AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ola Electric: మార్కెట్లో ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్ల హవా.. భారీగా విక్రయాలు

ఇప్పటికే ఓలా నుంచి చాలా రకాల ఎలక్ట్రిక్‌ స్కూటర్లు అందుబాటులోకి వచ్చాయి. ఇక వాహన పోర్టల్‌లో.. ఓలా ఎలక్ట్రిక్ జనవరిలో 31,000 రిజిస్ట్రేషన్‌లను నమోదు చేసిందని, ఎలక్ట్రిక్‌ విభాగంలో పోల్ పొజిషన్‌ను కొనసాగించి, ఆకట్టుకునే మార్కెట్ వాటాను 40% కొనసాగించిందని ఓలా కంపెనీ తెలిపింది. కంపెనీ ఈ నెలలో అత్యధిక నెలవారీ రిజిస్ట్రేషన్‌లను సాధించింది. అలాగే గత ఏడాది..

Ola Electric: మార్కెట్లో ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్ల హవా.. భారీగా విక్రయాలు
Ola
Subhash Goud
|

Updated on: Jan 31, 2024 | 6:03 PM

Share

ప్రస్తుతం ఎలక్ట్రిక్‌ వాహనాల హవా కొనసాగుతోంది. దేశంలో ఇప్పటికే పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరల కారణంగా ఎలక్ట్రిక్‌ వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి. దీంతో వాహనదారులు కూడా ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక మొట్ట మొదటిగా ఓలా నుంచి ఎలక్ట్రిక్‌ వాహనం అందుబాటులోకి వచ్చింది. మొదటి నుంచి ఇప్పటి వరకు అంచెలంచెలుగా వృద్ధి సాధిస్తూ వచ్చింది. ఇప్పటికే ఓలా నుంచి చాలా రకాల ఎలక్ట్రిక్‌ స్కూటర్లు అందుబాటులోకి వచ్చాయి. ఇక వాహన పోర్టల్‌లో.. ఓలా ఎలక్ట్రిక్ జనవరిలో 31,000 రిజిస్ట్రేషన్‌లను నమోదు చేసిందని, ఎలక్ట్రిక్‌ విభాగంలో పోల్ పొజిషన్‌ను కొనసాగించి, ఆకట్టుకునే మార్కెట్ వాటాను 40% కొనసాగించిందని ఓలా కంపెనీ తెలిపింది. కంపెనీ ఈ నెలలో అత్యధిక నెలవారీ రిజిస్ట్రేషన్‌లను సాధించింది. అలాగే గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 70% పైగా వృద్ధిని నమోదు చేసింది.

డిసెంబరులో ఓలా ఎలక్ట్రిక్ ఒక నెలలో 30,000 రిజిస్ట్రేషన్‌లను నమోదు చేసిన మొదటి ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహన తయారీదారుగా అవతరించింది. అలాగే ఇది జనవరిలో సంఖ్యలను అధిగమించింది. ఓలా ఎలక్ట్రిక్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అన్షుల్ ఖండేల్వాల్ మాట్లాడుతూ.. జనవరిలో మా రిజిస్ట్రేషన్లు ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుందని తెలిపారు. ఇది 2024కి అసాధారణమైన ప్రారంభంగా భావిస్తున్నాము. S1 ప్రో, S1 ఎయిర్, S1 X+తో కూడిన మా బలమైన ఉత్పత్తి లైనప్ ఊపందుకున్నందున, ఎలక్ట్రిక్ వాహనాలకు మారడానికి ఎక్కువ మంది వినియోగదారులను ప్రోత్సహిస్తుందని మేము నమ్ముతున్నాము అని అన్నారు.

ఓలా ఎలక్ట్రిక్ ఇటీవల తన స్కూటర్ పోర్ట్‌ఫోలియోను ఐదు ఉత్తమ-కేటగిరి ఉత్పత్తులకు విస్తరించింది. S1 Pro రూ. 1,47,499 కంపెనీ ఫ్లాగ్‌షిప్ స్కూటర్ అయితే S1 ఎయిర్ రూ. 1,19,999 వద్ద అందుబాటులో ఉంది. ఇది అదనంగా దాని ICE-కిల్లర్ ఉత్పత్తి, S1Xని మూడు వేరియంట్‌లలో ప్రవేశపెట్టిందని తెలిపారు. S1 X+, S1 X (3kWh), S1 X (2kWh) విభిన్న ప్రాధాన్యతలతో రైడర్‌ల అవసరాలను తీర్చడానికి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. అయితే S1 X+ ధర రూ. ప్రస్తుతం రూ.1,09,999 (ఎక్స్ -షోరూమ్‌ ధర) ఉండగా, ఆఫర్‌లోభాగంగా రూ.20,000 తగ్గింపుతో రూ.89,999కు అందుబాటులో ఉందని తెలిపారు.

ఇక S1 X (3kWh), S1 X (2kWh) కోసం రిజర్వేషన్ విండో రూ. 999తో బుకింగ్‌ చేసుకోవచ్చు అని అన్నారు. ఇది వరుసగా రూ. 99,999, రూ. 89,999 ప్రారంభ ధరలో అందుబాటులో ఉన్నాయన్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి