One Rupee Note Fact: రూపాయి నోటుపై RBI అని ఎందుకు ఉండదో తెలుసా.. అసలు సంగతి ఇదే.
ప్రస్తుతం మన దేశంలో భారతీయ కరెన్సీని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తోంది. అది మెటల్ నాణేలు లేదా కాగితం నోట్లు అయినా RBI వాటన్నింటినీ జారీ చేస్తుంది..
ప్రతి ఒక్కరి డబ్బుకు ఎంతో విలువ ఇస్తాం. డబ్బును కరెన్సీ నోట్ల రూపంలో వాడుతాం. ఎందుకంటే నిర్దిష్ట నోటుపై వాగ్దానం చేసిన సంతకం వల్ల దానికి ఆ విలువ వస్తుంది. అయితే మన భారతీయ కరెన్సీ నోట్ల గురించి ఎంత మందికి తెలుసు..? అతి చిన్న విలువైన రూపాయి నోటు దగ్గర నుంచి 2 వేల నోటు వరకు మనదేశంలో చాలా నోట్లు ఇండియన్ మార్కెట్‌లో ఉన్నాయి. ఒక్క రూపాయి నోటు మినహా మిగతా అన్ని నోట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంతకం ఉంటుంది. అయితే భారతీయ కరెన్సీ చరిత్ర చాలా పురాతనమైనది. ఆసక్తికరమైనది. ప్రస్తుతం మన దేశంలో భారతీయ కరెన్సీని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తోంది. అది మెటల్ నాణేలు లేదా కాగితం నోట్లు అయినా RBI వాటన్నింటినీ జారీ చేస్తుంది. భారతీయ కరెన్సీ నోట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని వ్రాయబడింది. ఆ నోటును జారీ చేసే గవర్నర్ సంతకం కూడా ఉంది. కానీ, మీరు 1 రూపాయి నోటును జాగ్రత్తగా పరిశీలిస్తే.. దానిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని వ్రాయబడలేదు. ఈ నోటు ఇతర నోట్ల కంటే భిన్నంగా ఉండడానికి కారణం ఏంటి..? రండి, ఈ రోజు మనం ఈ రూపాయి నోటుకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన సమాచారాన్ని ఇక్కడ తెలుసుకుందాం..
ఈ రోజుల్లో ఒక్క రూపాయి నోటు కనిపించదు. కానీ ఈ నోటు దేశంలోని మిగిలిన కరెన్సీ నోట్ల కంటే చాలా భిన్నంగా ఉంది. మీరు 1 రూపాయి నోటును జాగ్రత్తగా పరిశీలిస్తే దానిపై RBI గవర్నర్ సంతకం లేదా భారతీయ రిజర్వ్ బ్యాంక్ అని వ్రాయబడలేదు. ఇది ఎందుకు..? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమివ్వడానికి ముందుగా మనం ఈ నోట్ చరిత్ర ఏంటో చూద్దం..
ఒక రూపాయి నోటు చరిత్ర
భారతదేశంలో ఒక రూపాయి నోటు ఆపరేషన్ 30 నవంబర్ 1917 నుంచి ప్రారంభమైంది. ఆ రోజుల్లో బ్రిటిష్ పాలనలో ఈ నోటుపై భారతదేశ చక్రవర్తి జార్జ్ V ఫోటోను ముద్రించారు. ఆ తర్వాత 1926లో 1 రూపాయి నోటు ముద్రణ నిలిచిపోయింది. తిరిగి 14 ఏళ్ల తర్వాత 1940లో మరోసారి 1 రూపాయి నోటు ముద్రణ ప్రారంభమైంది. అయితే, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా 1994 సంవత్సరంలో దీని ముద్రణ మరోసారి నిలిపివేయబడింది అప్పుడున్న ప్రభుత్వం. అయితే కొన్ని ప్రత్యేక డిమాండ్ కారణంగా 2015 సంవత్సరంలో కొన్ని మార్పులతో ఒక్క రూపాయి నోటును పునఃప్రారంభించారు.
1917లో తొలిసారిగా 1 రూపాయి నోటు ముద్రణ జరిగిందని పైన పేర్కొన్నట్లుగా దానికి సంబంధించిన ఆసక్తికరమైన సమాచారం ఉంటుంది. అప్పటి వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపించబడలేదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలో 1935 సంవత్సరంలో స్థాపించబడింది. 1 రూపాయి నోటును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేయలేదని దీన్ని బట్టి స్పష్టమవుతోంది. అప్పుడు ఈ నోట్‌ను భారతదేశంలో పాలించిన బ్రిటిష్ ప్రభుత్వం జారీ చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని కాకుండా 1 రూపాయి నోటుపై భారత ప్రభుత్వం అని రాయడానికి కారణం ఇదే. ఈ నోటుపై భారత ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శి సంతకం ఉంటుంది.
అయితే ఆర్బీఐని 1935లో స్థాపించారు. 1949లో దీన్ని జాతీయం చేశారు. 1949కి ముందు అన్ని కరెన్సీ నోట్లను ఆర్పీఐ బదులు భారత ఆర్థిక కార్యదర్శి తరఫున జారీ చేసేవారు. ఆ తర్వాతి కాలంలో ఆ బాధ్యతను అపెక్స్ బ్యాంకు నిర్వహించింది. అప్పటి నుంచి అన్ని కరెన్సీ నోట్లపై ఆర్బీఐ గవర్నర్ సంతకం చేస్తుండగా.. రూపాయి నోటుపై మాత్రం ఆర్థిక కార్యదర్శి సంతకం కొనసాగింది.
1994 తర్వాత రూపాయి నోటు చెలామణిలో లేకుండా పోయింది. దీన్ని టోకెన్ కరెన్సీ నోటుగా పరిగణించారు. అయితే మమరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే మనం వినియోగిస్తున్న నోట్ల తయారీలో 100 శాతం పత్తిని మాత్రమే ఉపయోగిస్తారు. ఆర్బీఐ గవర్నర్ సంతకం చేసిన ప్రతి నోటుపై ఒక స్టేట్‌మెంట్ ముద్రించి ఉంటుంది. నోటుపై పేర్కొన్న విలువను బేరర్‌కు చెల్లిస్తామని ఇది హామీ ఇవ్వబడి ఉంటుంది.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం