ప్రపంచ ఆటోమొబైల్ రంగంలో ఈవీ వాహనాల ట్రెండ్ నడుస్తుంది. టాప్ కంపెనీల నుంచి స్టార్టప్ కంపెనీల వరకూ ఈవీ మోడల్స్‌ను రిలీజ్ చేస్తున్నాయి. ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా ఈవీ రంగంలో ఫోర్ వీలర్స్‌తో పోలిస్తే టూ వీలర్స్ ఎక్కువ ప్రజాదరణ పొందాయి. వీటీల్లో కూడా ఈవీ స్కూటర్‌లను ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈవీ వాహనాల రిలీజ్ విషయంలో కాస్త వెనుకబడిన హోండా గ్లోబల్ మార్కెట్‌లో మాత్రం కొత్త ఆవిష్కరణలు చేస్తుంది. హోండా కంపెనీ ఇటీవల ఫస్ట్ అండ్ లాస్ట్ మైల్ సొల్యూషన్‌ను లాంచ్ చేసింది. ఈ సర్వీసును మోటో కాంపాక్టోగా పిలుస్తున్నారు. ఈ నయా ప్రొడెక్ట్ 1980ల్లో విక్రయించిన మోటో కాంపోనకు ఆధునిక ఆల్-ఎలక్ట్రిక్ టెక్‌గా పేర్కొనవచ్చు. ఈ స్కూటర్లు అకురా డీలర్ల ద్వారా విక్రయిస్తున్నారు. ప్రపంచ మార్కెట్‌లో ఈ స్కూటర్ల ధర దాదాపు 995 డాలర్లుగా ఉంది. అంటే మన కరెన్సీలో రూ.85,000. ఈ ఫోల్డబుల్ స్కూటర్ గురించి మరిన్ని విశేషాలను తెలుసుకుందాం.
హోండా మోటో కాంప్టోకు శక్తిని అందించడానికి ఫ్రంట్ వీల్‌లో మౌంట్ చేసిన శాశ్వత మ్యాగ్నటిక్ డ్రైవ్ ఎలక్ట్రిక్ మోటార్‌ను అమర్చారు. ఇది గరిష్టంగా 490 వాట్స్ పవర్ అవుట్ పుట్, 16 ఎన్‌ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ స్కూటర్ గరిష్టంగా గంటకు 24 కిలో మీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. బ్యాటరీ సామర్థ్యం 6.8 ఏహెచ్‌గా ఉంటుంది. ఈ స్కూటర్‌ను 110 వాట్స్ చార్జర్‌ను ఉపయోగించి 3.5 గంటల్లో చార్జ్ చేయవచ్చు. అలాగే ఈ స్కూటర్‌ను సింపుల్‌గా మడిచి ఎక్కడికైనా తీసుకెళ్లే సౌలభ్యం ఉంటుంది. హోండా మోటో కాంపాక్ట్ వీల్‌బేస్ 741 మిమి, సీటు ఎత్తు కేవలం 622 మిమి ఉంటుంది. అలాగే ఈ స్కూటర్ బరువు కేవలం 19 కిలోలు మాత్రమే. ఈ స్కూటర్ పొడవు 967 ఎంఎం, 889 ఎంఎం ఎత్తు, వెడల్పు 436 ఎంఎంగా ఉంటుంది.
ఈ స్కూటర్ మడతపెట్టినప్పుడు కొలతలు వరుసగా 741 ఎంఎం, 535 మిమి, 93.88 మిమికు తగ్గుతాయి. ఈ స్కూటర్ 49 సీసీ ఇంజిన్‌తో ఎయిర్-కూల్డ్ ట్రూస్ట్రోక్ ఇంజిన్ ఆధారంగా పని చేస్తుంది. ఈ ఇంజిన్ 5000 ఆర్‌పీఎం వద్ద 2.4 బీహెచ్‌పీ, 4500 ఆర్‌పీఎం వద్ద 3.72 గరిష్ట టార్క్ అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..