AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Credit Card: క్రెడిట్ కార్డు వాడేటప్పుడు ఈ చిన్న తప్పులు చేస్తున్నారా..? మీ కార్డ్ బ్లాక్ అవ్వడం కన్ఫార్మ్..

క్రెడిట్ కార్డులు ప్రస్తుత కాలంలో అందరి దగ్గర ఉంటున్నాయి. ఉద్యోగుల, వ్యాపారులతో పాటు సాామాన్య వ్యక్తులు కూడా క్రెడిట్ కార్డులు వినియోగిస్తున్నారు. అయితే కొంతమందికి క్రెడిట్ కార్డులు ఎలా వాడాలనేది తెలియదు. ఎలా పడితే అలా ట్రాన్సాక్షన్లు చేస్తే ఇబ్బందుల్లో పడుతూ ఉంటారు.

Credit Card: క్రెడిట్ కార్డు వాడేటప్పుడు ఈ చిన్న తప్పులు చేస్తున్నారా..? మీ కార్డ్ బ్లాక్ అవ్వడం కన్ఫార్మ్..
Credit Card
Venkatrao Lella
|

Updated on: Apr 06, 2026 | 12:39 PM

Share

క్రెడిట్ కార్డుల వినియోగం అనేది ఇప్పుడు సాధారణం అయిపోయింది. ఎవరి చేతుల్లో చూసినా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కార్డులు కనిపిస్తున్నాయి. బ్యాంకులు, ఎన్‌ఎఫ్‌బీసీ సంస్థలు రకరకాల ఆఫర్లతో క్రెడిట్ కార్డులు తీసుకోవాల్సిందిగా కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. దీంతో అవసరం లేకపోయినా కొంతమంది డిస్కౌంట్స్, ఆఫర్లు, రివార్డ్ పాయింట్ల కోసం తీసుకుంటున్నారు. ఇక డబ్బులు అత్యవసరం అయిన సమయంలో ఉపయోగపడతాయనే ఉద్దేశంతో మరికొంతమంది వీటిని తీసుకుంటున్నారు. అయితే క్రెడిట్ కార్డులు ఎలా వాడాలో తెలియక చాలామంది ఇబ్బందుల్లో పడతారు. దీంతో వీటిని వాడే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే మీ కార్డు బ్లాక్ అవ్వొచ్చు.

ఇలాంటి ట్రాన్సాక్షన్లు చేయకండి

క్రెడిట్ కార్డులకు సంబంధించి ఆర్బీఐ కొన్ని నిబంధనలను విడుదల చేసింది. వేటికి క్రెడిట్ కార్డు వాడాలి..? ఎలాంటి వాటికి వాడకూడదు? అనే కొన్ని రూల్స్‌ విధించింది. ప్రధానంగా వీటిని వ్యక్తిగత అవసరాల కోసం మాత్రమే వినియోగించుకోవాలి. వీటి ద్వారా షేర్స్, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టో కరెన్సీ వంటి ట్రాన్సాక్షన్లు చేయడం పూర్తిగా నిషేధం. ఇలాంటి నిషేధిత లావాదేవీలు చేస్తే మీ కార్డును వెంటనే బ్యాంకులు బ్లాక్ చేస్తాయి. ఇక బెట్టింగ్స్, ఆన్ లన్ గ్యాంబ్లింగ్ వంటి వాటికి కూడా వాడకూడదు.

ఒకేసారి ఎక్కువ వాడేస్తే..

మీరు క్రెడిట్ కార్డు నుంచి ఒకేసారి లక్షల్లో ట్రాన్సాక్షన్స్ చేసినా బ్లాక్ చేసే అవకాశం ఉంటుంది. మీరు ప్రతీ నెలా తక్కువ మొత్తంలో రూ.20 వేల ఖర్చు చేస్తున్నారనుకుందాం. అయితే ఒకేసారి రూ.2 లక్షలు వాడితే బ్యాంక్ ఫ్రాండ్ కింద భావిస్తోంది. దీంతో భద్రత కోసం మీ క్రెడిట్ కార్డును బ్లాక్ చేయవచ్చు. ఇక గుర్తు తెలియని వెబ్ సైట్లలో ట్రాన్సాక్షన్స్ చేసి బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంది.

బిల్లు కట్టకపోతే..

ఇక వరుసగా మూడు నెలల పాటు మినిమం డ్యూ చెల్లించకపోతే మిమ్మల్ని డిఫాల్టర్‌గా పరిగణిస్తారు. ఇలాంటి సమయంలో మీ కార్డు నుంచి ఎలాంటి ట్రాన్సాక్షన్లు చేసుకోవడానికి వీల్లేకుండా బ్లాక్ చేస్తారు. ఇక డీఫాల్టర్ అయినట్లు సిబిల్‌కు రిపోర్ట్ చేస్తారు. దీని వల్ల మీ క్రెడిట్ స్కోర్ భారీగా తగ్గిపోతుంది. దీని వల్ల భవిష్యత్తులో మీకు ఎలాంటి కార్డులు, రుణాలు మంజూరు చేయరు. ఇక వ్యాపార అవసరాల కోసం ఎక్కువగా వాడినా బ్లాక్ అయ్యే అవకాశముంటుందని నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు షాపులో వస్తువులు కొనుగోలు చేయడం లాంటి వాటికి పర్సనల్ క్రెడిట్ కార్డు ఉపయోగించకూడదు. ఇవన్నీ తెలుసుకుని క్రెడిట్ కార్డు వాడాలని నిపుణులు చెబుతున్నారు.

Follow Us