AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPI Lite X: ఆఫ్‌లైన్‌ మనీ ట్రాన్స్‌ఫర్‌ విషయంలో నయా సంచలనం… యూపీఐ లైట్‌ ఎక్స్‌తోనే సాధ్యం

యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) నిధులను బదిలీ చేయడంలో సౌలభ్యం కోసం భారతదేశంలో విపరీతమైన ప్రజాదరణను పొందుతుంది. యూపీఐ రాకతో డబ్బు పంపడం అంటే బ్యాంకును సందర్శించడం అనే రోజులు పోయాయి. ఇప్పుడు ఫోన్‌పే, జీపే, పేటీఎం వంటి యూపీఐ యాప్‌ల ద్వారా కేవలం ఒక క్లిక్‌తో నగదు బదిలీ సాధ్యం అవుతుంది. అయితే ఈ చెల్లింపులకు కచ్చితంగా ఇంటర్నెట్‌ అవసరం అవుతుంది. కానీ ప్రస్తుతం ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా కూడా వ్యక్తులు యూపీఐ ద్వారా డబ్బును సజావుగా బదిలీ చేయవచ్చు.

UPI Lite X: ఆఫ్‌లైన్‌ మనీ ట్రాన్స్‌ఫర్‌ విషయంలో నయా సంచలనం… యూపీఐ లైట్‌ ఎక్స్‌తోనే సాధ్యం
Upi
Nikhil
| Edited By: |

Updated on: Oct 04, 2023 | 9:32 PM

Share

భారతదేశంలో నోట్ల రద్దు తర్వాత డిజిటల్‌ లావాదేవీలను పెంచడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలను తీసుకుంది. ముఖ్యంగా ఎన్‌పీసీఐ సాయంతో తీసుకొచ్చిన యూపీఐ లావాదేవీలు నగదు చెల్లింపుల విషయంలో విప్లవాత్మక​ మార్పులు తీసుకువచ్చాయి. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) నిధులను బదిలీ చేయడంలో సౌలభ్యం కోసం భారతదేశంలో విపరీతమైన ప్రజాదరణను పొందుతుంది. యూపీఐ రాకతో డబ్బు పంపడం అంటే బ్యాంకును సందర్శించడం అనే రోజులు పోయాయి. ఇప్పుడు ఫోన్‌పే, జీపే, పేటీఎం వంటి యూపీఐ యాప్‌ల ద్వారా కేవలం ఒక క్లిక్‌తో నగదు బదిలీ సాధ్యం అవుతుంది. అయితే ఈ చెల్లింపులకు కచ్చితంగా ఇంటర్నెట్‌ అవసరం అవుతుంది. కానీ ప్రస్తుతం ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా కూడా వ్యక్తులు యూపీఐ ద్వారా డబ్బును సజావుగా బదిలీ చేయవచ్చు. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) వారి వినూత్న ఫీచర్ యూపీఐ లైట్‌ ఎక్స్‌తో సాధ్యం అవుతుంది. ఈ తాజా ఫీచర్‌ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

యూపీఐలో తాజా అద్భుతమైన ఫీచర్ గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ సందర్భంగా ఆవిష్కరించారు. ఈ ఫీచర్‌ నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్‌ఎఫ్‌సీ) మద్దతుతో పనిచేస్తుంది.  ఎన్‌ఎఫ్‌సీ సదుపాయం ఉన్న స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా యూపీఐ లైట్‌ ఎక్స్‌ చెల్లింపులు చేయవచ్చు. ముఖ్యంగా ఈ ఫీచర్‌ ద్వారా ఆఫ్‌లైన్ యూపీఐ చెల్లింపులను సులభంగా చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్‌ పరికరాలకు అనువుగా ఉంటుంది. యూపీఐ లైట్ ఎక్స్‌ వినియోగాన్ని ప్రారంభించడానికి, పంపినవారు, స్వీకరించేవారు ఇద్దరూ ఎన్‌ఎఫ్‌సీ మద్దతుతో కూడిన వారి ఆండ్రాయిడ్‌ పరికరాల్లో బీమ్‌ యాప్‌నకు తాజా వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేసి ఉండాలి. ఈ సెటప్ ప్రక్రియ సూటిగా ఉంటుంది.

యూపీఐ లైట్‌ ఎక్స్ యాక్టివేషన్‌ ఇలా

  • బీమ్‌ యాప్‌ని తెరిచి యూపీఐ లైట్ ఎక్స్‌ బ్యాలెన్స్ మెనుకి నావిగేట్ చేయాలి. అనంతరం ‘ఎనేబుల్’ బటన్‌పై నొక్కాలి.
  • టిక్ బాక్స్‌ను టోగుల్ చేసి ‘ఇప్పుడే ప్రారంభించు’ క్లిక్ చేయడం ద్వారా ఆఫ్‌లైన్ లావాదేవీలను సక్రియం చేయాలి.
  • మీ యూపీఐ లైట్ వాలెట్‌కు నిధులు సమకూర్చమని యాప్ మిమ్మల్ని అడుగుతుంది. కావలసిన మొత్తాన్ని ఇన్పుట్ చేయాలి.
  • యూపీఐ లైట్ ఎక్స్‌ని ప్రారంభించు అనే బటన్‌ను ఎంచుకోవాలి.
  • అనంతరం యూపీఐ పిన్‌ని నమోదు చేయాలి. 
  • మీ వాలెట్‌కు విజయవంతంగా నిధులను జోడించిన తర్వాత మీరు ఆఫ్‌లైన్ లావాదేవీల కోసం యూపీఐ లైట్‌ ఎక్స్‌ను ఉపయోగించడం ప్రారంభించవచ్చు.
  • యూపీఐ లైట్ చెల్లింపు లావాదేవీల గరిష్ట పరిమితి రూ. 200 అని నివేదికలు సూచిస్తున్నాయి. అయితే ఆన్-డివైస్ వాలెట్‌ల గరిష్ట యూపీఐ లైట్ బ్యాలెన్స్ ఏ సమయంలోనైనా రూ. 2,000కి పరిమితం చేశాయి.

అన్ని ప్రముఖ బ్యాంకులు సైతం

ఎనిమిది ప్రముఖ బ్యాంకులు యూపీఐ లైట్ ఎక‌్ష్‌ ఫీచర్‌ను స్వీకరించాయి, ఈ విప్లవాత్మక సేవకు ప్రాప్యతను విస్తరించాయి. కెనరా బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు యూపీఐ లైట్‌ ఎక్స్‌ సేవలను అందిస్తున్నాయి. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం