AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mobile Tips: ఫోన్ నీటిలో పడితే? ఈ 6 తప్పులు చేయొద్దు.. లేకుంటే మీ మొబైల్‌ గోవిందా..!

Mobile Tips: ఈ రోజుల్లో స్మార్ట్‌ ఫోన్‌ లేనిది ఎవ్వరు ఉండటం లేదు. కానీ ఫోన్‌ వాడే విధానంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పొరపాటున నీటిలో పడిపోయినా పనికి రాకుండా పోయే అవకాశం ఉంటుంది. కొందరు నీటిలో పడిపోతే కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. అవేంటో తెలుసుకుందాం..

Mobile Tips: ఫోన్ నీటిలో పడితే? ఈ 6 తప్పులు చేయొద్దు.. లేకుంటే మీ మొబైల్‌ గోవిందా..!
Smartphones
Subhash Goud
|

Updated on: Sep 12, 2026 | 7:40 PM

Share

Mobile Tips: ఈ రోజుల్లో చాలా మంది తమ సెల్ ఫోన్‌లను బాత్రూమ్ వంటి ప్రదేశాలకు కూడా తీసుకువెళ్తుంటారు. లేదా వర్షాకాలంలో బైక్‌పై వస్తున్నప్పుడు సాధారణంగా వర్షపు నీటిలో తడుస్తుంటుంది. లేదా పొరపాటున నీటిలోపడిపోతుంటుంది. మీ మొబైల్‌ నీటిలో తడిసిపోయినట్లయితే కొన్ని పొరపాట్లు అస్సలు చేయకూడదు. అవేంటో తెలుసుకుందాం..

చేయకూడని పొరపాట్లు ఇవే..

  1. నోటితో ఊదడం: ఛార్జింగ్ పోర్ట్ లోపల ఉన్న నీటిని బయటకు తీయడానికి, మనం సాధారణంగా నోటితో గట్టిగా ఊదుతాము. ఇలా చేయడం తప్పు. మీరు ఇలా ఊదినప్పుడు గాలి పీడనం లోపల ఉన్న నీటిని మరింత లోపలికి నెట్టి, దానిని డిస్‌ప్లే, మదర్‌బోర్డ్‌లోకి చేరేలా చేస్తుంది.
  2. ఆల్కహాల్ లేదా రసాయనాలతో తుడవడం : ఆల్కహాల్ లేదా శానిటైజర్ నీటి కంటే వేగంగా ఆవిరైపోయినప్పటికీ అవి స్క్రీన్‌ను పూర్తిగా పాడుచేయగలవు. అంతేకాక ఫోన్ లోపల ఉండే అంటుకునే పదార్థాలను కూడా కరిగించగలవు. నేటి ఆధునిక ఫోన్‌లు IP67 లేదా IP68 సర్టిఫికేషన్ పొందిన వాటర్‌ప్రూఫ్ ఫోన్‌లుగా వస్తున్నాయి. దీని ఫలితంగా చాలా మంది తమ ఫోన్‌లు తడిచిన తర్వాత వాటిని తుడవకుండానే ఉపయోగిస్తారు. అయితే వర్షపు నీటిలోని ఆమ్లత్వం, లవణత్వం వంటి కారకాల వల్ల ఫోన్‌లోని స్పీకర్ గ్రిల్స్ నెమ్మదిగా పాడు చేయవచ్చు.
  3. మైక్రోవేవ్ ఓవెన్ లేదా ఎండకు..: ఫోన్‌ను ఆరబెట్టే నెపంతో కొంతమంది దానిని గంటల తరబడి మైక్రోవేవ్ ఓవెన్‌లో లేదా నేరుగా ఎండలో పెట్టే ప్రయత్నం చేస్తుంటారు. మీరు దానిని ఓవెన్‌లో పెడితే మరుక్షణమే ఫోన్ పేలిపోతుంది. ఎండలో వదిలేస్తే స్మార్ట్‌ఫోన్‌లలోని లిథియం-అయాన్ బ్యాటరీలు అధిక వేడికి కరిగిపోతాయి లేదా శాశ్వతంగా దెబ్బతింటాయి.
  4. హెయిర్ డ్రైయర్‌తో ఆరబెట్టడం: హెయిర్ డ్రైయర్ నుండి వెలువడే తీవ్రమైన వేడి మీ స్మార్ట్‌ఫోన్‌లోని చిన్న ఎలక్ట్రానిక్ భాగాలను, కెమెరా లెన్స్‌లను కరిగించగలదు. అంతేకాకుండా దాని అధిక వేగంతో కూడిన గాలి ఫోన్ పైభాగంలో ఉన్న నీటిని మరింత లోపలికి నెట్టగలదు.
  5. ఇవి కూడా చదవండి
  6. బియ్యం కుండలో పాతిపెట్టడం: ఇది పాత బేసిక్ మోడల్ ఫోన్‌లకు సరిపోవచ్చు. అయితే ఇది నేటి ఆధునిక స్మార్ట్‌ఫోన్‌లకు తగినది కాదు. బియ్యంలోని చిన్న రేణువులు, పిండి, ధూళి ఫోన్ ఛార్జింగ్ పోర్ట్, స్పీకర్ రంధ్రాలు, హెడ్‌ఫోన్ జాక్‌లో ఇరుక్కుపోవచ్చు.
  7. వెంటనే ఛార్జింగ్ పెట్టొద్దు: మీ ఫోన్ తడిచిన వెంటనే ఛార్జర్‌కు పెట్టవద్దు. అలా చేయడం వల్ల విద్యుత్ షాక్ తగిలి, ఫోన్ పేలిపోవచ్చు లేదా దానిలోని ఎలక్ట్రానిక్ భాగాలు పూర్తిగా దెబ్బతినవచ్చు.

చేయవలసిన పనులు:

  1. సిమ్ కార్డ్ ట్రేను తీసివేయడం: ఫోన్‌ను శుభ్రమైన గుడ్డతో తుడిచిన తర్వాత మీరు ముందుగా సిమ్ కార్డ్ ట్రేను తీసివేయాలి. దీనివల్ల ఫోన్ లోపల గాలి పీడనం తగ్గి, లోపల ఉన్న తేమ మరింత సులభంగా బయటకు పోతుంది.
  2. వాక్యూమ్ క్లీనర్‌ను ఉపయోగించడం: మీరు ఫోన్ రంధ్రాల దగ్గర తక్కువ శక్తి గల వాక్యూమ్ క్లీనర్‌ను ఉంచితే, అది లోపల ఉన్న నీటి బిందువులను సులభంగా పీల్చేస్తుంది.
  3. సహజంగా ఆరబెట్టడం: ఫోన్ లోపల ఉన్న నీటిని ఆరబెట్టడానికి అత్యంత సురక్షితమైన మార్గం ఏమిటంటే దానిని పరుపు దుప్పటి వంటి ఒక పత్తి గుడ్డపై ఉంచండి. ఆ తర్వాత ఫ్యాన్‌ను ఆన్ చేసి, దానిని 24 గంటల పాటు అలాగే వదిలేయండి.
  4. ఉప్పు నీటిలో లేదా మురుగునీటిలో పడితే: మీ ఫోన్ మురుగునీటిలో లేదా ఉప్పునీటిలో పడితే వెంటనే దాన్ని స్విచ్ ఆఫ్ చేసి, దాని ఉపరితలాన్ని శుభ్రమైన, తాజా నీటితో తేలికగా తుడవండి. లేకపోతే ఉప్పు, మురికి ఫోన్ లోపల ఉన్న రాగి తీగలను నెమ్మదిగా తుప్పు పట్టించి దానిని పూర్తిగా నాశనం చేస్తాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us