Ola Electric Scooter: ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. చవకైన ధరకే ఒలా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్.. పూర్తి వివరాలు ఇవి..
ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్ కొత్త సిరీస్ ఎలక్ట్రిక్ వాహనాలను లాంచ్ చేశారు. ఓలా ఎస్1 ఎక్స్ పేరుతో విడుదలైన ఈ స్కూటర్లు ఓలా కంపెనీ నుంచి వస్తున్న అత్యంత చవకైన స్కూటర్లు. వీటి ప్రారంభ ధరలు రూ. 79,999 నుంచి రూ. 99,999 వరకూ ఉంటాయి. మూడు వేరియంట్లలో ఇది లాంచ్ అవగా.. 2కేడబ్ల్యూహెచ్ సామర్థ్యంతో కూడిన స్కూటర్ ధర రూ. 79,999 గా ఉంటుంది.

విద్యుత్ శ్రేణి ద్విచక్ర వాహనాల్లో సంచలనం ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు. చూడటానికి చిన్నగా క్యూట్ గా కనిపించే ఈస్కూటర్లు విక్రయాల్లో టాప్ లేపుతున్నాయి. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్లు ఇవే. అత్యాధునిక ఫీచర్లు, సరికొత్త స్పెసిఫికేషన్లు, అత్యధిక రేంజ్ తో ఇవి వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. అయితే వీటి ధరలు కాస్త ఎక్కువగానే ఉంటున్నాయి. ఈ క్రమంలో మరో సరికొత్త స్కూటర్లకు ఓలా ఎలక్ట్రిక్ నాంది పలికింది. అతి తక్కువ ధరలోనే ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేసింది. ఆగస్టు 15 రోజున ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్ కొత్త సిరీస్ ఎలక్ట్రిక్ వాహనాలను లాంచ్ చేశారు. ఓలా ఎస్1 ఎక్స్ పేరుతో విడుదలైన ఈ స్కూటర్లు ఓలా కంపెనీ నుంచి వస్తున్న అత్యంత చవకైన స్కూటర్లు. వీటి ప్రారంభ ధరలు రూ. 79,999 నుంచి రూ. 99,999 వరకూ ఉంటాయి. మూడు వేరియంట్లలో ఇది లాంచ్ అవగా.. 2కేడబ్ల్యూహెచ్ సామర్థ్యంతో కూడిన స్కూటర్ ధర రూ. 79,999 గా ఉంటుంది. ఇతర రెండు వేరియంట్లు స్టాండర్డ్ ఎస్1 ఎక్స్ ధర రూ. 89,999, టాప్ మోడల్ ఎస్1 ఎక్స్ ప్లస్ మోడల్ స్కూటర్ ధర రూ. 99,999గా ఉంది. ఎస్1 ఎక్స్ ప్లస్ స్కూటర్ లు సెప్టెంబర్ నుంచి వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయి. ఇతర రెండు వేరియంట్లు ఈ ఏడాది డిసెంబర్ నుంచి డెలివరీలు ప్రారంభిస్తాయి. ఈ ధరలు ప్రారంభ ధరలు మాత్రమే నని ఆగస్టు 21 లోపు బుక్ చేసుకున్న వారికి ఇవి వర్తిస్తాయని కంపెనీ పేర్కొంది. ఆ తర్వాత ప్రతి స్కూటర్ అసలు ధర రూ. 10,000 వరకూ పెరుగుతుంది.
ఓలా ఎస్1 ఎక్స్ స్పెసిఫికేషన్లు..
ఓలా కొత్త నినాదంతో మార్కెట్లోకి కొత్త ఉత్పత్తులను లాంచ్ చేస్తోంది. కిల్ ఐసీఈ ఐడియాలజీ పేరుతో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రమోట్ చేస్తోంది. ఆగస్టు 15న నిర్వహించిన ఓలా నిర్వహించిన ఈవెంట్లో ఎస్1 ఎక్స్ స్కూటరే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. దీని డిజైన్ కొంచెం ప్రత్యేకంగా ఉంటుంది. ఓలా ఎస్1 స్కూటర్ తో పోల్చితే ముందు వైపు కొన్ని మార్పులు చేసింది. దీనికి ఎత్తైన హెడ్ లైట్ చాంబర్ ఇచ్చారు. ఈ ఓలా ఎస్1 ఎక్స్ బ్యాటరీ రెండు సామర్థ్యాలతో వచ్చింది. ఒకటి 2కేడబ్ల్యూహెచ్ కాగా, మరొకటి 3 కేడబ్ల్యూహెచ్. ఇది గరిష్టంగా 151 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. గరిష్టంగా గంటకు 90 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.
వీటితో పాటు సరికొత్త సాఫ్ట్ వేర్ ను కూడా ఇదే ఈవెంట్లో భవిష్ అగర్వాల్ పరిచయం చేశారు. మూవ్ ఓఎస్ 4 ను పేరు దీనిని త్వరలో లాంచ్ చేయనున్నట్లు చెప్పారు. అక్టోబర్ చివరి నాటికి ఈ కొత్త సాఫ్ట్ వేర్ ను అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. అలాగే మరో 100 కొత్త సర్వీస్ సెంటరలను కూడా ఓలా ప్రారంభిస్తున్నట్లు సీఈఓ భవిష్ అగర్వాల్ ప్రకటించారు. దేశ వ్యాప్తంగా వీటిని నెలకొల్పుతున్నట్లు చెప్పారు. వీటి కలిపి మొత్తం 300 సర్వీస్ స్టేషన్లు దేశంలో అందుబాటులోకి ఉన్నట్లు ఆయన వివరించారు.



మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..