Gold Price Today: మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. తులం ధర ఎంతో తెలుసా..?
Gold Price Today: బంగారం, వెండి ఆభరణాలను కొనుగోలు చేసేటప్పుడు, నాణ్యతపై శ్రద్ధ వహించడం ముఖ్యం. హాల్‌మార్క్‌ను తనిఖీ చేసిన తర్వాతే బంగారం కొనండి. హాల్‌మార్క్ చేసిన బంగారానికి ప్రభుత్వం హామీ ఇస్తుందని చెప్పవచ్చు. భారతదేశంలో హాల్‌మార్క్‌లను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్..

బంగారం ధరల్లో ప్రతి రోజు మార్పులు చోటు చేసుకుంటాయి. గత రెండు, మూడు రోజుల నుంచి తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు.. తాజాగా పెరిగాయి. నిన్నటికి ఇప్పటికి పోల్చుకుంటే తులం బంగారం ధరపై దాదాపు వెయ్యి రూపాయలకుపైగా పెరిగింది. బంగారానికి మన భారతీయ సాంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. బంగారం ధరలు పెరిగినా.. తగ్గినా కొనుగోళ్లు జరుగుతూనే ఉంటాయి. జూన్12వ తేదీన దేశీయంగా బంగారం ధరలు పెరిగాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 98,410 ఉండగా, అదే 22 క్యారెట్ల ధర రూ.90,210 వద్ద ట్రేడవుతోంది. ఇక దేశీయంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 98,560 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 90,360 రూపాయలు ఉంది. ఇక ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 98,410 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 90,210 రూపాయలు ఉంది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 98,410 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 90,210 రూపాయలు ఉంది. ఇక విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 98,410 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 90,210 రూపాయలు ఉంది.
ఇక బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 98,410 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 90,210 రూపాయలు ఉంది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 98,410 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 90,210 రూపాయలు ఉంది.
ఇక వెండి ధర విషయానికొస్తే..కిలో వెండిపై స్వల్పంగా అంటే వంద రూపాయల వరకు తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.1,08,900 ఉంది.
బంగారం స్వచ్ఛతను గుర్తించడానికి అంతర్జాతీయ ప్రామాణీకరణ సంస్థలు హాల్ మార్కులను ఇస్తాయి. 24 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 999 అని, 23 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 958 అని, 22 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 916 అని, 21 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 875 అని, 18 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 750 అని రాసి ఉంటుంది. చాలా వరకు బంగారం 22 క్యారెట్లలో అమ్ముడవుతుండగా, కొంతమంది 18 క్యారెట్లను కూడా ఉపయోగిస్తారు. క్యారెట్ 24 మించకూడదు. అలాగే క్యారెట్ ఎంత ఎక్కువగా ఉంటే బంగారం అంత స్వచ్ఛంగా ఉంటుంది.
బంగారం కొనేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు:
బంగారం, వెండి ఆభరణాలను కొనుగోలు చేసేటప్పుడు, నాణ్యతపై శ్రద్ధ వహించడం ముఖ్యం. హాల్‌మార్క్‌ను తనిఖీ చేసిన తర్వాతే బంగారం కొనండి. హాల్‌మార్క్ చేసిన బంగారానికి ప్రభుత్వం హామీ ఇస్తుందని చెప్పవచ్చు. భారతదేశంలో హాల్‌మార్క్‌లను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) జారీ చేస్తుంది. వేర్వేరు క్యారెట్లు వేర్వేరు హాల్ మార్క్ సంఖ్యలను కలిగి ఉంటాయి. మీరు దాన్ని చూసి బంగారం కొనవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




