నిమిషాల్లో లోన్.. లక్షల్లో మోసం.. మీ క్రెడిట్ హిస్టరీని ఇలా కాపాడుకోండి..
డిజిటల్ చెల్లింపుల్లో భారత్ అగ్రస్థానంలో ఉన్నప్పటికీ, ఆన్‌లైన్ మోసగాళ్లు మీ క్రెడిట్ డేటాను సులభంగా దొంగిలిస్తున్నారు. సెకన్లలో లోన్లు మంజూరయ్యే ఈ వేగవంతమైన యుగంలో.. మీ అనుమతి లేకుండానే రుణాలు మంజూరయ్యే ప్రమాదం ఉంది. మీ క్రెడిట్ స్కోర్‌ను కాపాడుకోవడానికి మీరు ఏం చేయాలనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

నేటి డిజిటల్ యుగంలో షాపింగ్ నుండి చెల్లింపుల వరకు ప్రతిదీ ఆన్‌లైన్‌లోనే. డిజిటల్ చెల్లింపుల్లో ప్రపంచంలోనే భారత్ అగ్రస్థానంలో ఉంది. ఇక బ్యాంకులు, ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు లోన్ ఇచ్చేముందు ఫస్ట్ చెక్ చేసది మీ క్రెడిట్ హిస్టరీని. క్రెడిట్ హిస్టరీ బాగుంటే లోన్స్ త్వరగా మంజూరు అవుతాయి. అయితే కేటుగాళ్లు మీ క్రెడిట్ హిస్టరీని ఈజీగా చోరీ చేస్తున్నారు. ఆన్‌లైన్ లావాదేవీల కోసం క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల వాడకం పెరుగుతున్నందున.. మీ సున్నితమైన క్రెడిట్ వివరాలు చోరీ చేసే అవకాశాలు పెరుగుతున్నాయి. కస్టమర్ అనుమతి లేకుండానే కొన్ని సార్లు లోన్స్ మంజూరు ఘటనలు లేకపోలేదు.
సెకన్లలో రుణం: మోసానికి అవకాశం
దాదాపు అన్ని ఆర్థిక సంస్థలు తమ కస్టమర్ల క్రెడిట్ నివేదికలను తనిఖీ చేస్తారు. ఈ సమాచారం సిబిల్ వంటి నాలుగు ప్రధాన బ్యూరోల నుండి తీసుకుంటాయి. కొత్త రుణ దరఖాస్తు చేసిన వెంటనే.. బ్యాంకులు క్రెడిట్ హిస్టరీని తనిఖీ చేసి.. అన్నీ సరిగ్గా ఉంటే, సెకన్లలోనే రుణాన్ని ఆమోదిస్తారు. దరఖాస్తు, ధృవీకరణ, సంతకం, పంపిణీ అన్నీ ఆన్‌లైన్‌లోనే పూర్తవుతాయి. డిజిటల్ రుణాల యొక్క ఈ వేగవంతమైన ధోరణి ఎంత సౌకర్యవంతంగా ఉందో.. మోసాలు కూడా అదే స్థాయిలో పెంచింది.
క్రెడిట్ మోసాన్ని నివారించడానికి మీరు చేయవలసినవి
మీరు క్రెడిట్ హిస్టరీ చోరీ కాకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకోవాలి.
పబ్లిక్ వైఫైలో లావాదేవీలు: పబ్లిక్ వైఫై ఉపయోగిస్తున్నప్పుడు ఆన్‌లైన్ చెల్లింపులు లేదా డబ్బు ట్రాన్స్‌ఫైర్ చేయవద్దు. ఎందుకంటే హ్యాకర్లు మీ లావాదేవీలను సులభంగా ట్యాంపర్ చేయవచ్చు.
పర్సనల్ డాక్యుమెంట్స్: మీ పాన్, ఆధార్ కార్డ్, బ్యాంక్ ఖాతా నంబర్‌లు, క్రెడిట్-డెబిట్ కార్డ్ నంబర్‌లు వంటి వ్యక్తిగత వివరాలను సోషల్ మీడియాలో ఎప్పుడూ పోస్ట్ చేయవద్దు. స్కామర్లు వీటిని ఉపయోగించి మీ పేరు మీద లోన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. రికవరీ ఏజెంట్ల నుండి కాల్స్ వచ్చే వరకు మీకు విషయం తెలియకపోవచ్చు.
ఎన్‌క్రిప్షన్ – టోకనైజేషన్: ఆన్‌లైన్ లావాదేవీలు చేస్తున్నప్పుడు మొబైల్ వాలెట్‌లను ఉపయోగించండి. ఇవి కార్డులను నిల్వ చేయడానికి, చెల్లింపులను టోకనైజ్ చేయడానికి సహాయపడతాయి. తద్వారా మీ గుర్తింపు సురక్షితంగా ఉంటుంది.
క్రెడిట్ స్కోర్ చెక్: మీ క్రెడిట్ స్కోర్ నివేదికను ఎప్పటికప్పుడు ట్రాక్ చేయండి. మీరు సంవత్సరానికి ఒక ఉచిత సిబిల్ నివేదికను పొందవచ్చు. మీ క్రెడిట్ ప్రొఫైల్‌ను వెంటనే పర్యవేక్షించడం ప్రారంభించండి.
రుణదాతలకు ముఖ్యమైన సూచనలు
దేశంలో లోన్ అప్రూవల్ ప్రక్రియ చాలా వేగంగా ఉంటుంది. వెరిఫికేషన్ సరిగా జరగకపోవడం, కేవలం మొబైల్ నంబర్ లేదా ఇమెయిల్ ఆధారంగా లోన్స్ అప్రూవ్ చేయండి మోసం ప్రమాదాన్ని పెంచుతుంది. దీనిని నివారించడానికి.. రుణదాతలు ఈ మూడు విషయాలను తప్పనిసరిగా చెక్ చేయాలి,
- ఏదైనా క్రెడిట్ నివేదికను యాక్సెస్ చేయడానికి ముందు కస్టమర్ అనుమతి తప్పనిసరి.
- క్రెడిట్ హిస్టరీని యాక్సెస్ చేసిన ప్రతిసారీ లేదా లోన్ అప్రూవ్ చేసినప్పుడు కస్టమర్‌కు ఎస్ఎంఎస్ లేదా ఇమెయిల్ నోటిఫికేషన్లు అందేలా చూడాలి.
- కస్టమర్ యొక్క ఇ-సైన్, గుర్తింపు స్వతంత్రంగా ధృవీకరించబడిన తర్వాత మాత్రమే లోన్ విడుదల చేయాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




