Pension Scheme: అది తమ పరిశీలనలో లేదు.. పెన్షన్ పథకంపై కీలక ప్రకటన చేసిన కేంద్రం

|

Dec 13, 2022 | 3:14 PM

ప్రభుత్వ ఉద్యోగులకు మళ్లీ పాత పెన్షన్ స్కీమ్ ను ప్రభుత్వం ప్రారంభించబోతుందా..? ఈ ప్రశ్నకు ప్రభుత్వం ఇప్పుడు పార్లమెంటులో సమాధానం ఇచ్చింది. పాత పెన్షన్ పథకం..

Pension Scheme: అది తమ పరిశీలనలో లేదు.. పెన్షన్ పథకంపై కీలక ప్రకటన చేసిన కేంద్రం
Pension Scheme
Follow us on

ప్రభుత్వ ఉద్యోగులకు మళ్లీ పాత పెన్షన్ స్కీమ్ ను ప్రభుత్వం ప్రారంభించబోతుందా..? ఈ ప్రశ్నకు ప్రభుత్వం ఇప్పుడు పార్లమెంటులో సమాధానం ఇచ్చింది. పాత పెన్షన్ పథకం పునరుద్ధరించే ప్రతిపాదనేదీ తమ పరిశీలనలో లేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాద్ స్పష్టం చేశారు. సోమవారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల్లో ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. పాత పెన్షన్ పథకం కింద ఉద్యోగులకు నిర్ధిష్ట పెన్షన్ లభిస్తుంది. చివరి నెల వేతనంలో సగం వేతనం పెన్షన్‌గా పొందుతారు. కానీ, 2004లో అమల్లోకి వచ్చిన నేషనల్ పెన్షన్ స్కీమ్ కింద పెన్షన్ మొత్తం కంట్రిబ్యూటరీగా ఖరారు అవుతుంది.

అయితే తమ ఉద్యోగులకు పాత పెన్షన్‌ విధానాన్ని పునః ప్రారంభిస్తామని కేంద్ర సర్కార్‌కు, పెన్షన్‌ అండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (పీఎఫ్‌ఆర్డీఏ)కు జార్ఖండ్‌, ఛత్తీస్‌గడ్‌, రాజస్థాన్‌ ప్రభుత్వాలు తెలిపాయి. దీంతో కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి భాగవత్‌ కరాద్‌ చేసిన ప్రకటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే పంజాబ్ ప్రభుత్వ ఉద్యోగులను ఎన్‌పిఎస్ నుండి ఒపిఎస్‌గా మారుస్తున్నట్లు పంజాబ్‌లోని భగవంత్ మాన్ ప్రభుత్వం నవంబర్ 18న నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిపై పంజాబ్‌ ప్రభుత్వం కేంద్రానికి సమాచారం ఇవ్వలేదని భగవత్‌ తెలిపారు. పాత పెన్షన్ పథకం అమలు చేయడానికి పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అధారిటీ యాక్ట్ -2013 కింద ఎటువంటి నిబంధనల్లేవని స్పష్టం చేశారు.

ఇందులో ఉద్యోగి పదవీ విరమణ తర్వాత ప్రతి నెలా ఉద్యోగి చివరి పెన్షన్‌లో 50 శాతం పొందుతాడు. అదే సమయంలో 2004 సంవత్సరంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పెన్షన్ స్కీమ్ అంటే ఎన్‌పిఎస్‌ని అమలు చేసింది. ఈ పథకం కింద ఉద్యోగులు వారి కంట్రిబ్యూషన్ ఆధారంగా మాత్రమే పెన్షన్ పొందుతారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి