Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Ideas: అతి తక్కువ పెట్టుబడితో లక్షలు సంపాదించండి.. ప్రభుత్వ సహాయంతో వెంటనే మొదలు పెదలు పెట్టండి..

ప్లాస్టిక్ బాటిల్‌కు బదులుగా వెదురు బాటిల్‌ను ఉపయోగించడం ఆరోగ్యానికి మంచి ఎంపిక. ఇది మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా యువతకు ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది.

Business Ideas: అతి తక్కువ పెట్టుబడితో లక్షలు సంపాదించండి.. ప్రభుత్వ సహాయంతో వెంటనే మొదలు పెదలు పెట్టండి..
Bamboo Water Bottle
Follow us
Sanjay Kasula

|

Updated on: Nov 27, 2022 | 6:00 PM

ప్లాస్టిక్ వాడటం వల్ల శరీరానికి చాలా నష్టం జరుగుతోంది. మనం ఆరోగ్యంతోపాటు ప్రకృతిలో విషయం చిమ్ముతోంది. అందుకే మన దేశంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయం వైపు మొగ్గు చూపుతున్నారు. మీరు కూడా ప్లాస్టిక్ బాటిల్‌ను వదిలుగా ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం కోసం కూడా చూస్తున్నట్లయితే.. వెదురు బాటిల్ మీకు ఉత్తమమైన ఎంపిక అని చెప్పవచ్చు. ఈ బాటిల్‌ విశేషమేమిటంటే, ఇది మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు, ఉపాధిని కూడా ప్రోత్సహిస్తుంది. ముఖ్యంగా దీని ఉత్పత్తిని MSME మంత్రిత్వ శాఖ ప్రోత్సహిస్తోంది. వెదురు సీసాల సామర్థ్యం 750 ml నుంచి 1 లీటర్ వరకు ఉంటుంది. అదే సమయంలో, దీని ప్రారంభ ధర రూ.300 నుంచి ప్రారంభమవుతుంది. వెదురు బాటిల్ ప్రత్యేకత ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

వెదురు సీసాలోని నీరు..

వెదురు బాటిళ్లను తయారు చేసేందుకు త్రిపుర అడవుల్లోని వెదురును ఉపయోగిస్తారు. దీని ప్రత్యేకత ఏంటంటే, ఈ బాటిల్ ఎప్పుడూ చెడిపోదు. అదే సమయంలో దాని లోపల నీరు సహజంగా ఉంటుంది. ఎన్ని రోజులు అలా ఉంచినా నీరు చెడిపోదు. ఇందులో ఎలాంటి రసాయనం ఉండదు. అటువంటి పరిస్థితిలో ఈ నీరు మీ ఆరోగ్యానికి మంచిది.

ఉపాధి దొరుకుతుంది

వెదురు బాటిళ్లతో చాలా మంది ఉపాధి పొందుతున్నారు. ముఖ్యంగా వెదురు సీసాలు తయారు చేసే ప్రాంతాల్లో కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. అదే సమయంలో, పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ ఉపాధిలో పొందుతున్నారు.

శిక్షణ ఎక్కడ లభిస్తుందంటే..

ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ అందించిన సమాచారం ప్రకారం, వెదురు సీసాల తయారీలో శిక్షణ తీసుకోవడానికి నేషనల్ వెదురు మిషన్ వెబ్‌సైట్ నుంచి సమాచారాన్ని పొందవచ్చు. ఈ వెబ్‌సైట్ నుంచి వెదురు బాటిల్‌ను తయారు చేయడం గురించిన సమాచారం పొందవచ్చు ఇవ్వడమే కాకుండా, ఇక్కడ అనేక ఇతర వస్తువులను తయారు చేయడానికి కూడా సమాచారం దొరుకుతుంది.

వెదురు బాటిల్ పరిశ్రమ పెట్టేందుకు అయ్యే ఖర్చు..

వెదురు సీసాలు లేదా ఇతర వస్తువులను తయారు చేయడానికి ఒక యూనిట్ ప్రారంభించడానికి ఖర్చు 15 లక్షల రూపాయలు. దీని గురించి మరింత సమాచారం కోసం, మీరు బ్యాంబూ మిషన్ ఈ లింక్ నుంచి సమాచారాన్ని పొందవచ్చు.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం