RBI: రూ.500 నోట్ల రద్దుపై ఆర్బీఐ గవర్నర్ కీలక ప్రకటన..! ఏమన్నారంటే..

| Edited By: Basha Shek

Jun 09, 2023 | 12:33 AM

నోట్ల ఉపసంహరణ, కొత్త నోట్ల ముద్రణపై రిజర్వు బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ గురువారం (జూన్‌ 8) కీలక వ్యాఖ్యలు చేశారు. రూ.500 నోట్ల ఉపసంహరించుకునే ఆలోచన లేదని స్పష్టం చేశారు. అలాంటి వదంతులు నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు..

RBI: రూ.500 నోట్ల రద్దుపై ఆర్బీఐ గవర్నర్ కీలక ప్రకటన..! ఏమన్నారంటే..
RBI Governor Shaktikanta Das
Follow us on

నోట్ల ఉపసంహరణ, కొత్త నోట్ల ముద్రణపై రిజర్వు బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ గురువారం (జూన్‌ 8) కీలక వ్యాఖ్యలు చేశారు. రూ.500 నోట్ల ఉపసంహరించుకునే ఆలోచన లేదని స్పష్టం చేశారు. అలాంటి వదంతులు నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలాగే రూ.1000 నోట్లను తిరిగి ప్రవేశపెట్టబోమని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు.2024 ఆర్థిక సంవత్సరం కోసం రెండో ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ఆవిష్కరించిన తర్వాత దాస్ ఈ మేరకు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా 2 వేల నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకున్న నేపథ్యంలో ఆర్‌బీఐ గవర్నర్‌ మాట్లాడుతూ..

రూ.500 నోట్ల ఉపసంహరణ, రూ.1000 నోట్లను తిరిగి ప్రవేశపెట్టడం గురించి ఆర్బీఐ ఎటువంటి ప్రకటన చేయలేదు. అటువంటి ఆలోచించన కూడా చేయడం లేదు. మొత్తం రూ.3.62 లక్షల కోట్ల రూ.2000 నోట్లు చలామణిలో ఉన్నాయి. వీటిల్లో దాదాపు రూ.1.82 లక్షల కోట్లు (50 శాతం) వెనక్కి వచ్చాయన్నారు. 85 శాతం నోట్లు డిపాజిట్ల రూపంలో తిరిగి వచ్చాయి. మిగిలినవి మార్పిడికి రావల్సి ఉందని దాస్ తెలిపారు.కాగా మే 19న ఆర్బీఐ చలామణి నుంచి రూ. 2,000 కరెన్సీ నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది సెప్టెంబరు 30 వరకు రూ. 2 వేల నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవచ్చని ఆర్బీఐ సూచించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.