AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Olectra Electric Bus: గుజరాత్ రాష్ట్ర ఆర్టీసీకి  50 ఎలక్ట్రిక్ బస్సులను సరఫరా చేయనున్న ఒలెక్ట్రా!

గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం తమ ఆర్టీసీ కోసం కొనుగోలు చేయాలని భావిస్తున్న ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు కోసం ఒలెక్ట్రా కంపెనీకి భారీ ఆర్డర్ ఇచ్చింది.

Olectra Electric Bus: గుజరాత్ రాష్ట్ర ఆర్టీసీకి  50 ఎలక్ట్రిక్ బస్సులను సరఫరా చేయనున్న ఒలెక్ట్రా!
Olectra Electric Bus
KVD Varma
|

Updated on: Aug 16, 2021 | 7:34 PM

Share

Olectra Electric Bus: ఆకాశాన్నంటుతున్న పెట్రోల్ ధరలు సామాన్యులకు గుదిబండగా మారుతున్నాయి. అదేవిధంగా ఇవి ప్రభుత్వాలకూ తలనొప్పులు తెస్తున్నాయి. రవాణా సదుపాయాల ఏర్పాటులో ప్రభుత్వాలకు వరుసగా పెరుగుతూ వస్తున్న పెట్రోల్ ధరలు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. అందుకోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లవైపు ప్రభుత్వాలు కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో గుజరాత్ రాష్ట్రం ఒక ప్రధానమైన నిర్ణయం తీసుకుంది. తమ ఆర్టీసీ బస్సులను ఎలక్ట్రిక్ వాహనాల వైపు మార్చేందుకు సిద్ధం అవుతోంది. ఇందులో భాగంగా 50 ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుంది.

గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం తమ ఆర్టీసీ కోసం కొనుగోలు చేయాలని భావిస్తున్న ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు కోసం ఒలెక్ట్రా కంపెనీకి భారీ ఆర్డర్ ఇచ్చింది. మొత్తం 50 బస్సులను ఒలెక్ట్రా నుంచి కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు ఒలెక్ట్రా గ్రీన్ టెక్ 50 నెంబరు 9 మీటర్ ఎలక్ట్రిక్ బస్సులకు గుజరాత్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (GSRTC) నుండి అవార్డు లేఖను అందుకుంది. స్థూల వ్యయ కాంట్రాక్ట్ (GCC) / OPEX మోడల్ ప్రాతిపదికన పదేళ్ల పాటు అదనంగా 50 ఎలక్ట్రిక్ బస్సులను సరఫరా చేయడానికి కూడా గుజరాత్ ప్రభుత్వం ఒలెక్ట్రా కంపెనీకి ఆర్డర్ ఇచ్చింది.

ఒలెక్ట్రా  కంపెనీ ఈ  50 ఎలక్ట్రిక్ బస్సులు 12 నెలల వ్యవధిలో గుజరాత్ స్టేట్ ఆర్టీసీకి అందచేస్తుంది. అదేవిధంగా కాంట్రాక్ట్ వ్యవధిలో ఈ బస్సుల నిర్వహణను కూడా కంపెనీ చేపడుతుంది. ఈ ఆర్డర్ తో గుజరాత్ ప్రభుత్వం మొత్తం 1350 ఎలక్ట్రిక్ బస్సులకు ఆర్డర్ ఇచ్చినట్లయింది. ఇటీవల (16 డిసెంబర్ 2020) గుజరాత్ ఆర్టీసీ ప్రకటించిన L-1 బిడ్డర్‌లో 353 బస్సులలో భాగంగా ప్రస్తుతం ఈ 50 బస్సులకు ఆర్డర్ ఇచ్చింది.

“మేము గుజరాత్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ నుండి 50 ఎలక్ట్రిక్ బస్సుల ఆర్డర్‌ను పొందినట్లు ప్రకటించడం మాకు సంతోషంగా ఉంది. ఈ కొత్త ఆర్డర్‌తో, మా ఆర్డర్ పరిమాణం దాదాపు 1350 బస్సులకు పెరిగింది. మేము ఇప్పటికే సూరత్‌లో బస్సులను నడుపుతున్నాము. ఈ కొత్త ఆర్డర్‌తో, గుజరాత్ రాష్ట్రంలో ఫ్లీట్ సైజు 250 ఎలక్ట్రిక్ బస్సులు. ఇది OGL బృందానికి గర్వించదగ్గ క్షణం, “అని ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్ ఎండీ కేవీ ప్రదీప్ చెప్పారు.

ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులు ఎలా ఉంటాయంటే..

ఈ ఒలెక్ట్రా ఎయిర్ కండిషన్డ్ బస్సులు 9 మీటర్ల పొడవు ఉంటాయి. ఇవి ప్రయాణములో సౌకర్యాన్ని ఇవ్వడానికి ఎలక్ట్రానిక్ కంట్రోల్డ్ ఎయిర్ సస్పెన్షన్‌తో 33+డ్రైవర్ సీటింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. బస్సుల్లో ప్రయాణికుల భద్రత, అత్యవసర బటన్, యుఎస్‌బి సాకెట్లతో పాటు సీసీ కెమెరాలు కూడా అమర్చారు. బస్సులో ఇన్‌స్టాల్ చేయబడిన లిథియం-అయాన్ (Li-ion) బ్యాటరీ ట్రాఫిక్, ప్రయాణీకుల లోడ్ పరిస్థితుల ఆధారంగా 180-200 KM ల చుట్టూ ప్రయాణించడానికి వీలు కల్పిస్తుంది. సాంకేతికంగా అభివృద్ధి చెందిన ఎలక్ట్రిక్ బస్సులో పునరుత్పత్తి బ్రేకింగ్ వ్యవస్థ ఉంది. ఇది బ్రేకింగ్‌లో కోల్పోయిన గతి శక్తిలో కొంత భాగాన్ని తిరిగి పొందడానికి బస్సును అనుమతిస్తుంది. హై-పవర్ AC ఛార్జింగ్ సిస్టమ్ 3-4 గంటల మధ్య బ్యాటరీని పూర్తిగా రీఛార్జ్ చేసేస్తుంది.

ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్ ( MEIL గ్రూప్ కంపెనీ) గురించి..

ఈ కంపెనీ MEIL గ్రూప్‌లో భాగంగా 2000 సంవత్సరంలో ప్రారంభించారు. ఎలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్ పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ. ఈ కంపెనీ ఎలక్ట్రిక్ బస్సులను భారతదేశంలో ప్రవేశపెట్టిన మొదటి కంపెనీ. ఇది 2015 లో భారతదేశంలో ఎలక్ట్రిక్ బస్సులను పరిచయం చేసింది.  ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్ పవర్ ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌ల కోసం సిలికాన్ రబ్బర్/కాంపోజిట్ ఇన్సులేటర్‌ల ఉత్పత్తిలో భారతదేశంలోనే  అతిపెద్ద కంపెనీ.

Also Read: Online Sale: అమెజాన్..ఫ్లిప్ కార్ట్..పేటీఎంల ద్వారా ఈజీగా మీ వస్తువులు అమ్ముకోవచ్చు..ఎలాగంటే..

SBI Lunch Time: మీరు లంచ్‌ టైమ్‌లో బ్యాంకుకు వెళ్తున్నారా? అయితే మీ సమయం వృధా కాకుండా ఈ సమయాలను గుర్తించుకోండి