AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mukesh Ambani: రిలయన్స్ చైర్మన్‌గా పనిచేస్తున్నందుకు ముకేష్ అంబానీ జీతమెంతో తెలుసా..?

దేశంలోనే అత్యంత ధనవంతుడై ముకేష్ అంబానీ రిలయన్స్ కంపెనీకి చైర్మన్‌గా ఉన్నందుకు రూ.కోట్లలో జీతం తీసుకుంటున్నారని అనుకుంటారు. కానీ ఆయన ఒక్క రూపాయి కూడా జీతం తీసుకోవడం లేదు. కానీ ఆయన కూతురు, కుమారులు మాత్రం జీతం తీసుకుంటున్నారు. తాజాగా ఈ విషయం బయటపడింది.

Mukesh Ambani: రిలయన్స్ చైర్మన్‌గా పనిచేస్తున్నందుకు ముకేష్ అంబానీ జీతమెంతో తెలుసా..?
Mukesh Ambani
Venkatrao Lella
|

Updated on: May 29, 2026 | 8:32 AM

Share

రిలయన్స్ సంస్థకు చైర్మన్‌, ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్నందుకు ముకేష్ అంబానీ రూ.కోట్లలో జీతం తీసుకుంటున్నారని మనందరం అనుకుంటాం. కానీ అది తప్పు అని ఇప్పుడు తేలింది. ఇటీవల రిలయన్స్ గత ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి చివరి త్రైమాసికం క్యూ4 ఫలితాలను ప్రకటించింది. అయితే తాజాగా గత ఆర్ధిక సంవత్సరానికి సంంబంధించిన యాన్యువల్ రిపోర్ట్ విడుదల చేసింది. ఇందులో చైర్మన్‌గా వ్యవహరిస్తున్నందుకు ముకేష్ అంబానీ, కుటుంబసభ్యులు ఎంత జీతం, కమిషన్లు తీసుకుంటున్నారనే వివరాలు బయటపడ్డాయి. ఇందులో పలు ఆసక్తికర విషయాలు బయటకొచ్చాయి. వాటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

జీతం తీసుకోని ముకేష్ అంబానీ

రిలయన్స్ కంపెనీకి చైర్మన్, ఎండీగా పనిచేస్తున్నందుకు గత ఆర్ధిక సంవత్సరంలో ముకేష్ అంబానీ ఒక్క  రూపాయి కూడా జీతం తీసుకోలేదు. ఆయన కంపెనీ నుంచి ఎలాంటి జీతం తీసుకోకుండానే గత కొన్నేళ్లుగా పనిచేస్తున్నారు. 2020-21 ఆర్దిక సంవత్సరం నుంచి ఆయన ఒక్క రూపాయి కూడా జీతం తీసుకోవడం లేదు. కరోనాతో దేశ ఆర్ధిక వ్యవస్థ కుదేలవ్వడంతో అప్పటి నుంచి ముకేష్ అంబానీ జీతం వదులుకున్నారు. ఇతర అలవెన్సులు, ఇన్సెంటివ్స్ అన్నీ ఆయన వదులుకున్నారు. అప్పటినుంచి కంపెనీ నుంచి జీతం తీసుకోవడం లేదు. అయితే అంతకంటే ముందు 2008 నుంచి 2020 వరకు రూ.15 కోట్ల వార్షిక వేతనం ముకేష్ అంబానీ అందుకున్నారు. అయితే ముకేష్ అంబానీ కుమార్తె, కుమారుడు మాత్రం సిట్టింగ్ ఫీజులు, కమిషన్ తీసుకుంటున్నారు.

కుమార్తె, కుమారుడికి జీతం ఎంతంటే..?

అంబానీ కుమార్తె ఇషా అంబానీ రిలయన్స్ రిటైల్ విభాగం బాధ్యతలు చూసుకుంటుండగా.. రిలయన్స్ జియో బాధ్యతలను కుమారుడు ఆకాశ్ అంబానీ చూసుకుంటున్నారు. అయితే వీరిద్దరు బోర్డు మీటింగ్స్, సమావేశాల్లో పాల్గొనందుకు సిట్టింగ్ ఫీజు కింద రూ.5 లక్షలు అందుకున్నారు. ఇక గత ఆర్ధిక సంవత్సరంలో వీరిద్దరూ రూ.2.5 కోట్లు కమిషన్ అందుకున్నారు. ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ రూ.లక్ష సిట్టింగ్ ఫీజు అందుకున్నారు. ఇక కమిషన్ రూపంలో రూ.21 లక్షలు పొందారు. ఇక రూ.12.17 కోట్ల జీతం పొందారు. ఇక అంబానీ బంధువులైన నిఖిల్ మేస్వాని, హిటల్ మేస్వాని గత ఆర్ధిక సంవత్సరంలో రూ.14.56 కోట్ల జీతం పొందినట్లు యాన్యువల్ రిపోర్టులో వెల్లడైంది. కాగా గత ఆర్ధిక సంవత్సరంలో రిలయన్స్ లాభాలు కాస్త తగ్గాయి. ప్రపంచవ్యాప్తంగా యుద్ద పరిస్థితుల ప్రభావం వల్ల లాభాలు తగ్గినట్లు చెబుతున్నారు. త్వరలో జియో ఐపీఓకు రానున్న క్రమంలో రిలయన్స్ షేర్లు మరింత పెరిగే అవకాశముందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

Follow Us