PAN-Aadhaar Link: పాన్‌కార్డును ఆధార్‌తో లింక్‌ చేయకపోతే పాన్‌ చెల్లుబాటు కాదా? ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ ఏం చెప్పింది

|

Jul 02, 2023 | 12:04 PM

పాన్‌ను ఆధార్‌తో అనుసంధానించడానికి గడువు ముగిసింది. గతంలో గడువు ముగిసినా తర్వాత పెంచుతూ వచ్చింది ప్రభుత్వం. కానీ ఈ సారి ఎలాంటి గడువు పెంచలేదు. జూన్ 30 లోపు పాన్‌-ఆధార్‌ను లింక్‌ చేయనివారికి పాన్‌ డియాక్టివేట్‌ చేయనున్నట్లు అధికారులు..

PAN-Aadhaar Link: పాన్‌కార్డును ఆధార్‌తో లింక్‌ చేయకపోతే పాన్‌ చెల్లుబాటు కాదా? ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ ఏం చెప్పింది
Pan Aadhaar
Follow us on

పాన్‌ను ఆధార్‌తో అనుసంధానించడానికి గడువు ముగిసింది. గతంలో గడువు ముగిసినా తర్వాత పెంచుతూ వచ్చింది ప్రభుత్వం. కానీ ఈ సారి ఎలాంటి గడువు పెంచలేదు. జూన్ 30 లోపు పాన్‌-ఆధార్‌ను లింక్‌ చేయనివారికి పాన్‌ డియాక్టివేట్‌ చేయనున్నట్లు అధికారులు పదేపదే ప్రకటించారు. లింక్‌ చేయని కార్డులు చెల్లుబటు కావని, పాన్‌కార్డు సేవలు పొందలేని ప్రభుత్వం తెలిపింది. ఇంకా ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేయని వారు పాన్‌ను ఆధార్‌తో లింక్ చేసిన తర్వాత మాత్రమే చేయవచ్చు. అయితే గడువు ముగిసినా ఆదాయపు పన్ను శాఖ గానీ, కేంద్రం గానీ ఎటువంటి ప్రకటన చేయలేదు.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ నోటిఫికేషన్ జారీ చేసిన ప్రకటన ప్రకారం.. రూ.1,000 జరిమానా చెల్లించిన 30 రోజుల తర్వాత పాన్‌ను మళ్లీ యాక్టివేట్ చేయవచ్చని తెలిపింది. అంటే ముందుగా రూ.1000 జరిమానా చెల్లించాలి. పాన్‌ కార్డ్‌ను మళ్లీ యాక్టివేట్ చేయడానికి పాన్‌-ఆధార్‌ లింక్ చేసిన తేదీ నుంచి 30 రోజుల వరకు వేచి ఉండాలి. ఆ తర్వాతే పాన్‌ యాక్టివ్‌ అవుతుంది. జూన్ 30, 2023లోపు లింక్ చేయని వ్యక్తులను ఆదాయపు పన్ను శాఖ పరిగణనలోకి తీసుకుంటుందని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది.

ఇవి కూడా చదవండి

 

పాన్‌ లింక్ చేయకపోతే ..

జూన్ 30, 2023లోగా పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయకపోతే, పాన్ ఇన్‌యాక్టివ్‌గా మారుతుందని గుర్తుంచుకోండి అని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. ఒకసారి PAN పనిచేయకపోతే, ఆదాయపు పన్ను రీఫండ్ ఉండదు. ఆదాయం, వ్యయంపై అధిక TDS, TCS వర్తిస్తుంది. వినియోగదారులు బ్యాంక్ ఎఫ్‌డిలు, మ్యూచువల్ ఫండ్ పథకాలు మొదలైన వాటిలో ఇన్వెస్ట్‌ చేయలేరు. ఆస్తి కొనుగోలు, అమ్మకం అలాగే బ్యాంకు లావాదేవీలు, ఖాతా తెరవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు.

ఆదాయపు పన్ను శాఖ ఏమని చెప్పిందంటే..

అయితే చివరి సమయంలో చాలా మంది అనుసంధానం చేయడంలో కొంత సమస్య ఎదురైంది. ఆధార్-పాన్ లింకింగ్ కోసం రుసుము చెల్లించిన తర్వాత చలాన్ డౌన్‌లోడ్ చేసుకోవడంలో పాన్ హోల్డర్లు ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలు గమనించామని,. దీనికి సంబంధించి, లాగిన్ అయిన తర్వాత పోర్టల్‌లోని ‘ఇ-పే ట్యాక్స్’ ట్యాబ్‌లో చలాన్ చెల్లింపు స్థితిని తనిఖీ చేయవచ్చని తెలిపింది. చెల్లింపు విజయవంతమైతే, పాన్ హోల్డర్ పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడానికి కొనసాగవచ్చు. పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడానికి చలాన్ రసీదుని డౌన్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఇంకా, పాన్ హోల్డర్ విజయవంతంగా చెల్లింపును పూర్తి చేసిన వెంటనే, చలాన్ అటాచ్ చేసిన కాపీతో కూడిన ఇమెయిల్ ఇప్పటికే పాన్ హోల్డర్‌కు పంపబడుతోందని, ఎలాంటి టెన్షన్‌ పడాల్సిన అవసరం లేదని తెలిపింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి