AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Placements: ఐఐటీ విద్యార్థులకు కొత్త కష్టం..జాయినింగ్ రోజునే ప్లేస్‌మెంట్ ఆఫర్ రిజెక్ట్..!

ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థులకు ప్లేస్‌మెంట్ ఆఫర్ అంటే ఎంతో గొప్ప విషయం. చదువు పూర్తికాక ముందే ఉద్యోగం పొందడం వారికి చాలా ఆనందాన్ని ఇస్తుంది. అయితే జాయినింగ్ తేదీనే ఆ ప్లేస్‌మెంట్ ఆఫర్ రివోక్ చేస్తున్నారని ముంబై ఐఐటీ విద్యార్థులు వాపోతున్నారు. ఉద్యోగం వచ్చిందనే ఆనందం లేకుండా పోతుందని బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్లేస్‌మెంట్స్ విషయంలో జరుగుతున్న అన్యాయం గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

Placements: ఐఐటీ విద్యార్థులకు కొత్త కష్టం..జాయినింగ్ రోజునే ప్లేస్‌మెంట్ ఆఫర్ రిజెక్ట్..!
Placements
Nikhil
|

Updated on: Jun 12, 2025 | 10:35 AM

Share

కొత్త ఉద్యోగ ఆఫర్లను స్వీకరించడం అనేది ఇంజినీరింగ్ విద్యార్థులకు కలగా ఉంటుంది. ఆఫర్ రాగానే తమ లైఫ్ సెట్ అయిపోయినట్లే అని భావిస్తూ ఉంటారు. ఫ్యామిలీతో పాటు ఫ్రెండ్స్‌కు ఈ విషయాన్ని చెప్పి ఆనందపడుతూ ఉంటారు. అయితే జాయినింగ్ రోజునే సారీ మీ ఆఫర్ రిజెక్ట్ చేశామని మెసేజ్ వస్తే ఆ విద్యార్థి పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పటికే విషయాన్ని అందరికీ చెప్పిన తాను నలుగురిలో తల ఎలా ఎత్తుకోవాలో? అనే అవమాన భారంతో చాలా మంది కుమిలి పోతున్నారు. ఈ విషయాన్ని పక్కనపెడితే ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారు మంచి భవిష్యత్ కోసం వన్ మంత్ నోటీస్ ఇచ్చి కొత్త ఉద్యోగంలో చేరుదామనుకుంటే ఈ రివోక్ లెటర్ మానసికంగా కుంగదిస్తుంది. 

ఐఐటీ బాంబే విద్యార్థి ప్రసాద్ చౌరే అనే విద్యార్థికి ఇలాంటి కష్టమే వచ్చింది. గత సంవత్సరం డిసెంబర్‌లో, క్యాంపస్ ప్లేస్‌మెంట్ సమయంలో చౌరేకు బిజినెస్ అనలిస్ట్‌గా ఆఫర్ వచ్చింది. అతని ఆన్‌బోర్డింగ్ పత్రాలను సేకరించిన కంపెనీ నుంచి అధికారిక ఆఫర్ లెటర్‌ను పొందడమే కాకుండా డ్యూయల్ ఎంప్లాయిమెంట్‌ను నిషేధిస్తూ ఒక ప్రకటనపై సంతకం చేశాడు. జూన్ 2న చేరడానికి కొన్ని రోజుల ముందు చౌరే తన ఆన్‌బోర్డింగ్ వాయిదా గురించి సందేశం అందుకున్నాడు. చేంజ్ ఇన్ రిక్వైర్‌మెంట్స్ ఫర్ ఫ్యూచర్ బిజినెస్ అని మెన్షన్ చేస్తూ అతడికి మెయిల్ వచ్చింది. దీంతో కంగుతినడం అతని వంతు అయ్యింది. కలల ఉద్యోగం గురించి అందరికీ చెప్పానని చివరకు ఇలా అయ్యిందని వాపోయాడు. 

తోటి లింక్డ్ఇన్ వినియోగదారులు కామెంట్స్‌లో విభాగానికి వెళ్లి చౌరేకు మద్దతు తెలిపారు. మరికొందరు చివరి క్షణంలో ఇలాంటి రద్దులు ఎలా సాధారణ పద్ధతిగా మారాయో? అని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో కంపెనీ ఆఫర్లను రద్దు చేయడం అనేది ఒక సాధారణ ధోరణిగా మారుతోంది. అయితే చేసేదేమి లేదని భవిష్యత్‌పై ఆశావాద దృక్పథాన్ని కొనసాగిస్తూ, ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన సూచనలను అందించమని అభ్యర్థిస్తూ ప్రసాద్ చౌరా తన పోస్ట్‌ను ముగించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి