Tresa Ev Truck: ఇక రవాణా వాహనాల వంతు.. సరికొత్త ఈవీ ట్రక్ రిలీజ్ చేసిన ట్రెసా
వ్యక్తిగత వాహనాలు మినహా ఏ కంపెనీలు ఇప్పటివరకూ రవాణా వాహనాలను రిలీజ్ చేయలేదు. తాజాగా ఎలక్ట్రిక్ మొబిలిటీ కంపెనీ ట్రెసా మోటార్స్ మేడ్ ఇన్ ఇండియా ఎలక్ట్రిక్ ట్రక్ వీ0.2ని ఆవిష్కరించింది . ఇటీవల కంపెనీ ఆవిష్కరించిన ఈ ఎలక్ట్రిక్ ట్రక్కులో సెంట్రలైజ్డ్ కంప్యూటింగ్ యూనిట్, అడ్వాన్స్డ్ అంతర్గత బీఎంఎస్, డీఆర్ఎల్‌లు 8000 మాడ్యులర్ బ్యాటరీ ప్యాక్‌లు ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా ఈవీ వాహనాలు అత్యంత ప్రజాదరణ పొందుతున్నాయి. ఈ నేపథ్యంలో పెరుగుతున్న పెట్రోల్ ధరల దెబ్బకు అందరూ ఈవీ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. అయితే వ్యక్తిగత వాహనాలు మినహా ఏ కంపెనీలు ఇప్పటివరకూ రవాణా వాహనాలను రిలీజ్ చేయలేదు. తాజాగా ఎలక్ట్రిక్ మొబిలిటీ కంపెనీ ట్రెసా మోటార్స్ మేడ్ ఇన్ ఇండియా ఎలక్ట్రిక్ ట్రక్ వీ0.2ని ఆవిష్కరించింది . ఇటీవల కంపెనీ ఆవిష్కరించిన ఈ ఎలక్ట్రిక్ ట్రక్కులో సెంట్రలైజ్డ్ కంప్యూటింగ్ యూనిట్, అడ్వాన్స్డ్ అంతర్గత బీఎంఎస్, డీఆర్ఎల్‌లు 8000 మాడ్యులర్ బ్యాటరీ ప్యాక్‌లు ఉన్నాయి. ముఖ్యంగా ఈ ట్రక్ టెలిమెట్రీ సిస్టమ్ ఆధారంగా పని చేస్తుంది. ఈ నేపథ్యంలో ట్రెసా ఈవీ ట్రక్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం
భారతదేశంలో ట్రెసా మోటార్స్ వీ0.2 ఎలక్ట్రిక్ ట్రక్ ముఖ్యంగా భారతీయ రోడ్లపై మన్నిక, పనితీరు కోసం రూపొందించామని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ ట్రక్ సాంప్రదాయ డీజిల్ ట్రక్కుల కంటే తక్కవ ధరకు అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా వేగవంతమైన ఛార్జింగ్ సామర్థ్యం ఈ ట్రక్ ప్రత్యేకత. క్యాబిన్‌తో సహా ఈ ట్రక్కుకు సంబంధించిన అన్ని శీతలీకరణ అవసరాలను తీర్చడానికి ఇది ప్రత్యేకమైన హీట్ పంపు కూడా కలిగి ఉంది. యాక్సియల్ ఫ్లక్స్ మోటర్ ప్లాట్‌ఫారమ్ ఫ్లక్స్ 350, ఎంఈజీ 50 బ్యాటరీ మాడ్యూల్ వంటి సంస్థ యొక్క వినూత్న సాంకేతిక ప్లాట్‌ఫారమ్‌లపై నిర్మించారు. ఎలక్ట్రిక్ వాహనాలు సంక్లిష్టమైన యంత్రాలు, వాటిలో కొన్ని వాటి ఉప-వ్యవస్థలను నియంత్రించడానికి 100ల ఈసీయూను కూడా కలిగి ఉంటాయి. వీ0.2లో ఈ ఈసీయూల మెరుగైన నిర్వహణ కోసం కంపెనీ జోనల్ ఆర్కిటెక్చర్‌తో నివిడా జీపీయూ ఆధారిత సెంట్రలైజ్డ్ కంప్యూటింగ్ యూనిట్ (సీసీయూ)ని ఉపయోగించింది. ఇక్కడ టెలిమాటిక్స్, ఏఐ, నియంత్రణ అవసరాలను తీర్చడానికి సీసీయూ ఎక్కువ భారాన్ని తీసుకుంటుంది.
ట్రెసా వీ0.2 300 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇది చక్రాల వద్ద 24,000 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 60 నుంచి 120 కిలోమీటర్లు ఉంటుంది. ఈ ట్రక్ వేగవంతమైన ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఈ ఎలక్ట్రిక్ ట్రక్కును కేవలం 20 నిమిషాల్లో 10 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. ఇది సెంట్రల్ స్టీరింగ్ సెటప్‌తో పాటు ఎయిర్ సస్పెండెడ్ సీట్లతో వస్తుంది. ఈ రిలీజ్‌పై ట్రెసా మోటార్స్ వ్యవస్థాపక సీఈఓ రోహన్ శ్రవణ్ మాట్లాడుతూ మోడల్ వీ0.2 లాంచ్ ప్రకటించినందుకు మేము సంతోషిస్తున్నామని పేర్కొన్నారు. ముఖ్యంగా ఈవీ మార్కెట్‌లో తమ మార్క్ చూపడమే లక్ష్యమని వివరించారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




