AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI కొత్త రూల్స్‌.. ఇకపై క్రెడిట్‌ కార్డ్స్‌ను అలా ఉపయోగించడం కుదరదు!

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సెప్టెంబర్ 15, 2025 నుండి క్రెడిట్ కార్డులతో అద్దె చెల్లింపులను నిషేధించింది. KYC నిబంధనల ఉల్లంఘనలు, పెరుగుతున్న మోసాలను నియంత్రించడం కోసం ఈ నిర్ణయం తీసుకుంది. ఫోన్‌పే, పేటీఎం వంటి ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్‌లు ఈ సదుపాయాన్ని నిలిపివేస్తున్నాయి.

RBI కొత్త రూల్స్‌.. ఇకపై క్రెడిట్‌ కార్డ్స్‌ను అలా ఉపయోగించడం కుదరదు!
నమ్మకమైన సైట్ల నుండి మాత్రమే షాపింగ్ చేయండి: ఎల్లప్పుడూ విశ్వసనీయ సైట్ల నుండి మాత్రమే షాపింగ్ చేయాలని గుర్తించుకోండి. ఈరోజుల్లో సైబర్ మోసగాళ్లు కూడా ఇలాంటి పేర్లతో ఉన్న సైట్ల ద్వారా ప్రజలను మభ్యపెడుతున్నారు. అటువంటి పరిస్థితిలో మీరు నిజమైన వెబ్‌సైట్ నుండి షాపింగ్ చేస్తున్నారని ఎల్లప్పుడూ నిర్ధారించుకోండి.
SN Pasha
|

Updated on: Sep 19, 2025 | 6:30 AM

Share

మీరు ఇకపై మీ క్రెడిట్ కార్డ్‌తో అద్దె చెల్లించలేరు. ఫోన్‌ పే, పేటీఎం, క్రెడ్‌, అమెజాన్‌ పే వంటి ప్రధాన ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్‌లు ఈ ఫీచర్‌ను నిలిపివేశాయి. అద్దె చెల్లింపులలో సౌలభ్యం, రివార్డ్ పాయింట్లు, క్యాష్‌బ్యాక్ వంటి ప్రయోజనాలను అందించినందున ఈ ఫీచర్‌ను చాలా మంది గత కొన్ని ఏళ్లుగా ఉపగియోస్తున్నారు. అయితే RBI ఇప్పుడు సెప్టెంబర్ 15, 2025 నుండి అమలులోకి వచ్చే కొత్త నియమాలను జారీ చేసింది, ఇది ఈ ఫీచర్‌ను నిలిపివేసింది.

కొత్త RBI నిబంధనల ప్రకారం.. చెల్లింపు అగ్రిగేటర్‌గా పనిచేసే కంపెనీ ప్రత్యక్ష ఒప్పందాలు కలిగి ఉన్న వ్యాపారులకు మాత్రమే డబ్బును ప్రాసెస్ చేయగలదు. ఈ జాబితాలో ఇంటి యజమానులను చేర్చలేదు. కాబట్టి ఫిన్‌టెక్ కంపెనీలు ఇకపై క్రెడిట్ కార్డ్ అద్దెను ఇంటి యజమానులకు బదిలీ చేయలేవు.

ఈ నిర్ణయం వెనుక KYC నిబంధనల ఉల్లంఘనలు, పెరుగుతున్న మోసాలు కారణమని RBI పేర్కొంది. క్రెడిట్ కార్డ్ అద్దె చెల్లింపులలో తరచుగా సరైన ధృవీకరణ లేదని ఆర్బీఐ గుర్తించింది. కొంతమంది అద్దె ముసుగులో దగ్గరి బంధువుల ఖాతాలకు డబ్బును బదిలీ చేసి, ఆపై దానిని చట్టవిరుద్ధమైన ప్రయోజనాల కోసం ఉపయోగించారు. తత్ఫలితంగా సరైన ధృవీకరణ లేకుండా ఇకపై అటువంటి లావాదేవీలు నిర్వహించలేమని RBI నిర్ణయించింది. అందువల్ల క్రెడిట్ కార్డులను ఉపయోగించి అద్దె చెల్లింపులను నిషేధించారు.

కొన్ని ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్‌లు గతంలోనే అంటే మార్చి 2024లో క్రెడిట్ కార్డులను ఉపయోగించి అద్దె చెల్లింపుల సౌకర్యాన్ని నిలిపివేశాయి. ఇప్పుడు RBI కొత్త నిబంధనలను అనుసరించి, క్రెడిట్‌తో సహా ఇతర ఫిన్‌టెక్ కంపెనీలు సెప్టెంబర్ 2025లో ఈ ఫీచర్‌ను పూర్తిగా నిలిపివేశాయి. క్రెడిట్ కార్డులను ఉపయోగించి అద్దె చెల్లించే ఎంపిక ఇకపై అందుబాటులో ఉండదు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి