కనిగిరికి చెందిన విద్యార్ధి తౌఫిక్ ది ఆత్మహత్య కాదని హత్యేనంటూ విద్యార్థి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నేతలు పలు మార్లు ఆరోపణలు చేశారు, చేస్తూనే ఉన్నారు. పదిరోజులుగా విద్యార్ధి తల్లి మౌలాబి మూలగుంటపాడులోని కోచింగ్ సెంటర్ ఎదుట ఒంటరిగా కూర్చుని నిరసన దీక్షలు చేస్తుంటే పోలీసులు, విద్యాశాఖ అధికారులు ఏం చేస్తున్నట్టో అర్ధం కావడం లేదు... ఒకవేళ చట్టపరమైన అన్ని చర్యలు తీసుకున్నామని, కేసు కోర్టులో ఉందని బాధితురాలికి పోలీసులు ఎందుకు వివరించలేకపోయారు... అసలు ఎలాంటి అనుమతి లేకుండా కోచింగ్ సెంటర్‌ను నిర్వహిస్తున్న యజమాని ప్రవర్తనపై పలు ఆరోపణలు ఉన్నా, ఆ కోణంలో ఎందుకు విచారించలేదన్న సందేహాలు కలుగుతున్నాయి... ఇంత జరుతుగున్న స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు బాధిత కుటుంబాన్ని కలిసి ఎందుకు భరోసా కల్పించలేకపోయారన్నది ఇక్కడ అంతుచిక్కని ప్రశ్న... రాష్ట్రంలో ఏ మూల ఏం దారుణం జరిగినా వెంటనే స్పందించే ప్రభుత్వం ఈ తౌషిక్ మృతి విషయంలో మాత్రం ఎందుకు సీరియస్‌గా తీసుకోలేదో అర్ధం కావడంలేదని ముస్లిం ప్రజా సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు... అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డ మృతికి కారకులైన వారిని శిక్షించేలా చేసేందుకు తల్లి మౌలాబి చేసిన పోరాటాలు విఫలం కావడంతో జీవతంపై విరక్తి చెంది ఆమె విషం తాగి ఆత్మహత్య చేసుకోవడం ప్రజాస్వామ్మ ప్రభుత్వాలకు సిగ్గుచేటని విద్యార్ధి, ప్రజా సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ అత్యంత విషాదకరమైన విషయం ఏంటంటే తాను చనిపోతే తన మృతదేహాన్ని తన బిడ్డ సమాధి పక్కనే పాతి పెట్టాలని ఆత్మహత్య చేసుకునే ముందు ఆ తల్లి అందర్నీ వేడుకోవడం. తల్లీ, బిడ్డల మృతితోనైనా ప్రభుత్వాలు కదులుతాయా..అనుమతి లేని కోచింగ్ సెంటర్‌ను మూసివేస్తారా... ఏం చేస్తారో చూడాలి...