరలలో ఎలాంటి మార్పు లేదు. అమెరికా-ఇరాన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఇంధన ధరలు నాలుగు సార్లు పెరిగాయి. గత నెలలో లీటరుకు వరుసగా రూ. 2.6, రూ. 2.7 చొప్పున పెరిగాయి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు ధరలు రూ. 7.5-8 వరకు పెరిగాయి. అనంతరం ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 102.12గా ఉండగా.. కోల్‌కతాలో రూ.113.51 వద్ద కొనసాగుతోంది. ఇక ముంబైలో రూ.111.21, చెన్నైలో రూ.108.01, హైదరాబాద్‌లో రూ.115.73, బెంగళూరులో రూ. 110.89 వద్ద కొనసాగుతోంది.
ఇవాళ ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర రూ. 95.20, కోల్‌కత్తాలో రూ. 99.82, ముంబైలో రూ. 97.83, చెన్నైలోరూ. 99.66, హైదరాబాద్‌లో రూ.103.82, బెంగళూరులో రూ.98.80 వద్ద కొనసాగుతున్నాయి.
పెట్రోల్, డీజిల్ ధరలను ప్రభావితం చేసే అంశాలు
దేశంలో ఇంధన ధరలు అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి. వాటిలో ప్రపంచ ముడి చమురు ధరలు అత్యంత ముఖ్యమైనవి. పెట్రోల్, డీజిల్ ఉత్పత్తికి ముడి చమురు ప్రాథమిక ముడి పదార్థంగా ఉపయోగిస్తారు. ఇండియా తన ముడి చమురు అవసరాలలో అధిక భాగాన్ని దిగుమతి చేసుకుంటుంది. దీని వల్ల అంతర్జాతీయ అంశాలతో ధరలు ముడిపడి ఉంటాయి. ఇక రూపాయి-డాలర్ మారకపు రేటు కూడా ఇంధన ధరలను ప్రభావితం చేస్తుంది. ఇక కేంద్ర ప్రభుత్వం విధించే ఎక్సైజ్ సుంకం, రాష్ట్రాలు విధించే పన్ను లేదా వ్యాట్ ఇంధన ధరలను ప్రభావితం చేస్తాయి. ఒక్కొ రాష్ట్రం ఒక్కొలా ట్యాక్స్ విధిస్తూ ఉంటుంది. దీంతో అన్ని నగరాల్లో ఇంధన ధరలు వేర్వేరుగా ఉంటాయి. హర్ముజ్ జలసంధి తిరిగి తెరుచుకోవడంతో ఇంధన సరఫరా మెరుగుపడనుంది. అయితే అక్కడ నుంచి దేశానికి ముడి చమురు రావాలంటే కాస్త సమయం పట్టే అవకాశముంది. దీంతో ముడి చమురు ధరలు తగ్గినా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడానికి కాస్త సమయం పట్టే అకకాశముందని నిపుణులు చెబుతున్నారు.