Ola Electric Event: మార్కెట్‌కు ఓలా ఎలక్ట్రిక్ కిక్.. కీలక ప్రాజెక్టుల ప్రకటన

ప్రపంచవ్యాప్తంగా ఆటో మొబైల్ ఇండస్ట్రీ ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల బాట పట్టింది. అన్ని కంపెనీలు ఈవీ మోడల్స్ రిలీజ్ చేస్తున్నాయంటే వీటి డిమాండ్ ఎలా ఉందో? అర్థం చేస్తుకోవచ్చు. తాజాగా ప్రముఖ ఈవీ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ తన వార్షిక ఈవెంట్ నిర్వహించింది. సంకల్ప్ పేరుతో చేసిన ఈ ఈవెంట్ ఆగస్టు 15న నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో ఓలా కంపెనీ త్వరలో రిలీజ్ చేయబోయే ఈవీ స్కూటర్లు, బైక్‌ల గురించి కీలక ప్రకటన చేసింది.

Ola Electric Event: మార్కెట్‌కు ఓలా ఎలక్ట్రిక్ కిక్.. కీలక ప్రాజెక్టుల ప్రకటన
Ola Electric

Updated on: Aug 18, 2024 | 4:15 PM

ప్రపంచవ్యాప్తంగా ఆటో మొబైల్ ఇండస్ట్రీ ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల బాట పట్టింది. అన్ని కంపెనీలు ఈవీ మోడల్స్ రిలీజ్ చేస్తున్నాయంటే వీటి డిమాండ్ ఎలా ఉందో? అర్థం చేస్తుకోవచ్చు. తాజాగా ప్రముఖ ఈవీ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ తన వార్షిక ఈవెంట్ నిర్వహించింది. సంకల్ప్ పేరుతో చేసిన ఈ ఈవెంట్ ఆగస్టు 15న నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో ఓలా కంపెనీ త్వరలో రిలీజ్ చేయబోయే ఈవీ స్కూటర్లు, బైక్‌ల గురించి కీలక ప్రకటన చేసింది. ఓలా కంపెనీ త్వరలో సంకల్ప్ 2024 పేరుతో ప్రీమియం స్కూటర్ల లాంచ్ చేయాలని ఆలోచిస్తున్నట్లు పేర్కొంది. స్పోర్టీ బైక్‌తో పాటు టూరర్, అడ్వెంచర్ మోడల్ సహా ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్‌లను రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఓలా భవిష్యత్ ప్లాన్‌ల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

ఓలా ఎస్-1 సక్సెసర్ కింద ఎస్2, ఎస్3 మోడల్స్ రిలీజ్ చేయనుందని కంపెనీ ప్రతినిదులు చెబుతున్నారు. అలాగే ఓలా ఎస్1 స్పోర్ట్స్ పేరుతో మరో కొత్త బైక్‌ను కూడా రిలీజ్ చేసే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ఓలా కంపెనీ ఎస్ 1 ఎలక్ట్రిక్ స్కూటర్ కొత్త టాప్-ఆఫ్-లైన్ వెర్షన్ కింద ఈ బైక్ రిలీజ్ చేస్తుందని చెబుతున్నారు. మైలేజ్ ఇతర ఫీచర్లు ఎస్1తోనే సమానంగానే ఉన్న ఈ బైక్ ధర మాత్రం సుమారు రూ.1.50 లక్షల (ఎక్స్-షోరూమ్) ఉండే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అలాగే ఓలా ఎస్2 సిటీ, టూరర్, స్పోర్ట్స్ అనే మూడు వేరియంట్లతో మరిన్ని ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్స్‌ను భవిష్యత్‌లో లాంచ్ చేస్తున్నట్లు ఓలా ప్రతినిధులు చెబుతున్నారు. టూరర్, స్పోర్ట్స్ మోడళ్ల కోసం మ్యాక్సీ వేరియంట్ స్కూటర్‌ను రిలీజ్ చేసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఓలా ఎస్ 2 సిటీ ఎస్1 వేరియంట్ కంటే కొంచెం పెద్దదిగా ఉండనుంది. 

అలాగే ఓలా ఎస్3 పేరుతో ప్రకటించిన ఎలక్ట్రిక్ స్కూటర్లు ప్రీమియం వెర్షన్‌గా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. గ్రాండ్ అడ్వెంచర్, గ్రాండ్ టూరర్ వేరియంట్‌లో వచ్చే ఈ బైక్స్ బీఎండబ్ల్యూ సీ 400 జీటీ తరహాలో మ్యాక్సీ డిజైన్‌లో అందుబాటులో ఉండనున్నాయి. ఓలా ఎస్-3 వేరియంట్స్ స్కూటర్లు, బైక్ జెన్ 3 ప్లాట్ ఫారమ్ ఆధారంగా పని చేస్తాయి. అయితే ఫీచర్లకు అనుగుణంగా ఎస్-2, ఎస్-3 వేరియంట్స్ ధరలు అధికంగా ఉంటాయని నిపుణుుల చెబుతున్నారు. ఓలా ఎలక్ట్రిక్ ఈ ఈవెంట్లో రోడ్లర్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ సిరీస్‌ను కూడా ప్రకటించింది. అలాగే ఓలా ఎలక్ట్రిక్ కొత్త ఎస్-2, ఎస్-3 ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేయడానికి టైమ్ లైన్ ను వెల్లడించలేదు. అయితే ఓలా ఇప్పటికే ఎలక్ట్రిక్ కారు ప్లాన్లను సైలెంట్‌గా పక్కనే పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..