AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Mallya: విజయ్ మాల్యాకు వివిధ దేశాలలో ఎలాంటి ఆస్తులు ఉన్నాయి? వాటి విలువ ఎంత?

Vijay Mallya: 28 సంవత్సరాల వయసులో మాల్యా యునైటెడ్ బ్రూవరీస్ గ్రూప్ చైర్మన్ అయ్యాడు. తన వ్యాపారాన్ని మద్యం, విమానయాన సంస్థలు, రియల్ ఎస్టేట్, క్రీడలలో పెట్టుబడి పెట్టాడు. దీని ద్వారా అతను తన బ్రాండ్ విలువను పెద్ద ఎత్తున పెంచుకున్నాడు. ఫార్ములా 1లో స్పాన్సర్‌షిప్..

Vijay Mallya: విజయ్ మాల్యాకు వివిధ దేశాలలో ఎలాంటి ఆస్తులు ఉన్నాయి? వాటి విలువ ఎంత?
Subhash Goud
|

Updated on: Jun 12, 2025 | 8:04 AM

Share

భారతదేశంలో కేసులు ఎదుర్కొంటున్న సమయంలో దేశం విడిచి పారిపోయిన వ్యక్తులలో విజయ్ మాల్యా ఒకరు. ఆయన ఒక తెలివైన వ్యాపారవేత్త, క్రీడాభిమాని. రాజకీయ అనుభవజ్ఞుడు. కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ మూసివేత తర్వాత మాల్యా దురదృష్టం ప్రారంభమైంది. ఆర్థిక అవకతవకలు, రుణాలు తిరిగి చెల్లించకపోవడం వంటి కొన్ని తీవ్రమైన ఆరోపణలను ఆయన ఎదుర్కొన్నారు. 2016లో దేశం విడిచి వెళ్లిన వ్యక్తి తిరిగి రాలేదు.

విజయ్ మాల్యా చెప్పిన దాని ప్రకారం, బ్యాంకుల నుండి అతను పొందిన రుణాలు రూ.4,000 కోట్ల కంటే కొంచెం ఎక్కువగా ఉండవచ్చు. వడ్డీ అంతా కలిపితే రూ.6,203 కోట్లు అవుతుంది. అయితే ప్రభుత్వం అతని ఆస్తులను స్వాధీనం చేసుకుని రూ.14,131.60 కోట్లు రికవరీ చేసినట్లు తెలుస్తోంది. అయితే తాను తీసుకున్న దానికంటే ఎక్కువ రికవరీ చేసినట్లు మాల్యా ఆరోపణ.

భారతదేశంలో విజయ్ మాల్యాకు చెందిన అనేక ఆస్తులను ED, CBI, బ్యాంకులు జప్తు చేశాయి. అయితే, విజయ్ మాల్యాకు ఇప్పటికీ అపారమైన ఆస్తులు ఉన్నాయి. విజయ్ మాల్యాకు భారతదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా వ్యాపారాలు ఉన్నాయి.

ఫోర్బ్స్ ది ఇండిపెండెంట్ (UK) ప్రకారం.. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు IPL జట్టు మాజీ యజమాని విజయ్ మాల్యా నికర విలువ 2013లో $750 మిలియన్ల నుండి జూలై 2022 నాటికి $1.2 బిలియన్లకు పెరిగింది. అయితే, అతని ఎయిర్‌లైన్ సామ్రాజ్యం ఆర్థిక పతనం, చట్టపరమైన సవాళ్లు మాల్యాను తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టాయి.

28 సంవత్సరాల వయసులో మాల్యా యునైటెడ్ బ్రూవరీస్ గ్రూప్ చైర్మన్ అయ్యాడు. తన వ్యాపారాన్ని మద్యం, విమానయాన సంస్థలు, రియల్ ఎస్టేట్, క్రీడలలో పెట్టుబడి పెట్టాడు. దీని ద్వారా అతను తన బ్రాండ్ విలువను పెద్ద ఎత్తున పెంచుకున్నాడు. ఫార్ములా 1లో స్పాన్సర్‌షిప్ ఒప్పందాలతో అతను ఒక ప్రధాన వ్యాపారవేత్తగా ఎదిగాడు. అమెరికాలోని న్యూయార్క్‌లోని ట్రంప్ ప్లాజాలో విజయ్ మాల్యాకు ఒక పెంట్ హౌస్ ఉందని, దీనిని 2010లో $2.4 మిలియన్లకు కొనుగోలు చేశారని తెలుస్తోంది. దీనితో పాటు, అతను ఒకే భవనంలో మూడు లగ్జరీ కాండోలను కలిగి ఉన్నాడని మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. ఈ లగ్జరీ కాండోలలో రెండు తన కుమార్తెతో కలిసి కొనుగోలు చేశాడు. దీనికి తోడు, అతను ఫ్రాన్స్‌లోని లే గ్రాండే జార్డిన్ ఎస్టేట్‌ను కలిగి ఉన్నాడు, ఇది కేన్స్ సమీపంలోని సెయింట్-మార్గరైట్ ద్వీపంలో ఉంది.

విజయ్ మాల్యా ప్రస్తుతం కలిగి ఉన్న కొన్ని ఆస్తులు:

  • లండన్‌లోని 19వ శతాబ్దపు, చాలా ప్రతిష్టాత్మకమైన భవనం అయిన కార్న్‌వాల్ టెర్రస్‌లోని 18, 19 ప్లాట్లలో ఆస్తులు.
  • బ్రిటన్‌లోని హెర్ట్‌ఫోర్డ్‌షైర్‌లో లేడీవాక్ మాన్షన్.
  • ముంబైలోని నేపియన్ సీ రోడ్‌లోని ఒక బంగ్లా
  • బెంగళూరులోని కింగ్‌ఫిషర్ టవర్‌లోని ఒక పెంట్ హౌస్
  • అమెరికాలోని కాలిఫోర్నియాలో ఒక భవనం
  • అమెరికాలోని న్యూయార్క్‌లోని ట్రంప్ ప్లాజా పెంట్‌హౌస్
  • ఫ్రాన్స్‌లోని సెయింట్-మార్గరీట్ ద్వీపంలో లే గ్రాండ్ జార్డిన్ ఎస్టేట్

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి