
మల్టీబ్యాగర్ స్టాక్ పేరు మీరు తప్పక వినే ఉంటారు. కొన్ని రూపాయల పెట్టుబడిని వేలల్లోకి మార్చే స్టాక్స్‌గా పేరుగాంచాయి. పెట్టుబడిదారుడు దీర్ఘకాలం పాటు ఉంచితే, కోట్లల్లో లాభాలు అందిస్తాయి. తాజాగా ఇలాంటి స్టాక్స్ ఎన్నో పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నాయి. వీటిలో పెట్టుబడి పెట్టిన డబ్బు ఎన్నో రెట్ల లాభాలను అందించడంతో, ఎక్కువమంది వీటిపై ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా ఇటువంటి స్టాక్ ఒకటి చర్చల్లోకి వచ్చింది. టైటాన్ కంపెనీకి చెందిన ఈ స్టాక్.. పెట్టుబడిదారులను ధనవంతులను చేసింది. ఈ కంపెనీ బోనస్ షేర్లతో పాటు స్టాక్ స్ప్లిట్‌ను కూడా ప్రకటించింది. ఇటీవలి సంవత్సరాలలో భారతీయ స్టాక్ మార్కెట్ సృష్టించిన మల్టీబ్యాగర్ స్టాక్‌లలో టైటాన్ షేర్ కూడా ఒకటిగా నిలిచింది.
టైటాన్ ప్రభంజనం..
ఒకప్పుడు రూ.3లతో ప్రారంభమైన టైటాన్ షేర్ నేడు రూ.2535కి చేరింది. గత 20 ఏళ్లలో ఈ స్టాక్ 845 రెట్లు పెరిగింది. ఈ స్టాక్‌లో ఎక్కువ కాలం పెట్టుబడి పెట్టిన వారు డబ్బు సంపాదించడమే కాదు.. కంపెనీ 10:1 షేర్ స్ప్లిట్, 1:1 బోనస్ షేర్‌ను కూడా ప్రకటించింది. స్టాక్ స్ప్లిట్ నుంచి వాటాదారునికి ప్రత్యక్ష ప్రయోజనం లేదు. కానీ, షేర్లను పంచుకోవడం ద్వారా, దాని సంఖ్య పెరుగుతుంది. ఇన్‌పుట్ ఖర్చు తగ్గుతుంది. 20 ఏళ్ల క్రితం టైటాన్ షేర్లను కొనుగోలు చేసిన వారి ఇన్‌పుట్ ధరలో 10 శాతం వరకు తగ్గుదల కనిపించింది.
వాటాదారునికి బంపర్ ప్రయోజనం..
టాటా గ్రూప్ కంపెనీ జూన్ 2011లో వాటాదారులకు 1:1 బోనస్ షేర్లను ప్రకటించింది. దీని ప్రకారం, 20 సంవత్సరాల క్రితం టైటాన్ షేర్లను కొనుగోలు చేసిన వారి ఇన్పుట్ ఖర్చు 50% పడిపోయింది. స్టాక్ స్ప్లిట్ కారణంగా ఇన్‌పుట్ ధర ఇప్పటికే 10% తగ్గింది. తరువాత, పెట్టుబడిదారుల ధర బోనస్ షేర్ నుంచి 5 శాతం తగ్గింది. టైటాన్ స్టాక్ గత రెండు దశాబ్దాల్లో 16,900 రెట్లు పెరిగింది. ఒక ఇన్వెస్టర్ ఇరవై సంవత్సరాల క్రితం టైటాన్ కంపెనీ షేర్లలో రూ. 3 చెల్లించి రూ. లక్ష పెట్టుబడి పెడితే, గత రెండు దశాబ్దాల్లో దాని రూ. 1 లక్ష నుంచి 169 కోట్లు అంటూ 16,900 రెట్లు పెరిగింది.
గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం కేవలం అవగాహన కోసమే. షేర్ మార్కెట్, మ్యూచవల్ ఫండ్స్ లాంటి వాటిల్లో పెట్టుబడి పెట్టేముందు, నిశిత పరిశీలన అవసరం. అలాగే నిపుణుల సలహాతో సరైన నిర్ణయం తీసుకుంటే మంచిది.