Budget 2024: మరింత చౌకగా మొబైల్ ఫోన్స్.. నిర్మలమ్మ పద్దుపై ఆశలెన్నో..!

|

Jul 18, 2024 | 8:30 PM

ఆర్థిక మంత్రి సీతారామన్ జూలై 23న పార్లమెంటులో తన ఏడో బడ్జెట్‌ను ఆవిష్కరించనున్నారు. కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం మూడో సారి ఏర్పడడంతో ఈ బడ్జెట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా వివిధ రంగాలు ప్రముఖులు బడ్జెట్‌లోని కీలక ప్రకటనల గురించి వేచి చూస్తున్నారు. స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులు ఈ బడ్జెట్‌లోని ప్రకటనతో ఫోన్‌లను మరింత తక్కువ ధరకు అందిస్తారా? అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. భారతదేశంలో మొబైల్ ఫోన్ తయారీని పెంచే ప్రయత్నంలో ప్రభుత్వం గత సంవత్సరం కెమెరా లెన్స్‌ల వంటి కీలక భాగాలపై దిగుమతి పన్నులను తగ్గించింది.

Budget 2024: మరింత చౌకగా మొబైల్ ఫోన్స్.. నిర్మలమ్మ పద్దుపై ఆశలెన్నో..!
Smartphone
Follow us on

ఆర్థిక మంత్రి సీతారామన్ జూలై 23న పార్లమెంటులో తన ఏడో బడ్జెట్‌ను ఆవిష్కరించనున్నారు. కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం మూడో సారి ఏర్పడడంతో ఈ బడ్జెట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా వివిధ రంగాలు ప్రముఖులు బడ్జెట్‌లోని కీలక ప్రకటనల గురించి వేచి చూస్తున్నారు. స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులు ఈ బడ్జెట్‌లోని ప్రకటనతో ఫోన్‌లను మరింత తక్కువ ధరకు అందిస్తారా? అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. భారతదేశంలో మొబైల్ ఫోన్ తయారీని పెంచే ప్రయత్నంలో ప్రభుత్వం గత సంవత్సరం కెమెరా లెన్స్‌ల వంటి కీలక భాగాలపై దిగుమతి పన్నులను తగ్గించింది . అదనంగా లిథియం-అయాన్ బ్యాటరీలపై తగ్గించిన పన్ను రేట్లను పొడగించింది. లిథియం అయాన్ బ్యాటరీలు అనేవి స్మార్ట్ ఫోన్, ఈవీ వాహనాలకు చాలా కీలకం. ఈ నేపథ్యంలో బడ్జెట్‌లో మొబైల్ రంగం ఎలాంటి తగ్గింపులను ఆశిస్తుందో? ఓసారి తెలుసుకుందాం.

కేంద్ర ప్రభుత్వం తన రాబోయే బడ్జెట్‌లో దేశీయ తయారీని పెంచడానికి భారతదేశపు ప్రధాన కార్యక్రమం అయిన ప్రొడెక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) పథకాన్ని పునఃపరిశీలించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తుంది. ముఖ్యంగా స్థానికంగా ఫోన్లను ఉత్పత్తి చేయడానికి కంపెనీలను ప్రోత్సహించడానికి రూపొందించిన పీఎల్ఐ పథకం దేశీయ ఉత్పత్తులపై ప్రత్యేక రాయితీలను అందిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా భారత తయారీ వస్తువుల పోటీతత్వాన్ని పెంపొందించడంతో పాటు పెద్ద ఎత్తున తయారీని ప్రోత్సహించడం, ఆశాజనక రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడం ఈ పథకం లక్ష్యం. ఈ కార్యక్రమం భారతదేశం ప్రపంచ అగ్రగామిగా అవతరించే అవకాశం ఉన్న పరిశ్రమలను లక్ష్యంగా చేసుకుంటుంది. ఉపాధి కల్పనతో ఎగుమతుల్లో ఈ చర్యలు కీలకంగా మారనున్నాయి.

ఎలక్ట్రానిక్స్, టెక్స్‌టైల్స్ వంటి 14 కీలక రంగాలకు పీఎల్ఐ స్కీమ్‌లను రూపొందించిన ప్రభుత్వం ఇప్పుడు మరికొన్ని రంగాలకు ఈ ప్రోగ్రామ్‌ను విస్తరించాలని ఆలోచిస్తోందని నిపుణులు వివరిస్తున్నారు. అదనంగా తయారీదారులు ఎదుర్కొంటున్న సవాళ్లను గుర్తిస్తూ తాజా అవకాశాలను అందించడంతో పాటు ప్రయోజనాలను విస్తృత శ్రేణి కంపెనీలకు విస్తరిస్తుందని పేర్కొంటున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..