Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPI ATM: కార్డు లేకుండానే ఏటీఎం నుంచి డబ్బులు.. వాటిని అరికట్టేందుకు బ్యాంకింగ్‌ రంగంలో వినూత్న ప్రయోగం

2016లో భారతదేశంలో తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం తర్వాత డిజిటల్‌ పేమెంట్స్‌ పెరిగాయి. ముఖ్యంగా ఎన్‌పీసీఐ సాయంతో చేసే యూపీఐ పేమెంట్స్‌కు ప్రజాదరణ బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో వ్యాపార సంస్థల వద్ద క్యూఆర్‌ కోడ్స్‌ ద్వారా లావాదేవీలు జరిపే వారి సంఖ్య క్రమేపి పెరుగుతున్నాయి. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో నగదు కావాల్సి వస్తే ఏటీఎం కార్డుల ద్వారా నగదు ఉపసంహరించుకునేవాళ్లం. కానీ డిజిటల్‌ పేమెంట్స్‌ పెరిగిన తర్వాత ఫోన్‌ ద్వారా లావాదేవీలు నిర్వహించవచ్చనే ఉద్దేశంతో అస్సలు ఏటీఎం కార్డులు వాడడం లేదు.

UPI ATM: కార్డు లేకుండానే ఏటీఎం నుంచి డబ్బులు.. వాటిని అరికట్టేందుకు బ్యాంకింగ్‌ రంగంలో వినూత్న ప్రయోగం
ATM
Follow us
Srinu

|

Updated on: Sep 07, 2023 | 3:45 PM

పెరుగుతున్న టెక్నాలజీ కారణంగా వివిధ రంగాల్లో కీలక మార్పులను తీసుకొచ్చింది. ముఖ్యంగా బ్యాంకింగ్‌ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ముఖ్యంగా నగదు ఉపసంహరణ విషయంలో ఏటీఎంల రాకతో బ్యాంకులపై ఒత్తిడి తగ్గింది. అయితే 2016లో భారతదేశంలో తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం తర్వాత డిజిటల్‌ పేమెంట్స్‌ పెరిగాయి. ముఖ్యంగా ఎన్‌పీసీఐ సాయంతో చేసే యూపీఐ పేమెంట్స్‌కు ప్రజాదరణ బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో వ్యాపార సంస్థల వద్ద క్యూఆర్‌ కోడ్స్‌ ద్వారా లావాదేవీలు జరిపే వారి సంఖ్య క్రమేపి పెరుగుతున్నాయి. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో నగదు కావాల్సి వస్తే ఏటీఎం కార్డుల ద్వారా నగదు ఉపసంహరించుకునేవాళ్లం. కానీ డిజిటల్‌ పేమెంట్స్‌ పెరిగిన తర్వాత ఫోన్‌ ద్వారా లావాదేవీలు నిర్వహించవచ్చనే ఉద్దేశంతో అస్సలు ఏటీఎం కార్డులు వాడడం లేదు. కానీ నగదు కావాల్సి వచ్చినప్పుడు యూపీఐ ద్వారా ఏటీఎం నగదు వస్తే బాగుంటుందని చాలాసార్లు అనుకుంటూ ఉంటాం. ప్రస్తుతం ఈ తరహా సేవలు అందుబాటులోకి వచ్చాయి. యూపీఐ క్యూఆర్‌ కోడ్స్‌ ద్వారా ఏటీఎం నుంచి నగదు విత్‌డ్రా చేసుకునే అవకాశం లభించింది. కాబట్టి ఈకొత్త విధానం గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

హిటాచీ పేమెంట్స్‌ సర్వీసెస్‌ ఎన్‌పీసీఐ ద్వారా కొత్త ఆవిష్కరణతో ముందుకు వచ్చింది. వైట్‌ లేబుల్‌ యూపీఐ ఏటీఎంల ద్వారా కార్డుల్లేకుండానే నగదు ఉపసంహరించుకునే సదుపాయాన్ని కల్పించింది. ఈ తరహా సేవలు భారతదేశంలో కల్పించడం ఇదే మొదటిసారి. కార్డులెస్‌ ఉపసంహరణలు కార్డు స్కిమ్మింగ్‌ ప్రమాదాన్ని తొలగించడంలో సహాయపడతాయి. బ్యాంకింగ్‌ సేవలను సులభంగా యాక్సెస్‌ చేయడం ద్వారా ఆర్థిక చేరికను పెంపొందించడమే తమ ప్రధాన లక్ష్యమని మనీ స్పాట్‌ యూపీఐ ఏటీఎం ప్రతినిధులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా కార్డు వినియోగం పరిమితంగా ఉన్న ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని తమ ఏటీఎంల ద్వారా సేవలను అందిస్తామని వివరిస్తున్నారు. 

ఈ సేవలు అందుబాటులోకి వస్తే హిటాచీ పేమెంట్‌ సేవలు ఏకైక వైట్‌లేబుల్‌ ఏటీఎం ఆపరేటర్‌గా నిలుస్తాయి. తమ 3000పైగా ఏటీఎం సెంటర్లల్లో త్వరలో ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని హిటాచీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా డిజిటల్‌ వాల్యూమ్‌లో 50 శాతానికి పైగా పేమెంట్స్‌ యూపీఐ ద్వారా జరుగుతున్న నేపథ్యంలో యూపీఐ ద్వారా నగదు ఉపసంహరించుకోవడానికి సదుపాయాన్ని కల్పిస్తే మరింత మందికి చేరువ అవుతారని మార్కెట్‌ నిపుణులు పేర్కొంటున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి