Swiggy: స్విగ్గీలో అందుబాటులోకి నయా ఫీచర్.. ఇక మీ ఆర్డర్ మరింత సురక్షితం
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న టెక్నాలజీ ద్వారా మన అవసరాలు తీర్చేలా కొన్ని సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చాక మన అవసరాలను తీర్చేలా వివిధ యాప్స్ వాడుకలోకి వచ్చాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ అత్యంత ప్రజాదరణ పొందాయి. జొమాటో, స్విగ్గీ యాప్స్ ఫుడ్ ఆర్డర్స్‌లో కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో ఆయా యాప్స్ ఫుడ్ డెలివరీలే కాకుండా నిత్యావసరాలను కూడా డెలివరీ చేస్తున్నాయి.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న టెక్నాలజీ ద్వారా మన అవసరాలు తీర్చేలా కొన్ని సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చాక మన అవసరాలను తీర్చేలా వివిధ యాప్స్ వాడుకలోకి వచ్చాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ అత్యంత ప్రజాదరణ పొందాయి. జొమాటో, స్విగ్గీ యాప్స్ ఫుడ్ ఆర్డర్స్‌లో కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో ఆయా యాప్స్ ఫుడ్ డెలివరీలే కాకుండా నిత్యావసరాలను కూడా డెలివరీ చేస్తున్నాయి. అయితే మనం ఏ వస్తువులు ఆర్డర్ చేశామో? మై ఆర్డర్స్ కనిపిస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి ఇబ్బంది లేకుండా ఇంకోగ్నిటో ఫీచర్‌ను లాంచ్ చేస్తున్నట్లు ప్రముఖ కంపెనీ స్విగ్గీ ప్రకటించింది. వినియోగదారులు ఫుడ్ ఆర్డర్లతో పాటు వ్యాపార అవసరాల ఆర్డర్లను ప్రైవేట్‌గా ఇచ్చేలా ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఈ మోడ్ ద్వారా ఈ ఆర్డర్‌లను యాప్ హిస్టరీలో కనిపించవు. అలాగే వాటిని మాన్యువల్‌గా తొలగించాల్సిన అవసరం ఉండదు. ఈ నేపథ్యంలో ఇంకోగ్నిటో ఫీచర్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
ఇంకోగ్నిటో ఫీచర్ స్విగ్గీ ఫుడ్, ఇన్‌స్టామార్ట్ రెండింటిలోనూ అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ మన ఆర్డర్ హిస్టరీను ప్రైవేట్‌గా ఉంచుతుంది. ముఖ్యంగా స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లోని వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల వంటి వాటిని ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆర్డర్లు చేసుకోవచ్చని నిపుణులు చెబున్నారు. మన జీవితాలు సామాజికంగా మారుతున్నందున మేము ఇంకా ప్రైవేట్‌గా ఉంచడానికి చేసే ప్రయత్నంలో భాగంగా ఇంకోగ్నిటో మోడ్ అందుబాటులోకి తీసుకొచ్చామని స్విగ్గీకు సంబంధించిన ఫుడ్ మార్కెట్‌ప్లేస్ సీఈఓ రోహిత్ కపూర్ చెప్పారు. ముఖ్యంగా వినియోగదారుల ఆర్డర్ హిస్టరీ ప్రైవేట్‌గా ఉంచేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
ఈ ఫీచర్ ప్రస్తుతం 10 శాతం స్విగ్గీ వినియోగదారులకు అందుబాటులో ఉంది. అలాగే రాబోయే రోజుల్లో వినియోగదారులందరికీ అందుబాటులోకి వస్తుంది. వినియోగదారు కార్ట్‌లో టోగుల్ చేయడం ద్వారా ఇన్‌కాగ్నిటో మోడ్ ఫీచర్‌ని యాక్టివేట్ చేయవచ్చు. యాక్టివేట్ చేసిన తర్వాత ఈ మోడ్ ఆన్‌లో ఉందని నిర్ధారిస్తూ రిమైండర్ కనిపిస్తుంది. ఆర్డర్ డెలివరీ చేసిన తర్వాత కేవలం మూడు గంటల పాటు ఈ ఆర్డర్ వివరాలను మనకు కనిపిస్తాయి. అనంతరం ఈ వివరాలు ఆటోమెటిక్‌గా హైడ్ అయిపోతాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి