AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Traffic Rules: వాహనదారులకు షాక్.. కొత్త ట్రాఫిక్‌ రూల్స్‌.. ఈ తప్పు చేస్తే రూ.25 వేల జరిమానా..?

New Traffic Rules: ఇప్పుడు ప్రభుత్వం నిబంధనలను మరింత కఠినతరం చేసింది. 2025 నుండి దేశవ్యాప్తంగా కొత్త ట్రాఫిక్ చలాన్ నియమాలు అమల్లోకి వచ్చాయి. వీటిలో చాలా పాత నియమాలు మరింత కఠినతరం అయ్యాయి. ఇప్పుడు రోడ్డుపై డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అలాంటి..

New Traffic Rules: వాహనదారులకు షాక్.. కొత్త ట్రాఫిక్‌ రూల్స్‌.. ఈ తప్పు చేస్తే రూ.25 వేల జరిమానా..?
Subhash Goud
|

Updated on: Jun 12, 2025 | 10:54 AM

Share

భారతదేశంలో ప్రతి సంవత్సరం వేలాది మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ప్రమాదాలకు అతిపెద్ద కారణం ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించడమే. ప్రజలు అతివేగంతో నడపడం, వాహనం నడుపుతున్నప్పుడు మొబైల్ వాడటం, హెల్మెట్ ధరించకపోవడం లేదా మద్యం సేవించి వాహనం నడపడం వంటి తప్పులు చేస్తారు. వీటిపై ప్రభుత్వం భారీ జరిమానాలు విధిస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం నిబంధనలను మరింత కఠినతరం చేసింది. 2025 నుండి దేశవ్యాప్తంగా కొత్త ట్రాఫిక్ చలాన్ నియమాలు అమల్లోకి వచ్చాయి. వీటిలో చాలా పాత నియమాలు మరింత కఠినతరం అయ్యాయి. ఇప్పుడు రోడ్డుపై డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అలాంటి తప్పు చేయడం వల్ల మీకు భారీగా నష్టం వాటిల్లుతుంది.

తాగి వాహనం నడపడం ఖరీదైనది:

కొత్త నిబంధనల ప్రకారం.. మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడితే, మొదటిసారి రూ.10,000 జరిమానా లేదా 6 నెలల జైలు శిక్ష విధించవచ్చు. అదే వ్యక్తి మళ్ళీ అదే తప్పు చేస్తే జరిమానా రూ.15,000 వరకు ఉండవచ్చు. జైలు శిక్ష 2 సంవత్సరాల వరకు పెరగవచ్చు.

ఇప్పుడు రెడ్ లైట్ దాటితే రూ. 5000 జరిమానా:

మీరు సిగ్నల్‌ను క్రాస్‌ చేసినట్లయితే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అందుకు మీరు రూ. 5,000 చలాన్ చెల్లించాల్సి ఉంటుంది. గతంలో ఈ జరిమానా రూ. 500 మాత్రమే.

ఇవి కూడా చదవండి

అతి వేగంగా నడిపితే.. అదనపు లగేజీని తీసుకెళ్తే భారీ జరిమానాలు:

నిర్దేశించిన వేగం కంటే వేగంగా వాహనం నడిపితే రూ.5,000 వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అదే సమయంలో ట్రక్కు లేదా వాణిజ్య వాహనం నిర్దేశించిన పరిమితి కంటే ఎక్కువ వస్తువులను తీసుకువెళితే రూ.20,000 కంటే ఎక్కువ జరిమానా విధించబడుతుంది.

డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే..

ఇప్పుడు మీరు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతూ పట్టుబడితే మీరు రూ. 5,000 జరిమానా చెల్లించాలి. అయితే మీకు డిజిలాకర్ లేదా ఎంపరివాహన్ యాప్‌లో చెల్లుబాటు అయ్యే డీఎల్ ఉన్న సరిపోతుంది.

పొల్యూషన్‌ సర్టిఫికేట్‌ లేకుంటే జరిమానా:

వాహనం నుంచి వచ్చే పొగను నియంత్రించడానికి పియుసి సర్టిఫికేట్ తప్పనిసరి. మీ దగ్గర అది లేకపోతే, మీకు రూ. 10,000 జరిమానా, 6 నెలల జైలు శిక్ష విధించవచ్చు. దీనితో పాటు సమాజ సేవను కూడా ఆదేశించవచ్చు.

సీట్ బెల్ట్ పెట్టుకోనందుకు చలాన్:

ఇప్పుడు డ్రైవర్ మాత్రమే కాదు, కారులోని ప్రయాణికులందరూ సీట్ బెల్ట్ ధరించడం తప్పనిసరి. ముందు కూర్చున్నా, వెనుక కూర్చున్నా, సీట్ బెల్ట్ ధరించకపోతే రూ.1,000 జరిమానా విధించబడుతుంది.

బైక్‌పై ముగ్గురు ప్రయాణించినా జరిమానా:

ద్విచక్ర వాహనంపై ముగ్గురు వ్యక్తులు కూర్చుని ఉన్నట్లు తేలితే, వెయ్యి రూపాయల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

హెల్మెట్ లేకుండా బైక్ నడిపినా..

గతంలో హెల్మెట్ ధరించకపోతే రూ.100 జరిమానా ఉండేది. ఇప్పుడు దానిని రూ.1,000కి పెంచారు. అలాగే, డ్రైవర్ డ్రైవింగ్ లైసెన్స్‌ను కూడా 3 నెలల పాటు సస్పెండ్ చేయవచ్చు.

మైనర్ వాహనం నడిపితే కఠిన శిక్ష:

మైనర్ వాహనం నడుపుతూ పట్టుబడితే, అతని తల్లిదండ్రులు లేదా సంరక్షకులకు రూ.25,000 జరిమానా, 3 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారు. దీనితో పాటు ఆ వాహనం రిజిస్ట్రేషన్ 1 సంవత్సరం పాటు రద్దు చేస్తారు. ఆ మైనర్‌కు 25 సంవత్సరాల వయస్సు వచ్చేలోపు డ్రైవింగ్ లైసెన్స్ లభించదు.

మొబైల్ వాడకంపై కఠినతరం:

డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ ఉపయోగించడం ఇప్పుడు మరింత తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. దీని వలన రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు చాలా రెట్లు పెరుగుతాయి. అందుకే దీనికి రూ.5,000 వరకు జరిమానా విధించవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..