- Telugu News Photo Gallery Technology photos Amazon Mobile Savings Days Goes Live From August 16th Have A Look On Best Offers
Amazon Mobile Savings Days: అమేజాన్ మొబైల్ సేవింగ్స్ డేస్ వచ్చేశాయ్.. అదిరిపోయే ఆఫర్లపై ఓ లుక్కేయండి.
Amazon Mobile Savings Days: మొబైల్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటోన్న వారికి గుడ్ న్యూస్. అమేజాన్ మొబైల్ సేవింగ్స్ డేస్ పేరుతో ఆగస్టు 16న ప్రారంభమైన ఈ సేల్ 18తో ముగియనుంది. ఇందులో భాగంగా పలు మొబైల్స్‌పై అందిస్తోన్న ఆఫర్లపై ఓ లుక్కేయండి..
Updated on: Aug 16, 2021 | 7:44 PM

ప్రముఖ ఆన్‌లైన్ షాపింప్ సంస్థ అమేజాన్ మరోకొత్త ఆఫర్‌తో వినియోగదారులను ఆకట్టుకునేందుకు వచ్చింది. మొబైల్ ఫోన్స్‌పై అదిరిపోయే ఆఫర్లను అందిస్తూ మొబైల్ సేవింగ్స్ డే సేల్‌ను ప్రారంభించింది.

ఆగస్టు 16న ప్రారంభమైన ఈ సేల్ 19వ తేదీ వరకు కొనసాగనుంది. మరి అమేజాన్ మొబైల్స్‌పై అందిస్తోన్న పలు ఆఫర్లపై ఓ లుక్కేయండి.

ఇండస్‌లాండ్, సిటీ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేసే వారికి పది శాతం (గరిష్టంగా రూ. 1250) డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది. అంతేకాకుండా ఆకర్షణీయమైన ఎక్సేంజ్ ఆఫర్లతో పాటు 12 నెలలతో నో కాస్ట్ ఈఎమ్‌ఐ ఆప్షన్‌ను అందించారు.

ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఉన్న వారికి ప్రత్యేకంగా 6 నెలల స్క్రీన్ రిప్లేస్‌మెంట్ ఆఫర్‌ను అందిస్తున్నారు. అంతేకాకుండా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డుతో కొనుగోలు చేస్తే మరో మూడు నెలలు అదనంగా నో కాస్ట్ ఈఎమ్‌ఐ అందిస్తారు.

వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లపై రూ. 3000 తగ్గింపు అందించారు. ఇందులో భాగంగానే కొత్తగా లాంచ్ చేసిన నార్డ్ 2 స్మార్ట్ ఫోన్ రూ. 29,999కే అందుబాటులోకి రానుంది.

ఇక రెడ్‌మీ విషయానికొస్తే కొత్తగా లాంచ్ చేసిన రెడ్‌మీ నోట్ 10 ప్రో మ్యాక్స్, రెడ్‌మీ నోట్ 10 ప్రో, రెడ్‌మీ నోట్ 10, ఎమ్‌ఐ 11 ఎక్స్‌లపై భారీ డిస్కౌంట్‌లు అందించారు. షియోమీకి చెందిన అన్ని ఫోన్లపై 18 నెలల నో కాస్ట్ ఈఎమ్‌ఐ అందించారు.

శామ్‌సంగ్ ఎమ్ సిరీస్ కొనుగోలు చేసే వారికి 6 నెలల నో కాస్ట్ ఈఎమ్‌ఐ ఆఫర్ ఉంది. అలాగే ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఉన్న వారికి 9 నెలల నో కాస్ట్ ఈఎమ్‌ఐతో పాటు ఆరు నెలల వరకు ఫ్రీ స్క్రీన్ రిప్లేస్‌మెంట్ అవకాశాన్ని అందించారు.





























