బ్యాంకు డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్ వీటిలో ఏది బెస్ట్.. క్లారిటీ కావాలంటే ఈ వివరాలు తెలుసుకోండి..!
నిజానికి మన దేశంలో రిస్క్ ఉండే ఇన్వెస్ట్మెంట్స్ వైపు పెద్దగా అడుగులు వేయరు. అందుకే ఇప్పటి వరకూ పోస్టాఫీస్ డిపాజిట్ స్కీమ్స్, బ్యాంకు డిపాజిట్ల వైపు ఎక్కువగా చూసేవారు. అయితే, ఇప్పుడు పరిస్థితి మారింది. కాస్త రిస్క్ అయినా రాబడి ఎక్కువ రావాలని అందరూ ఆశిస్తున్నారు. అందుకే ఎక్కువ మంది మ్యూచువల్ ఫండ్స్ వైపు వెళుతున్నారు. దీంతో ఇప్పుడు బ్యాంకు ఫిక్సిడ్ డిపాజిట్లు గట్టి పోటీని ఎదుర్కొంటున్నాయి.
పొదుపు, పెట్టుబడుల విషయంలో ఈ మధ్య ప్రజల ఆలోచనా విధానంలో చాలా మార్పులు వచ్చాయి. స్టాక్ మార్కెట్ వైపు ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్ వైపు ఎక్కువమంది ప్రజలు చూస్తున్నారు. నిజానికి మన దేశంలో రిస్క్ ఉండే ఇన్వెస్ట్మెంట్స్ వైపు పెద్దగా అడుగులు వేయరు. అందుకే ఇప్పటి వరకూ పోస్టాఫీస్ డిపాజిట్ స్కీమ్స్, బ్యాంకు డిపాజిట్ల వైపు ఎక్కువగా చూసేవారు. అయితే, ఇప్పుడు పరిస్థితి మారింది. కాస్త రిస్క్ అయినా రాబడి ఎక్కువ రావాలని అందరూ ఆశిస్తున్నారు. అందుకే ఎక్కువ మంది మ్యూచువల్ ఫండ్స్ వైపు వెళుతున్నారు. దీంతో ఇప్పుడు బ్యాంకు ఫిక్సిడ్ డిపాజిట్లు గట్టి పోటీని ఎదుర్కొంటున్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB) ‘మ్యూచువల్ ఫండ్స్ బ్యాంక్ డిపాజిట్లకు ఎంత తీవ్రమైన ముప్పు?’ అని ఒక రిపోర్ట్ విడుదల చేసింది. ఇందులో చాలామంది ప్రజలు ఫైనాన్షియల్ రిస్క్ తీసుకునే అవలాటును పెంచుకున్నారని ఆ రిపోర్ట్ వెల్లడించింది.
MF పరిశ్రమ వేగవంతమైన వృద్ధిని నమోదు చేసుకుంటోంది. మనం కాంపౌండ్ వార్షిక వృద్ధి రేటు (CAGR) ప్రకారం చూస్తే కనుక అది 2019-20 నుంచి మూడు ఆర్థిక సంవత్సరాల్లో అంటే 2020-21, 2021-22లో 24.8% వృద్ధి నమోదు చేసుకుంది. . 2022-23. రేటు ₹20.26 లక్షల కోట్ల నుంచి ₹39.42 లక్షల కోట్లకు పెరిగింది. అదే మనం బ్యాంకు డిపాజిట్ల గురించి చూస్తే కనుక అందులో కేవలం 10% వృద్ధి (సీఏజీఆర్) మాత్రమే కనిపించింది. FY 2020 నుంచి 2023 వరకు, ఇది ₹135.67 లక్షల కోట్ల నుంచి ₹180.44 లక్షల కోట్లకు మాత్రమే పెరిగింది.
RBI – అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (AMFI) నివేదిక ఆధారంగా కోవిడ్‌కు ముందు, ఉమ్మడి బకాయి మొత్తంలో మ్యూచువల్ ఫండ్ల వాటా 13% అని ఆర్బీఐ తెలిపింది. ఇప్పుడు అది 20% వద్దకు చేరుకుంది. ఆగస్ట్ 2023లోనే, పెట్టుబడిదారులు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా SIPలో రికార్డు స్థాయిలో ₹15,813 కోట్లు పెట్టుబడి పెట్టారు. మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ మొత్తం వృద్ధి ఈ సంవత్సరం జూలైతో పోలిస్తే ఆగస్టులో ₹ 46.37 లక్షల కోట్ల నుంచి ₹ 46.93 లక్షల కోట్లకు పెరిగింది. ఆగస్టు 2023కి బ్యాంక్ డిపాజిట్లు (హెచ్‌డిఎఫ్‌సి విలీనం మినహా) సంవత్సరానికి (YoY) 12.3% వృద్ధిని నమోదు చేసినట్లు నివేదిక చెబుతోంది. మ్యూచువల్ ఫండ్స్‌లో ఈ వృద్ధి 18.6%గా ఉందని రిపోర్ట్ స్పష్టం చేసింది.
ఇన్వెస్ట్‌మెంట్ విషయానికి వస్తే రిస్క్‌లు ఉన్నప్పటికీ మ్యూచువల్ ఫండ్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని నివేదికలో చెప్పారు. ఎందుకంటే అవి పెట్టుబడిదారుడి కోరికల ప్రకారం వివిధ రకాల పథకాలను అందిస్థాయి. ఇందులో బ్యాంకులతో పోలిస్తే చాలా ఎక్కువ రాబడి వచ్చే అవకాశం ఉంది. బ్యాంక్ డిపాజిట్లలో మన ఫండ్స్ సేఫ్టీ కి గ్యారెంటీ ఉంటుంది. అయితే స్థిరమైన రేటు ప్రకారం మాత్రమే రాబడి అందుబాటులో ఉంటుంది. కానీ, మ్యూచువల్ ఫండ్స్ లో అలా కాదు. కొద్దిగా రిస్క్ ఉన్నా.. ఎక్కువ మొత్తంలో రాబడి వచ్చే అవకాశం ఉంది.
మహమ్మారి సమయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బ్యాంక్ రేట్లలో పెద్ద కోత పెట్టడమే బ్యాంక్ డిపాజిట్లు తగ్గడానికి కారణమని రిపోర్ట్ పేర్కొంది. ఈ కోత కారణంగా రిటైల్, కార్పొరేట్ ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్ పథకాల్లో భారీగా పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారు. దీని కారణంగా, మ్యూచువల్ ఫండ్స్ అసెట్స్ అండర్ మేనేజ్‌మెంట్ (AUM)లో భారీ వృద్ధి కనిపించింది. మీరు కూడా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టాలని అనుకుంటే కనుక నిపుణుల సలహా ప్రకారం ఆ పని చేయండి. మీదగ్గర ఉన్న మొత్తం ఫండ్స్ లో పెట్టకండి. ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో వైవిధ్యం రిస్క్ ను తగ్గిస్తుంది.
మరిన్ని పర్సనల్ ఫైనాన్స్ కథనాలు చదవండి..