AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Airtel: ఎయిర్‌టెల్ 3 అద్భుతమైన అన్‌లిమిటెడ్ 5G ప్లాన్స్‌ .. ప్రతిరోజూ డేటా ఎంతో తెలుసా?

Airtel Plans: ఎయిర్‌టెల్ ప్లాన్‌లు గొప్ప ప్రయోజనాలను అందిస్తాయి. ప్రత్యేకత ఏమిటంటే, ఈ ప్లాన్‌లు ఇంటర్నె, కాలింగ్‌తో పాటు వివిధ OTT, డిజిటల్ సేవలను కూడా అందిస్తాయి. ఈ ప్లాన్ జియో హాట్‌స్టార్ మొబైల్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే, హలో ట్యూన్, అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం వంటి ప్రయోజనాలను అందిస్తుంది..

Airtel: ఎయిర్‌టెల్ 3 అద్భుతమైన అన్‌లిమిటెడ్ 5G ప్లాన్స్‌ .. ప్రతిరోజూ డేటా ఎంతో తెలుసా?
Airtel
Subhash Goud
|

Updated on: Aug 29, 2026 | 5:58 PM

Share

Airtel: మీరు ఎయిర్‌టెల్ సిమ్ వాడుతూ, అపరిమిత డేటా, కాలింగ్, OTT ప్లాన్‌లతో రీఛార్జ్ చేసుకోవాలనుకుంటే, కంపెనీ కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్‌లు మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. ఎయిర్‌టెల్‌లో మూడు రీఛార్జ్ ప్లాన్‌లు ఉన్నాయి. ఇవి అపరిమిత 5G డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 2.5GB డేటాను అందిస్తాయి. ఈ ఎయిర్‌టెల్ ప్లాన్ ధర రూ. 399 నుండి ప్రారంభమవుతుంది.

ఎయిర్‌టెల్ ప్లాన్‌లు గొప్ప ప్రయోజనాలను అందిస్తాయి. ప్రత్యేకత ఏమిటంటే, ఈ ప్లాన్‌లు ఇంటర్నె, కాలింగ్‌తో పాటు వివిధ OTT, డిజిటల్ సేవలను కూడా అందిస్తాయి. ఈ రూ. 399 ప్లాన్ జియో హాట్‌స్టార్ మొబైల్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే, హలో ట్యూన్, అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం వంటి ప్రయోజనాలను అందిస్తుంది. అలాగే రూ. 1,199 రీఛార్జ్‌తో మీకు అమెజాన్ ప్రైమ్ లైట్ ప్రయోజనం కూడా లభిస్తుంది.

ఇది కూడా చదవండి: Jio: జియో ప్రైమ్ మెంబర్‌షిప్.. రూ.299తో రీఛార్జ్‌ చేసుకుంటే ఏడాది పాటు సిమ్‌ యాక్టివ్‌గా ఉంటుందా?

ఇవి కూడా చదవండి

ఎయిర్‌టెల్ రూ. 399 ప్లాన్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?: ఎయిర్‌టెల్ రూ. 399 ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఎయిర్‌టెల్ ప్లాన్ రోజుకు 2.5GB హై-స్పీడ్ డేటాను అందిస్తుంది. అంటే, మొత్తం వ్యాలిడిటీ కాలంలో 70GB డేటాను ఉపయోగించుకోవచ్చు. ఇది కాకుండా అర్హత ఉన్న వినియోగదారులు అపరిమిత 5G డేటా ప్రయోజనాన్ని కూడా పొందుతారు.

ఈ రూ. 399 ప్లాన్ అపరిమిత కాల్స్, OTTని అందిస్తుంది. ఇది లోకల్, STD, రోమింగ్ కాల్స్ కోసం అపరిమిత వాయిస్ కాలింగ్‌ను అందిస్తుంది. ఇది రోజుకు 100 SMSలను కూడా అందిస్తుంది. అర్హులైన వినియోగదారుల కోసం ఇందులో 28 రోజుల జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే, హలో ట్యూన్స్, అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం సేవ కూడా చేర్చారు.

ఎయిర్‌టెల్ రూ. 1199 ప్లాన్ ప్రయోజనాలు: ఈ రూ. 1,199 ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అంటే మూడు నెలల చింత తీరిపోతుంది. ఇందులో కూడా మీకు రోజుకు 2.5GB డేటా లభిస్తుంది. దీనితో పాటు, అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలు, అపరిమిత 5G డేటా లభిస్తుంది. ఈ ప్లాన్‌లోని అతిపెద్ద అదనపు ప్రయోజనం అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్‌స్క్రిప్షన్.

ఎయిర్‌టెల్ రూ. 3999 ప్లాన్ ప్రయోజనాలు: ఎయిర్‌టెల్ రూ. 3999 ప్రీపెయిడ్ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ రోజుకు 2.5GB డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్ అపరిమిత కాల్స్, రోజుకు 100 SMSలను అందిస్తుంది. ఈ ప్లాన్ మూడు నెలల జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా అందిస్తుంది. దీనికి కూడా 365 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది.

ఇది కూడా చదవండి: Indian Railways: రైలులో రాత్రి 10 దాటితే ఇవి అస్సలు చేయకూడదు.. ప్రయాణికులు తప్పక తెలుసుకోవాల్సిన నిబంధనలు!

ఇది కూడా చదవండి: New Rules: సెప్టెంబర్ 1 నుండి మారనున్న నిబంధనలు.. ఎల్‌పిజి సిలిండర్ ధ‌ర‌ల‌తో పాటు ఆధార్‌లో కీల‌క మార్పులు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..