మనకు అనేక రకాల రుణాలు లభిస్తాయి. సెక్యూర్డ్ లోన్ మరియు అన్ సెక్యూర్డ్ లోన్ అని రెండు వర్గీకరణలు ఉన్నాయి. అన్‌సెక్యూర్డ్ లోన్. అన్‌సెక్యూర్డ్ లోన్ అంటే పర్సనల్ లోన్, ఇన్‌స్టంట్ లోన్ మొదలైనవి. వ్యక్తి ఆదాయం, క్రెడిట్ చరిత్రను పరిగణనలోకి తీసుకొని ఎటువంటి తనఖా తీసుకోకుండా బ్యాంకు ఇచ్చే రుణాలు ఇవి. అలాగే సెక్యూర్డ్ లోన్. అంటే మనం ఏదైనా ఆస్తిని తనఖాగా పెట్టి తీసుకునే రుణం.
మీరు ఇల్లు నిర్మిస్తుంటే లేదా ఇల్లు కొంటున్నట్లయితే తనఖా రుణం కోసం దరఖాస్తు చేయవద్దు. గృహ రుణం కోసం మాత్రమే దరఖాస్తు చేసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. అందుకు కారణాలున్నాయి. చాలా మంది గృహ రుణాన్ని తనఖా రుణంగా చూస్తారు. గృహ రుణం ఒక రకమైన తనఖా రుణం. కానీ రెండూ భిన్నమైనవి. రెండింటిలోని వడ్డీ రేట్లలో తేడాలు ఉన్నాయి. రెండూ ఎలా విభిన్నంగా ఉన్నాయో తెలుసుకుందాం.
ఇప్పటికే చెప్పినట్లుగా తనఖా రుణం అంటే మనం సెక్యూరిటీగా తీసుకునే రుణం. ఇక్కడ మనం తనఖాగా పొందే లోన్ కంటే ఎక్కువ విలువైన ఆస్తిని పెట్టవలసి రావచ్చు. ఇక్కడ ఆస్తి ఏదైనా కావచ్చు . అది ఇంటి దస్తావేజు కావచ్చు, భూమి పత్రాలు, లేదా మన వివిధ పెట్టుబడి పథకాల దస్తావేజు కావచ్చు. రుణాన్ని తిరిగి చెల్లించడానికి రుణగ్రహీత అందించే హామీలు ఇవి అన్నట్లు. ఈ ఆస్తుల తనఖా రుణం ఇచ్చే సంస్థ, రుణగ్రహీత మధ్య ఒప్పందం అవుతుంది. అయితే తనఖా పెట్టి రుణలు తీసుకున్న సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ తనఖా రుణంలో రుణం తిరిగి చెల్లించే వరకు రుణగ్రహీత ఆస్తులు ఆర్థిక సంస్థ ఆధీనంలో ఉంటాయని గుర్తించుకోవాలి.
ఇది కూడా ఒక విధంగా తనఖా రుణమే. ఇల్లు కొనుక్కున్నప్పుడు మనకు లభించే రుణం ఇది. లేదా ఒక ప్లాట్ కొని దాని మీద ఇల్లు కట్టుకుని గృహ రుణం పొందవచ్చు. కొనుగోలు చేసిన ఇల్లు లేదా ప్లాట్ టైటిల్ డీడ్ తనఖాగా ఉంచడం జరుగుతుంది. ఇక్కడ హోమ్ లోన్ రీపేమెంట్ వ్యవధి కొన్నిసార్లు 25 సంవత్సరాల వరకు ఉంటుంది.
ఇక్కడ మనం డబ్బును సకాలంలో తిరిగి చెల్లించకపోతే అది గృహ రుణమైనా లేదా తనఖా రుణమైనా మన ఆస్తి పత్రాల ద్వారా ఆస్తిని జప్తు చేసే హక్కు ఆర్థిక సంస్థలకు ఉంటుంది. అలాగే , తనఖా రుణం పొందుతున్నప్పుడు బ్యాంకులు కొన్ని సందర్భాల్లో అధిక వడ్డీని వసూలు చేస్తాయి. మన క్రెడిట్ స్కోర్ బాగా లేనప్పుడు లేదా మన మునుపటి లోన్ రీపేమెంట్ ప్యాటర్న్ సరిపోనప్పుడు పెద్ద మొత్తంలో లోన్ పొందడం, తక్కువ వడ్డీ రేటుతో లోన్ పొందడం కష్టం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి