JIO: టెలికాం కంపెనీలలో రిలయన్స్ జియో టాప్ ప్లేస్‌లో దూసుకెళుతుంది. వినియోగదారులకు తక్కువ ధరకే ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను అందిస్తుంది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి అనేక OTT ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సెస్ పొందే జియో ప్లాన్ గురించి తెలుసుకుందాం. జియో రూ.599 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లో మీకు డేటా, వాయిస్ కాలింగ్ నుంచి OTT సబ్‌స్క్రిప్షన్‌ల వరకు అన్ని రకాల ప్రయోజనాలు అందుతాయి. జియో ఈ ప్లాన్ చాలా చౌకైనది. ఒక నెల వాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్‌లో మీరు ఒక సంవత్సరం Amazon Prime వీడియో సబ్‌స్క్రిప్షన్, Netflix, Disney + Hotstar యాక్సెస్ దొరుకుతుంది. అన్ని Jio యాప్‌ల సభ్యత్వాన్ని కూడా పొందుతారు. ఈ ప్లాన్ ఇతర ప్రయోజనాల గురించి మాట్లాడుతూ.. ఇందులో మీరు ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత కాలింగ్ రోజుకు 100 SMS సౌకర్యం, మొత్తం 100GB ఇంటర్నెట్ పొందుతారు. ఈ ప్లాన్‌లో మీకు 200GB రోల్‌ఓవర్ డేటా ప్రయోజనం కూడా అందుతుంది. అదనంగా కుటుంబ ప్లాన్‌తో పాటు అదనపు సిమ్ కార్డ్ కూడా ఇస్తారు.
ఇతర ప్లాన్ల వివరాలు..
28 రోజుల వ్యాలిడిటీ ఉన్న రూ. 199 ప్లాన్ రీఛార్జ్ ఇప్పుడు రూ. 239 అవుతుంది. ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతోపాటు రోజుకు 1.5GB డేటాను అందిస్తుంది. గతంలో 28 రోజుల పాటు 2GB రోజువారీ డేటాను అందించే ప్లాన్ ధర రూ. 299 అయింది.
56 రోజుల వ్యాలిడిటీతో రూ.399 ఉన్న ప్లాన్ రేటు రూ. 479కి పెరిగింది. ఇది 56 రోజుల వ్యాలిడిటీతో ప్రతిరోజూ 1.5GB డేటాతో వస్తుంది. అదేవిధంగా 2GB డేటా రోజువారి ప్యాక్ 56 రోజుల వ్యాలిసిటీ ఉన్న ధర ఇప్పుడు రూ.444 నుంచి రూ.533 కి పెరిగింది.
84 రోజుల రూ.329 ప్లాన్ ధర రూ.395కి పెంచబడింది. ఈ ప్యాక్‌లో 6GB డేటా 84 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. రూ.555 ప్యాక్, రోజుకు 1.5జీబీ డేటాతో ఉన్న ప్లాన్ రూ.666కి పెంచారు. దీని వాలిడిటీ 84 రోజులు. 2GB/రోజు ప్యాక్ ఇప్పుడు రూ. 599 నుంచి రూ.719కి పెరిగింది.