Vehicle Scrappage Policy: పాత వాహనాలు వాడుతున్న వారికి గుడ్ న్యూస్.. ఇకపై ఆ నిబంధన ఉండదు..

సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (ఎస్ఐఏఎం) వార్షిక సదస్సు ఇటీవల జరిగింది. ఈ సందర్బంగా రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి అనురాగ్ జైన్ పలు కీలక సూచనలు చేశారు. కాలుష్య తనిఖీల కార్యక్రమాన్ని మరింత మెరుగ్గా చేసే విషయంలో ప్రభుత్వానికి సహాయం చేయాలని ఆటోమొబైల్ పరిశ్రమ ప్రతినిధులను కోరారు.

Vehicle Scrappage Policy: పాత వాహనాలు వాడుతున్న వారికి గుడ్ న్యూస్.. ఇకపై ఆ నిబంధన ఉండదు..
Scrap Vehicles
Follow us

|

Updated on: Sep 12, 2024 | 4:49 PM

వాహనాల వినియోగం అనేది నేటి కాలంలో అందరికీ తప్పనిసరి. వివిధ పనులు, అవసరాల కోసం ప్రతి ఒక్కరూ వాటిని వినియోగిస్తారు. నిత్యం రోడ్లపై అనేక వాహనాలు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. అయితే వాహనాల రద్దీ పెరిగే కొద్దీ కాలుష్యం కూడా అదే స్థాయిలో ఎక్కువవుతుంది. పాత వాహనాలు కొనసాగుతూనే ఉండగానే వాటికి కొత్త వాహనాల జత అవుతున్నాయి. ఈ నేపథ్యంలో వాహనాలను స్క్రాప్ చేయడానికి ప్రభుత్వం కొత్త పాలసీని అమలు చేస్తుంది. గతంలో వాహనాల వయస్సు ప్రకారం స్క్రాప్ ను నిర్ణయించేవారు. ఇప్పుడు కాలుష్య స్థాయి ఆధారంగా నిర్ణయం తీసుకోనున్నారు.

ఎస్‌ఐఏఎం సదస్సు..

సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (ఎస్ఐఏఎం) వార్షిక సదస్సు ఇటీవల జరిగింది. ఈ సందర్బంగా రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి అనురాగ్ జైన్ పలు కీలక సూచనలు చేశారు. కాలుష్య తనిఖీల కార్యక్రమాన్ని మరింత మెరుగ్గా చేసే విషయంలో ప్రభుత్వానికి సహాయం చేయాలని ఆటోమొబైల్ పరిశ్రమ ప్రతినిధులను కోరారు. కాలుష్య స్థాయిల ఆధారంగా స్క్రాప్ నిబంధనలను తీసుకురానున్నారు. కాలుష్యాన్ని నియంత్రించి, పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది.

సమస్యలు లేకుండా..

వాహనాల వయస్సు 15 ఏళ్ల దాటిన తర్వాత స్క్రాప్‌ అనే విధానంలో కొన్నిసార్లు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. కొందరు తాము వాహనాలను సమర్థంగా నిర్వహిస్తున్నామని, వాటిలో ఎటువంటి ఇబ్బందులు లేవు కాబట్టి స్క్రాప్ చేయబోమని ప్రశ్నించవచ్చు. కొత్త పాలసీలో కాలుష్య స్థాయిని బట్టి ఆ నిర్ణయం తీసుకుంటారు.

అభినందనలు..

ప్రస్తుతం అమలవుతున్న స్క్రాపేజ్ విధానానికి ఆటోమోబైల్ పరిశ్రమ ప్రోత్సాహం అందిస్తోంది. పాత వాహనాలను స్క్రాప్ చేసి, కొత్త వాహనాలను కొనుగోలు చేస్తున్న వారికి రాయితీలు ప్రకటిస్తోంది. తద్వారా కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణకు సహాయ పడుతోంది. ఈ విషయంపై మంత్రి అభినందనలు తెలిపారు.

కాలుష్య నియంత్రణ..

వాహనాల వల్ల కలిగే కాలుష్యాన్ని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం వెహికల్ స్క్రాప్ పాలసీ ప్రవేశపెట్టింది. దీని ద్వారా దేశంలో 15 ఏళ్ల నాటి వాహనాలకు తుక్కుగా మార్చివేస్తారు. వాటిని వినియోగించరు. 15 ఏళ్ల క్రితం వాహనాల నుంచి కాలుష్యం ఎక్కువగా వెలువడుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై గతంలోనే నోటిఫికేషన్ విడుదల చేశారు. దానిలో ఆయా వాహనాల జాబితాను కూడా విడుదల చేశారు. పాత వాహనాలను స్క్రాప్ చేసిన తర్వాత వాటి నుంచి మెటల్, రబ్బరు, గాజు తదితర అనేక వస్తువులు లభిస్తాయి. వాటిని మళ్లీ కొత్త వాహనాల తయారీలో వినియోగించే అవకాశం ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పాత వాహనాలు వాడుతున్న వారికి గుడ్ న్యూస్.. ఇకపై ఆ నిబంధన ఉండదు..
పాత వాహనాలు వాడుతున్న వారికి గుడ్ న్యూస్.. ఇకపై ఆ నిబంధన ఉండదు..
బాహుబలి స్టంట్‌..నడుంలోతు వరదలో తలపై టూ వీలర్ పెట్టుకొని..
బాహుబలి స్టంట్‌..నడుంలోతు వరదలో తలపై టూ వీలర్ పెట్టుకొని..
సర్వేంద్రియానం నయనం ప్రధానం.. కంటి ఆరోగ్యానికి అద్భుతమైన ఫుడ్స్..
సర్వేంద్రియానం నయనం ప్రధానం.. కంటి ఆరోగ్యానికి అద్భుతమైన ఫుడ్స్..
ఉదయం లేవగానే ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? జాగ్రత్త..
ఉదయం లేవగానే ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? జాగ్రత్త..
పప్పులో కాలేసిన బ్యాటర్.. కట్ చేస్తే.. జట్టుకు భారీ మూల్యం
పప్పులో కాలేసిన బ్యాటర్.. కట్ చేస్తే.. జట్టుకు భారీ మూల్యం
మీకు నెయ్యి టీ గురించి తెలుసా.? తయారీ ఎలా, ఉపయోగాలు ఏంటంటే..
మీకు నెయ్యి టీ గురించి తెలుసా.? తయారీ ఎలా, ఉపయోగాలు ఏంటంటే..
ఈ టిప్స్‌తో వైరల్ ఫీవర్ల నుంచి బయట పడొచ్చు..
ఈ టిప్స్‌తో వైరల్ ఫీవర్ల నుంచి బయట పడొచ్చు..
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే ఛాన్స్.. ఎంతంటే
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే ఛాన్స్.. ఎంతంటే
మోసపోతున్నారు జాగ్రత్త! బంకులో పెట్రోల్ కొట్టించుకునేటప్పుడు..
మోసపోతున్నారు జాగ్రత్త! బంకులో పెట్రోల్ కొట్టించుకునేటప్పుడు..
9 నెలల గర్భంతో ఉన్న భార్యను వదిలి బిగ్ బాస్‌లోకి శేఖర్ బాషా
9 నెలల గర్భంతో ఉన్న భార్యను వదిలి బిగ్ బాస్‌లోకి శేఖర్ బాషా